
Daily Current Affairs in Telugu 22-01-2020
ఐదుగురు తెలుగు చిన్నారులకు ప్రధాన మంత్రి బాలశక్తి పురస్కారాలు:

గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రతి సంవత్సరం అందించే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్-2020 ను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు చిన్నారులు అందుకున్నారు.జనవరి 22న రాష్ట్ర పతి బవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీటిని స్వీకరించారు.కళలు సంస్కృతి,సాహసం,నవకల్పన,పాండిత్యం,సామాజిక సేవ ,క్రీదలవిభాగాల్లో విశేష ప్రతిభ కనబరచిన 5నుంచి 18ఏల్ల లోపు పిల్లలకు రూ.లక్ష నగదు బహుమతి,ప్రశంసా పత్రం అందించారు.ఇందులో తెలంగాణా నుంచి ఇంద్రజాలంలో అద్బుత ప్రతిభ కనబరుస్తున్నదర్శ మాలని(కళలు-సంస్కృతి),10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జాతీయ రికార్డు నెలకొల్పిన ఇషా సింగ్ ,మౌంట్ కిలిమంజారో ,మౌంట్ కుషి కోజ్ అధిరోహించినందుకు సామాన్య పోతురాజు (క్రీడలు )ఉన్నారు.కర్ణాటక సంగీతంలో అద్బుత ప్రతిభ కనబరుస్తూ దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చ్సినందుకు శరబ్య ముదుండి(కళలు-సంస్కృతి ),అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ లో స్వర్ణ పథకం గెలుచుకున్నందుకు ఆకుల సాయి సంహిత (క్రీడలు)ఆంద్రప్రదేశ్ నుంచి ఈ గౌరవ పురస్కారాలు అందుకున్నారు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐదుగురు తెలుగు చిన్నారులకు ప్రధాన మంత్రి బాలశక్తి పురస్కారాలు
ఎవరు : రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు:జనవరి22
ప్రపంచ ప్రతిభ సూచిలో భారత్ కు 72వ స్థానం :

ప్రపంచ ప్రతిభ పోటితత్వ సూచిలో భరత్ ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకొని 72 స్థానంలో నిలిచింది.ప్రతిభను పెంచడం ఆకర్షించడం,కాపాడుకోవడం లో ఆయా దేశాల సామర్త్యాలను బేరీజు వేసి ఈ సూచిలో ర్యాంకులు కేటాయిస్తారు,132 దేశాలతో రూపొందించిన ఈ సూచిలో స్విట్జర్ ల్యాండ్ మొదటి స్థానలో నిలిచింది.అమెరికా ,సింగపూర్ లు 2,3 స్థానాల ను దక్కించుకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ప్రతిభ సూచిలో భారత్ కు 72వ స్థానం
ఎక్కడ:దావోస్
ఎప్పుడు:జనవరి 22
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ప్రజా స్వామ్య సూచిలో దిగజారిన భరత్ స్థానం :

ప్రజా స్వామ్య సూచి ప్రపంచ ర్యాంకింగ్ లో భారత్ యొక్క స్థానం దిగజారింది.అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2019 లో పది స్థానాలు కోల్పోయింది.క్రమేనా పౌర హక్కుల ను అణచి వేయడమే ఇందుకు ప్రదాన కారణమని ది ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ జరిపిన ప్రపంచ వ్యాప్త సర్వేలో వెల్లడయింది.ప్రజాస్వామ్య సూచీ ప్రపపంచ ర్యాంకింగ్ విషయంలో 2019 లో భారత్ 6.90 స్కోరు సంపాదించి 51వ స్థానంలో నిలిచింది.అదే 2018లో 7.23 స్కోరు పొందింది.మొత్తం 165 స్వతంత్ర దేశాలు ,రెండు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.ఎన్నికల ప్రక్రియ ,బహులటం ,ప్రబుత్వ పనితీరు,రాజకీయ పార్టీల భాగస్వామ్యం ,రాజకీయ సంస్కృతి ,పౌర హక్కులు అనే అయిదు అంశాలను ఆధారం చేసుకొని స్కోరు ఇచ్చింది.ఈ మేరకు భారత్ బలహీన ప్రజాస్వామ్యం అన్న వర్గంలో చేరింది.బ్రెజిల్ కన్నా కేవలం ఒక్క స్థానం ముందుండం వేశేషం.6.86 స్కోరుతో ఆ దేశం 52 వ స్థానంలో ఉంది.చైనాకు 2.26 స్కోరు (153వ ర్యాంకు ),పాకిస్తాన్ కు 4.25 (108వ ర్యాంకు),శ్రీలంక కు 6.27 (69వ స్థానం ),బంగ్లాదేశ్ 5.88)(89వ స్థానం ) రష్యాకు 3.11 స్కోరు (134వ స్థానం ) లబించాయి.చిట్టచివరిదైన167వస్థానంలోదక్షిణకొరియానిలిచిది.మొదటపదిస్థానాల్లోనార్వే(1),ఐస్లాండ్,(2),స్వీడన్(3),న్యూజిలాండ్(4),ఫిన్లాండ్(5),ఐర్లాండ్(6),డెన్మార్క్(7),కెనడా(8),ఆస్త్రేలియ(9) స్విట్జర్లాండ్ (10) స్థానాల్లో ఉన్నాయి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రజా స్వామ్య సూచిలో దిగజారిన భరత్ స్థానం
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు:జనవరి22
ఆస్త్రేలియ చారిటి మ్యాచ్ కోచ్ గా సచిన్ నియామకం :

ఇటీవల ఆస్ట్రేలియా లో జరిగిన కార్చిచ్చు బాధితుల కోసం విరాళాలు సేకరిచెందుకు 2020,ఫిబ్రవరి 8న క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఒక చారిటి మ్యాచ్ ను నిర్వహిస్తుంది.ఈ మ్యాచ్ లో జరిగే ఇరు జట్లకు షేన్ వార్న్ ,రికి పాంటింగ్ లు జట్టు కేప్తన్లుగా వ్యవహరిస్తారు.రికీ పాంటింగ్ జట్టుకు సచిన్ టెండూల్కర్ కోచ్ గా వ్యవహరిస్తుండగా షేన్ వార్న్ జట్టు కు కొట్ని వాల్ష్ కోచ్ లుగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయాన్నీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సియివో కేపిన్ రాబర్ట్స్ జనవరి 21 న తెలిపారు.ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ రికవరీ ఫండ్ కు అందజేయనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వారు తెలిపారు. .
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్త్రేలియ చారిటి మ్యాచ్ కోచ్ గా సచిన్ నియామకం
ఎవరు : సచిన్ టెండూల్కర్
ఎక్కడ:ఆస్ట్రేలియా
ఎప్పుడు:జనవరి22
తెలంగాణా లో ఎస్ఈసిసి పేరుతో కేంద్ర ప్రబుత్వం సర్వ్ నిర్వహణ :

తెలంగాణా రాష్ట్రంలోని గ్రామీణ జీవన ప్రమాణాలపై కేంద్ర ప్రబుత్వం సర్వే నిర్వహించబోతుంది.పదేళ్ళలో మారిన ప్రజల స్థితి గ్గతుల గురించి క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టనుంది.సామాజిక,ఆర్ధిక,కుల ,గణన (ఎస్ఈసిసి)పేరిట ఇంటింటి సర్వే నిర్వహించాబోతున్నట్లు కేంద్ర గ్రామిణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ జనవరి 21 న వెల్లడించింది.రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ సహకారంతో 2020,ఏప్రిల్ 14 వరకు ఈ సర్వే వివరాలను సేకరించాలని నిర్ణయించింది.ఎస్ఈసిసి ద్వారా ప్రజలకు అందుతున్న్న కనీస సేవలను ,ప్రబుత్వ పథకాలను అమలు ,ఇతరత్రా సామజిక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణా లో ఎస్ఈ సిసి పేరుతో కేంద్ర ప్రబుత్వం సర్వ్ నిర్వహణ :
ఎవరు :కేంద్ర ప్రబుత్వం
ఎక్కడ:తెలంగాణ
ఎప్పుడు:జనవరి22
.