
Daily Current Affairs in Telugu 21 July -2022
2023 లో జరగనున్న జాతీయ క్రీడలకు ఆథిత్యం ఇవ్వనున్న గోవా రాష్ట్రము :

వచ్చే ఏడాది2023లో జరుగనున్న జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. 2016 జాతీయ క్రీడలను గోవాకు కేటాయించగా మౌలిక వసతుల ఏర్పాటులో జాప్యం కారణంగా రెండు సార్లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు 2023 జాతీయ క్రీడలు గోవాకు కేటాయించినట్లు ఆ రాష్ట్ర క్రీడల మంత్రి గోవింద్ తెలిపారు. “కేంద్ర క్రీడల శాఖతో సంప్రదింపుల అనంతరం భారత ఒలింపిక్ సంఘం నుంచి గోవా ప్రభుత్వానికి ఈమెయిల్ వచ్చింది. 202లో జరిగే 37వ జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యమిస్తుంది” అని గోవింద్ పేర్కొన్నారు. 2022 డిసెంబరులోపు మౌలిక వసతుల ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు.
- గోవా రాష్ట్ర రాజధాని :పనాజి
- గోవా రాష్ట్ర సిఎం : ప్రమోద్ సావంత్
- గోవా రాష్ట్ర గవర్నర్ : పీ.ఎస్ శ్రీధరన్ పిళ్ళై
క్విక్ రివ్యు :
ఏమిటి: 2023 లో జరగనున్న జాతీయ క్రీడలకు ఆథిత్యం ఇవ్వనున్న గోవా రాష్ట్రము
ఎక్కడ: గోవా రాష్ట్రము
ఎప్పుడు : జులై 21
ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ కు ఎంపికైన కౌశిక్ రాజశేఖర ;

అమెరికాలోని హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన కౌశిక్ రాజశేఖర ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్కు ఎంపికయ్యారు. విద్యుత్తు ఉత్పా దక ఉద్గారాలను తగ్గించేటప్పుడు విద్యుత్తు రవాణా, శక్తి సామర్థ్య సాంకేతికతల రంగంలో అందించిన సేవలకు గాను ఆయనకు ఈ బహుమతి దక్కింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల నుంచి 119 నామినేషన్లు రాగా, ముగ్గురిని మాత్రమే గ్లోబల్ ఎనర్జీ ఆసోసియేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అక్టోబరు 12 – 14 తేదీల మధ్య మాస్కోలో జరిగే రష్యన్ ఎనర్జీ వారోత్సవాల్లో ఈ అవార్డులను అందజేస్తారు. దక్షిణ భారతదేశంలోని ఓ కుగ్రామం నుంచి వచ్చి రాజశేఖర ఈ స్తాయికి ఎదిగారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ కు ఎంపికైన కౌశిక్ రాజశేఖర
ఎవరు : కౌశిక్ రాజశేఖర
ఎక్కడ: అమెరికాలో
ఎప్పుడు : జులై 21
ఇటలీ దేశ ప్రధాని మారియో డ్రాగ్ పదవికి రాజీనామా :

ఇటలీ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. సంకీర్ణ సర్కారులోని జీలక, మిత్రపక్షాల మద్దతు కోల్పోవడంతో ప్రధాని మారియో డ్రాగ్ తన పదవికి రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు సెర్డియో మాటరెలాను కలిసి జులై21న రాజీనామా లేఖ సమర్పించారు. ద్రవ్యోల్బణం, బందన ధరల్లో పెరు. గుదల, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తదితర పరిణామాలతో ఇటలీ కొన్నా గా తీవ్రంగా సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో జీవన వ్యయం పెరుగుదల సంక్షోలు నుంచి వేళ ప్రజలను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును ప్రభుత్వం గతవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అది ఆమోదం పొందలేదు. వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు డ్రాగ్ ముందుకొచ్చారు. అందుకు నిరాకరించిన చేశాధ్యక్షుడు మానెలా, పార్లమెంటుకు సమావేశపరిచి బిల్లు ఆమోదానికి ప్రయత్నించాలని మరో సూచిచారు. ఈ మేరకు బుధవారం మళ్లీ భేటీని ఏర్పాటుచేయగా మిత్ర పక్షులు గైర్హాజరయ్యాయి. దీంతో: త్రాగి వాజీనామా చేయాల్సి వచ్చింది.
- ఇటలి దేశ రాజధాని : రొమ్
- ఇటలి దేశ కరెన్సీ :యూరో
- ఇటలి దేశ అద్యక్షుడు : మారియో ద్రాగి
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇటలీ దేశ ప్రధాని మారియో డ్రాగ్ పదవికి రాజీనామా
ఎవరు : మారియో డ్రాగ్
ఎక్కడ: ఇటలీ దేశ౦
ఎప్పుడు : జులై 21
నీతి ఆయోగ్ యొక్క ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో నిలిచిన కర్నాటక :

కర్ణాటక, మణిపూర్ మరియు చండీగఢ్ లు ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ యొక్క ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ యొక్క మూడవ ఎడిషన్ (2021)లో అగ్రస్థానంలో ఉన్నాయి, నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్, సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్, సీనియర్ అడ్వెజర్ నీరజ్ సిన్హా సమక్షంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021ని విడుదల చేశారు. మొదటి మరియు రెండవ ఎడిషన్ల 2021లో ప్రారంభించబడ్డాయి. ‘మేజర్ స్టేట్స్ ‘ విభాగంలో కర్ణాటక అగ్రస్థానంలో నిలవగా, ‘నార్త్ ఈస్ట్ అండ్ హిల్ స్టేట్స్’ విభాగంలో మణిపూర్ విజేతగా నిలిచింది. ‘కేంద్రపాలిత ప్రాంతాలు మరియు నగర రాష్ట్రాలు’ విభాగంలో చండీగఢ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నివేదిక ప్రకారం, ఎఫ్ డిఐని ఆకర్షించడంలో మరియు పెద్ద సంఖ్యలో వెంచర్ క్యాపిటల్ ఒప్పందాలను ఆకర్షించడంలో కర్నాటక అత్యధిక స్కోర్కు కారణమని చెప్పొచ్చు .
- కర్ణాటక రాష్ట్ర రాజధాని :బెంగళూర్
- కర్ణాటక రాష్ట్ర సిఎం :బసవరాజ్ బొమ్మై
- కర్ణాటక రాష్ట్ర గవర్నర్ :థావర్ చాంద్ గెహ్లాట్
క్విక్ రివ్యు :
ఏమిటి: నీతి ఆయోగ్ యొక్క ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో నిలిచిన కర్నాటక
ఎవరు : కర్నాటక
ఎప్పుడు : జులై 21
భారత రాష్ట్రపతి ఎన్నికలలో విజయం సాధించిన ద్రౌపది ముర్ము :

భారత రాష్ట్రపతి ఎన్నికల లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు.భారత దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ముర్ము విజయ దుందు౦బి మోగించారు.. సగానికి పైగా ఓట్లు సాధించి ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత రాష్ట్రపతి ఎన్నికలలో విజయం సాధించిన ద్రౌపది ముర్ము
ఎవరు : ద్రౌపది ముర్ము
ఎప్పుడు : జులై 21
TATA ప్రాజెక్ట్స్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్గా వినాయక్ పాయన్ నియామక౦ :

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు అత్యంత ఆరాధించే మౌలిక సదుపాయాల కంపెనీలలో ఒకటైన TATA ప్రాజెక్ట్స్ లిమిటెడ్, 22 జూలై 2022 నుండి దాని మేనేజింగ్ డైరెక్టర్ గా వినాయక్ పాయన్ ను నియమించింది. 11 సంవత్సరాలకు పైగా విజయవంతంగా వ్యవహారాలకు నాయకత్వం వహించి పదవీ విరమణ చేయనున్న శ్రీ వినాయక్ దేశపాండే నుండి శ్రీ వినాయక్ పాయి పగ్గాలు చేపట్టారు. వినాయక్ పాయన్ ప్రముఖ ఇంజినీరింగ్ EPC కంపెనీలతో మూడు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని కలిగి ఉన్నారు. టాటా ప్రాజెక్ట్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు ఆరాధించే మౌలిక సదుపాయాల కంపెనీలలో ఒకటి. ఇది పెద్ద మరియు సంక్లిష్టమైన పట్టణ మరియు పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేయడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: TATA ప్రాజెక్ట్స్ లిమిటెడ్ , మేనేజింగ్ డైరెక్టర్గా వినాయక్ పాయన్ నియామక౦
ఎవరు : వినాయక్ పాయన్
ఎప్పుడు : జులై 21
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |