
Daily Current Affairs in Telugu 21-09-2020
ఇటాలియన్ ఓపెన్ టైటిల్స్ ను గెలుచుకున్న సిమోన హలేప్ ,నోవాక్ జకోవిచ్ :

ఫ్రెంచ్ ఓపెన్ ముంగిట నోవాక్ జకోవిచ్ కు ఇది స్పూర్తినిచ్చే విజయం. ఈ సెర్బియా స్టార్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.సెప్టెంబర్ 21న జరిగిన పురుషుల సింగిల్స్ లో ఫైనల్లో జకోవిచ్ 7-5,6-3 తో స్క్వాట్జ్ మాన్ (అర్జంటినా )ను ఓడించాడు.తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదుర్కొన్న జకోవిచ్ పదకొండో గేమ్ లో అతని సర్వీస్ బ్రేక్ చేసి సెట్ గెలిచాడు.రెండో సెట్లోనూ అదే జోరు ప్రదర్శించిన నోవాక్ సెట్ తో పాటు టైటిల్ సొంతం చేసుకున్నాడు.ఈ టోర్నీలో ఆటతో కాక తన చర్యలతో అంపైర్ల నుంచి హెచ్చరికలు అందుకున్న జకోవిచ్ తాజాగా విజయం ఉరటనిచ్చింది. మహిళల టైటిల్ ను టాప్ సీడ్ సిమోనా హలేప్ (రొమేనియా) సాధించింది.ఫైనల్లో ఆమె 6-0,2-1 తో ఆధిక్యం తో ఉన్న సమయంలో ప్రత్యర్థి కరోలినా ఫ్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకుంది. వెన్ను గాయంతో బాధపడిన కరోలినా అయినా ఆటను కొనసాగించింది.తొలి సెట్లో మూడు సార్లు సర్వీస్ కోల్పోయిన ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి రెండో సెట్లో వెనుకబడిన దశలో వైదొలిగింది.దీంతో ట్రోఫీ హాలేప్ సొంతమైంది.2017,2018 సీజన్లో ఈ టోర్నీలో చేరిన సిమోనా విజేతగా నిలవడం ఇదే మొదటి సారి.ఈ సీజన్లో ఆమెకిది మూడోవ టైటిల్
క్విక్ రివ్యు:
ఏమిటి: ఇటాలియన్ ఓపెన్ టైటిల్స్ ను గెలుచుకున్న సిమోన హలేప్ ,నోవాక్ జకోవిచ్
ఎవరు: సిమోన హలేప్ ,నోవాక్ జకోవిచ్
ఎక్కడ:ఇటలి (రోమ్)
ఎప్పుడు: సెప్టెంబర్ 21
తొలి సారి గా యుద్దనౌకల విధులలో కి చేరిన ఇద్దరు నారీమణులు :

అడ్డు గోడలు తొలగిపోయాయి ఆకాశమే హద్దుగా అతివలు దూసుకుపోతున్నారు.కదనరంగాలోకి దూకి శత్రుదేశాలపైకి గర్జించడానికి మహిళా శక్తి సమాయత్తమవుతుంది. భారత నౌకా దళంలో తొలిసారి గా ఇద్దరు మహిళా అధికారులు కీలక బాద్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు.సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి,సబ్ లెఫ్టినెంట్ రీతి సింగ్ లు యుద్ద నౌక ల్ల్లోని హెలికాప్టర్ లో పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు నౌకదళం లో మహిళల నియామకం తీరప్రాంతం లో స్తావరాల నుంచి పయనమయ్యే విమానాల వరకే పరిమితమైంది.ఇప్పుడు యుద్దనౌకలపై మొహరించే హెలికాఫ్టర్ లో విధులు నిర్వర్తించే అవకాశం అతివలకు తొలిసారిగా దక్కింది. ఈ మహిళా అధికారులు ఇద్దరు భారత నౌకా దళం తీర రక్షణ దళం లో ని సముద్ర నిఘా జలాంతర్గామి విధ్వంసక విమానాలలో పరిశీలకులుగా విధులు నిర్వహిస్తారు..
క్విక్ రివ్యు:
ఏమిటి: తొలి సారి గా యుద్దనౌకల విధులలో కి చేరిన ఇద్దరు నారీమణులు
ఎవరు: కుముదిని త్యాగి, రీతి సింగ్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 21
ప్రపంచ బ్యాంకు మానవ మూలధన సూచికలో 116 వ స్థానంలో నిలిచిన భారత్:

ప్రపంచ బ్యాంక్ “ది హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020 అప్డేట్ ప్రకారం హ్యూమన్ క్యాపిటల్ ఇన్ ది టైమ్ ఆఫ్ కోవిడ్ -19” అనే నివేదికను విడుదల చేసింది. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ (హెచ్సిఐ) 2020 అనేది మానవ అభివృద్ధి ప్రాక్టీస్ గ్రూప్ మరియు ప్రపంచ బ్యాంకు యొక్క డెవలప్మెంట్ ఎకనామిక్స్ గ్రూప్ మధ్య సహకారం ఇది దేశవ్యాప్తంగా మానవ మూలధనం యొక్క ముఖ్య అంశాలను కేంద్రంగా సూచింస్తుంది. ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ నివేదిక ప్రకారం, భారతదేశ స్కోరు 2018 లో 0.44 నుండి 0.49 కు పెరిగింది హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ప్రకారం 2020 లో 174 దేశాలలో భారత్ 116 వ స్థానంలో ఉంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ బ్యాంకు మానవ మూలధన సూచికలో 116 వ స్థానంలో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: సెప్టెంబర్ 21
ప్రముఖ విలక్షణ నటి సీతాదేవి కన్నుమూత :

ప్రముఖ సీనియర్ నటి దివంగత విలక్షణ నటుడు నాగాబూషణం సతిమనణి పొట్నూరి సీతాదేవిగారు (87) కన్నుమూసారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపతున్న ఆమె సెప్టెంబర్ 21న ఉదయం తన స్వగ్రుహం లో తుదిశ్వాస విడిచింది.1933 అక్టోబర్ 14 న కాకినాడలో రామస్వామి దంపతులకు జన్మిచారు. సీతాదేవి. ఈమె 1947 లో కెవి రెడ్డి దర్శకత్వంలో తీసిన “యోగి వేమన” లో బాల నటిగా కనిపించరు.కెవి రెడ్డి రూపొందించిన మాయాబజార్, గుణ సుందరి కథ ,పెళ్లి నాటి ప్రమాణాలు, పెద్దమనుషులు తదితర చిత్రాలలో హాస్య పాత్రలో చెలికత్తె పాత్రలు చేసారు. కేవలం హాస్యమే కాకుండా తన లోని నటిని అన్ని రసాలలో తన నటనను ఆవిష్కరించారు. సీత 1940 నుండి ప్రారంబమైన ఆమె సినీ ప్రస్తానం 2002 లో “నేనేరా పోలిస్” సినిమా వరకు సాగింది.దాదాపు 225 చిత్రాలలో ఈమె నటించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రముఖ విలక్షణ నటి సీతాదేవి కన్నుమూత
ఎవరు: నటి సీతాదేవి
ఎప్పుడు: సెప్టెంబర్ 21
అంతర్జాతీయ శాంతి దినోత్సవం గా సెప్టెంబర్ 21 :

అంతర్జాతీయ శాంతి దినోత్సవం (యుఎన్) సెప్టెంబరు 1982 నుండి ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్న అత్యంత ప్రత్యేకమైన రోజులలో ఇది ఒకటి. 2001 లో, జనరల్ అసెంబ్లీ 55/282 తీర్మానాన్ని ఆమోదించింది. ఇది సెప్టెంబర్ 21వ రోజును ను అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని సూచించింది. హింస మరియు కాల్పుల విరమణను నియమం ను ఇది సూచిస్తుంది
క్విక్ రివ్యు:
ఏమిటి: అంతర్జాతీయ శాంతి దినోత్సవం గా సెప్టెంబర్ 21
ఎవరు:ప్రపంచ దేశాలు
ఎప్పుడు:సెప్టెంబర్ 21
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |