
Daily Current Affairs in Telugu 20&21-07-2021
దాశరథి కృష్ణమాచార్య-2021 పురస్కారానికి ఎంపికైన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి :

దాశరథి కృష్ణమాచార్య-2021 పురస్కారానికి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, సాహితీ . వేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సాహితీ రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని ప్రభుత్వపరంగా గుర్తించి పురస్కారంతో పాటు రూ.1,01,116 నగదును ఇస్తున్నామన్నారు. రవీంద్రభారతిలో జులై 22న నిర్వహించే దాశరథి జయంతి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉత్సవాల్లో దీన్ని ప్రదానం చేస్తామన్నారు. ఆచార్య శివారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతిగా రెండు పర్యాయాలు (1996-98, 2000–2002) పనిచేశారు. ఉస్మానియా వర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ (తెలుగు శాఖ) చైర్మన్, దేశంలోని వివిధ వర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ నంది ఫిలిం అవార్డుల కమిటీ (1999) జ్యూరీ సభ్యులుగా, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల కమిటీలో (1999-2001) సభ్యులుగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అయిదో ప్రపంచ మహాసభల ప్రత్యేక సంచిక సంపాదకత్వం వహించారు. 2015-16లో తెలంగాణ దాశరథి కృష్ణమాచార్య పురస్కారాల కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జీవితం సాహిత్యం (1972) పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, ‘పూలకారు’ (1998) కు స్వర్ణ సాహితీ పురస్కారం, రసమయి సంస్థ ద్వారా సురవరం సాహితీ పురస్కారాలను అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: దాశరథి కృష్ణమాచార్య-2021 పురస్కారానికి ఎంపికైన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
ఎవరు: ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: జులై 21
టోక్యో ఒలింపిక్స్ లో అంపైర్ల ప్యానల్లో భారత్ కు చెందిన దతాన్ కు చోటు :

టోక్యో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ లో సేవలందించే 26 మంది సభ్యుల అంపైర్ల ప్యానల్లో భారత్ కు చెందిన దతాన్ కు చోటు దక్కింది. కేరళకు చెందిన 50 ఏళ్ల దతాన్ జులై 20 న టోక్యో బయల్దేరి వెళ్లాడు. అతడు ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఎరైట్ ప్యానల్లో సభ్యుడిగా ఉన్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడలు, థామస్, ఉబర్ కప్లకు దతాన్ రిఫరీగా పని చేశాడు. జులై 23న ఆరంభమయ్యే క్రీడల్లో, బ్యాడ్మింటన్ లో భారత్ నుంచి పి. వి.సింధు, సాయిప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పోటీపడుతున్న సంగతి తెలిసిందే
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో ఒలింపిక్స్ లో అంపైర్ల ప్యానల్లో భారత్కు చెందిన దతాన్ కు చోటు
ఎవరు: దతాన్
ఎప్పుడు: జులై 21
ఏఎస్జీబీఐ ప్రతిష్టాత్మక పురస్కారం కు ఎంపికైన డాక్టర్ పి. రఘురాం :

ప్రముఖ శస్త్రచి కిత్స నిపుణులు, కిమ్స్ ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పి. రఘురాంను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. బ్రిటన్, ఐర్లాండ్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన సర్జన్ల సంస్థ ఏఎస్జీబీఐ (అసోసియే షన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్).. గౌరవ సభ్యత్వం (ఫెలోషిప్) తో సత్కరించింది. మంగళవారం ఆన్లైన్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఏఎసీజీబీఐ అధ్యక్షుడు నీల్ వెల్క్ డాక్టర్ పి.రఘురాంకు ఈ గౌరవ సభ్యత్వం అందజేశారు. ఇందులో ఫెలోషిప్ లభించలేదు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడిగా రఘురాం గుర్తింపు పొందారు. మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు. భారత్,యూకే మధ్య వైద్య పరిజ్ఞాన మార్పిడిలో వారధిగా వ్యవహరిస్తున్నందుకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు ఏఎసీజీబీఐ తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏఎస్జీబీఐ ప్రతిష్టాత్మక పురస్కారం కు ఎంపికైన డాక్టర్ పి. రఘురాం
ఎవరు: డాక్టర్ పి. రఘురాం
ఎప్పుడు: జులై 21
మిస్ ఇండియా యూఎస్ఏ-2021 కిరీటాన్ని కైవసం చేసుకున్న వైదేహి డోంగ్రే :

మిషిగన్ కు చెందిన వైదేహి డోంగ్రే(25) మిస్ ఇండియా యూఎస్ఏ-2021 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. వారాంతంలో జరిగిన అందాల పోటీల్లో జార్జియాకు చెందిన అర్షి లాలాని తొలి రన్నరప్ గా నిలిచారు. దాదాపు 30 రాష్ట్రాల నుంచి 61 మంది ఇందులో పాల్గొన్నారు. మిషిగన్ విశ్వవిధ్యాలయం నుంచి పట్టభద్రురాలైన డోంగ్రే, ప్రస్తుతం ఓ ప్రధాన సంస్థలో వ్యాపార అభివృద్ధి నిర్వాహకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘మహిళల ఆర్థిక స్వాతంత్య్రం, అక్షరాస్యతపై దృష్టి సారిస్తాను” అని ఈ సందర్భంగా తెలిపారుభారత శాస్త్రీయ నృత్యం అయిన కథక్ లో మిస్ టాలెంటెడ్ అవార్డును కూడా ఈమె గెలుచుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మిస్ ఇండియా యూఎస్ఏ-2021 కిరీటాన్ని కైవసం చేసుకున్న వైదేహి డోంగ్రే
ఎవరు: వైదేహి డోంగ్రే
ఎప్పుడు: జులై 21
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా నుంచి తొలగించబడిన లివర్ పూల్ :

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా నుంచి లివర్ పూల్ ను తొలగించారు. ఈ మేరకు యునెస్కో నిర్ణయం తీసుకుంది. లివర్ పూల్ చుట్టుపక్కల అతిగా జరుగుతున్న అభివృద్ధి, ఆకాశ హర్మ్యాలు సహా కొత్తగా భారీ ఫుట్ బాల్ స్టేడియం నిర్మాణానికి రూపొందిస్తున్న ప్రణాళికలు దీనికి కారణంగా పేర్కొంది. వీటివల్ల చరిత్రాత్మక ఓడరేవు నగరానికి సరిదిద్దలేని నష్టం కలుగుతుందని అభిప్రాయపడింది. రెండ్రోజుల చర్చల అనంతరం నిర్వహించిన ఓటింగులో తీర్మానానికి అనుకూలంగా 13 ఓట్లు, వ్యతిరేకంగా ఐదు ఓట్లు పడ్డాయి. లివర్ పూల్ మారిటైం మర్కంటైల్ సిటీ’ని జాబితా నుంచి తొలగిస్తున్నట్లు యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ చైర్మన్ తియాన్ షుజున్ ప్రకటించారు. ఇలాంటి తొలగింపు జరగడం మూడోసారి. గతంలో ఒమన్, జర్మనీలకు చెందిన రెండింటిని ఇలాగే తొలగించారు. జాబితా నుంచి తొలగించడంపై బ్రిటన్ సాంస్కృతిక శాఖ మంత్రి కరోలిన్, లివర్పూల్ మేయర్ ఆండర్సన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా నుంచి తొలగించబడిన లివర్ పూల్
ఎవరు: లివర్ పూల్
ఎప్పుడు: జులై 21
2032 ఒలింపిక్స్ కు వేదికగా ఎంపికైన ఆస్టేలియా లోని బ్రిస్బేన్ :

వచ్చే ఒలింపిక్స్ (2024) పారిస్ లోను. ఆ తర్వాత (2028) లాస్ ఏంజెల్స్. లోను జరుగుతుండగా ఇప్పుడు ఆ తర్వాతి ఆతిధ్య నగరం కూడా ఖరారైంది. 32 ఏళ్ల విరామం తర్వాత ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ జరగనున్నాయి. 2032 ఒలింపిక్స్ కు వేదికగా బ్రిస్బేన్ ఎంపికైంది. చివరిసారి ఆస్ట్రేలియాలో 2000 (సిడ్నీ) లో ఒలింపిక్స్ జరిగాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ రాష్ట్రానికి బ్రిస్బేన్ రాజధాని. ఆ దేశంలో ఇది మూడో అతి పెద్ద నగరం. జులై20 న టోక్యోలో సమావేశమైన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) బ్రిస్బేన్ కు 2032 ఒలింపిక్స్ అతిత్య నగరం గా ఖరారు చేసింది. ఐఓసీ నెషన్ ను భారీ తెరపై వీక్షించిన బ్రిస్బేన్ వాసులు ప్రకటన వెలువడగానే హర్షాతిరేకాలు చేశారు. “ఇది బ్రిస్బేన్, క్వీన్స్ లాండ్కే కాదు. ఆస్ట్రేలియాకే చారిత్రక రోజు. కేవలం విశ్వ నగరాలకే ఇలాంటి అవకాశం దక్కుతుంది. కాబట్టి ఇది బ్రిస్బేన్ కు గొప్ప గుర్తింవే” అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా తొలిసారి 1956లో మెల్బోర్న్ లో ఒలింపిక్స్ కు ఆతిధ్యమిచ్చింది. అమెరికా తర్వాత మూడు వేరు వేరు నగరాల్లో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం దక్కిన దేశం ఆస్ట్రేలియానే.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2032 ఒలింపిక్స్ కు వేదికగా ఎంపికైన ఆస్టేలియా లోని బ్రిస్బేన్
ఎవరు: బ్రిస్బేన్
ఎక్కడ: ఆస్టేలియా లో
ఎప్పుడు: జులై 21
రాజ్యసభలో డిప్యూటీ లీడర్ ఆఫ్ హౌస్ గా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ను నియమకం ;

భారత ఎగువ సభ గ పిలువబడే రాజ్యసభలో డిప్యూటీ లీడర్ ఆఫ్ హౌస్ గా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ను నియమించారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీని రాజ్యసభలో సభకు డిప్యూటీ లీడర్‌గా నియమిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రకటించింది. ఇంటి నాయకుడిగా ఎదిగిన పియూష్ గోయల్ నుంచి నఖ్వీ బాధ్యతలు స్వీకరించారు.. వారు ఎగువ సభలో ప్రతిపక్షాలను నిర్వహించవలసి ఉంటుంది మరియు బిల్లులను ఆమోదించడానికి వీలుగా హౌస్ ప్రొసీడింగ్స్ సజావుగా జరిగేలా చూడాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: రాజ్యసభలో డిప్యూటీ లీడర్ ఆఫ్ హౌస్ గా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ను నియమకం
ఎవరు: ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
ఎప్పుడు: జులై 21
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |