Daily Current Affairs in Telugu 20-09-2020
ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగ అటల్ సొరంగ మార్గం సిద్దం :
హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి-లేహ్ జాతీయ రహదారిపై లాహౌల్-స్పిటీ జిల్లాలో కిలో మీటర్ల మేర నిర్మించిన సొరంగమార్గం ప్రారంభానికి అంత సిద్ధమైంది. సముద్రమ ట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో చేపట్టిన ఈ నిర్మాణం.. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగమార్గాల్లో అత్యంత. పొడ వైంది. రోహ్తాంగ్ పాస్ వద్ద నిర్మించిన ఈ అటల్ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని సరిహద్దు రహదారి సంస్థ(బి ఆర్ వో) ఉన్నతాధికారి బ్రిగేడియర్ కేపీపురుషోత్తమన్ సెప్టెంబర్ 20న తెలిపారు.ఈ నెల చివరి లో ప్రదాని నరేంద్ర మోడి దీనిని ప్రారంబిన్చానున్నారని తెలిపారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగ అటల్ సొరంగ మార్గం సిద్దం :
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్ లోని
ఎప్పుడు: సెప్టెంబర్ 20న
మాజీ ప్రదాని దేవా గౌడ రాజ్యసభ సబ్యుడిగా ప్రమాణ స్వీకారం :
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్.డి. దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా సెప్టెంబర్ 20న ప్రమాణ స్వీకారం చేశారు. జూన్లో కర్ణాటక నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. జనతాదళ్ (ఎస్) నుంచి 1998 తరువాత రాజ్యసభకు ఎన్నికైన మొదటి వ్యక్తి మాజీ ప్రధాని నిలిచారు. ఆది వారం సభ ప్రారంభం కాగానే ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు కొత్తగా ఎన్నికైన సభ్యు లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో దేవెగౌడ తన మాతృభాష కన్నడలో ప్రమాణం చేయడం విశేషం. మాజీ ప్రధాని దేశంలో సీనియర్ నేత రాజ్యసభలో అడుగు పెట్టారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: మాజీ ప్రదాని దేవా గౌడా రాజ్యసభ సబ్యుడిగా ప్రమాణ స్వీకారం
ఎవరు: దేవా గౌడా
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 20న
మూజు వాని ఓటుతో వ్యవసాయ బిల్లును అమోదిచిన కేంద్ర ప్రభుత్వం :
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా సెప్టెంబర్ 20న రాజ్యసభలో తీవ్ర గందర గోళం నెలకొంది .2010 మార్చి న అప్పటి యూపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా మార్ష ల్ని మోహరించి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకున్న పద్ధతుల్లోనే ఎన్డీయే సర్కారు ప్రస్తుతం ఈ బిల్లులను ఆమోదింపజేసుకుంది. అధికార, ప్రతిపక్షాల్లో ఉన్న వారి స్థానాలు మారినా వ్యూహం అదే అమలు చేసారు.వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలి టేషన్) బిల్లు 2020, ది ఫార్మర్స్ (ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటెక్షన్) ‘అగ్రిమెంట్ ఆన్ ప్రెస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్లు 2020″ లను అడ్డుకోవడానికి విపక్షాలు చేసిన ప్రయ త్నాలను మార్షల్స్ సాయంతో అధికారపక్షం నిర్వీర్యం చేసింది. బిల్లు ఉపసంహరించుకోవాలని, లేదంటే సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతి పక్షాలు చేసిన డిమాండ్లను తోసిపుచ్చుతూ ప్రభుత్వం 2 బిల్లులు మూజువాణి ఓటుతో నెగ్గించుకుంది
క్విక్ రివ్యు:
ఏమిటి: మూజు వాని ఓటుతో వ్యవసాయ బిల్లును అమోదిచిన కేంద్ర ప్రభుత్వం
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 20న
ఇరాన్ పై ఐరాస అంక్షల పునరుద్దరణకు అమెరికా నిర్ణయం :
ఇరాన్ పై ఐక్యరాజ్యసమితి ఆంక్షలను పునరుద్ధరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ పాల కవర్గం సెప్టెంబర్ 20న కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్- జేసీపీఓఏ) నిబంధనలను ఇరాన్ ఏమాత్రం పాటించడం లేదని అమెరికా ఆరోపించింది. ఐరాస భద్రతా మండలి(యూఎన్ ఎస్ సీ) చట్టాల నియమావళి ప్రకారం నోటీసు ఇచ్చిన తరువాత రోజుల గడువు ముగియడంతో ఆంక్షలు తక్షణం అమలులోకి వచ్చాయని పేర్కొంది ఆంక్షలు, వాటిని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సోమవారం శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసే అవకాశ౦ ఉంది అయితే ఈ నిర్ణయం పై ప్రపంచ దేశాలు ,బద్రతా మండలి సభ్య దేశాలు మాత్రం తప్పు పట్టాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఇరాన్ పై ఐరాస అంక్షల పునరుద్దరణకు అమెరికా నిర్ణయం
ఎవరు: ఇరాన్ పై
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: సెప్టెంబర్ 20న
మహిళా హక్కుల గళం రూత్ బాడర్ గిన్స్ బర్గ్ కన్నుమూత :
మహిళల హక్కుల సాధనకు అవిరళ కృష్ణ చేసిన అమెరికా సుప్రీం కోర్టు అనుబంధ న్యాయమూర్తి రూత్ బాడర్ గీన్స్ బర్గ్ (31) సెప్టెంబర్ 19న మృతిచెందారు. కొన్నాళ్లుగా ఆమె క్లోమ క్యాన్సర్తో బాధపడుతున్నారు.స్త్రీవాదిగా న్యాయ కోవిదురాలుగా రూత్ ప్రసిద్ధి. 1998లో అప్పటి అధ్యక్షుడు బిల్ ‘క్లింటన్.. రూత్ సుప్రీంకోర్టుకు నామినేట్ చేయగా చనిపోయేవ రకు 27 ఏళ్లపాటు విశేష సేవలందించారు. ఆమె మరణవార్త తెలియగానే వందలాది మంది వాషింగ్టన్లోని సుప్రీంకోర్టు బయట గుమికూడి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. లింగ సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: మహిళా హక్కుల గళం రూత్ బాడర్ గిన్స్ బర్గ్ కన్నుమూత
ఎవరు: రూత్ బాడర్ గిన్స్ బర్గ్
ఎప్పుడు: సెప్టెంబర్ 19న
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |