
Daily Current Affairs in Telugu 19-07-2021
తెలంగాణ సాంస్కృ తిక సారథి చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన రసమయి బాలకిషన్ ;

తెలంగాణ సాంస్కృ తిక సారథి చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం మంత్రి శ్రీనివా స్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినో ద్ కుమార్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ సమక్షంలో మాదాపూర్ లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రస మయి బాలకిషన్ మాట్లాడుతూ.. కొత్త పాటలు. పుస్తకాలతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరి స్తామన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వ ర్యంలో రూపొందించిన 33 యూట్యూబ్ ఛానెళ్లను, పుస్తకాలను ఆవిష్కరించారు
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ సాంస్కృ తిక సారథి చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన రసమయి బాలకిషన్
ఎవరు: రసమయి బాలకిషన్
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: జులై 19
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2021 లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకున్న పాయల్ కపాడియా :

కేన్స్ 2021 లో భారతదేశానికి చెందిన పాయల్ కపాడియా ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకుంది. దర్శకుడు పాయల్ కపాడియా, “ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్” 74 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీకి (గోల్డెన్ ఐ) అవార్డును గెలుచుకుంది. ముంబైకి చెందిన చిత్రనిర్మాత యొక్క మొట్టమొదటి లక్షణం ప్రతిష్టాత్మక వివిధ విభాగం లో సమర్పించిన 28 విభాగాలలో డాక్యుమెంటరి లతో కూడిన రంగంలో బహుమతి పొందింది. కాగా ఈ ఫెస్టివల్ లో వివిధ విభాగాలలో 28 డాక్యుమెంటరీలు ప్రదర్శించబడ్డాయి. ఫెస్టివల్ కు సమాంతరంగా నడిచే ఒక విభాగం డైరెక్టర్ల ఫోర్ట్‌నైట్‌లో భాగంగా ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ ప్రదర్శించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2021 లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకున్న పాయల్ కపాడియా
ఎవరు: పాయల్ కపాడియా
ఎప్పుడు: జులై 19
గూగుల్ ఇండియా ఎండి సంజయ గుప్తాను చైర్మన్ గా ఐ.ఏ.ఎం.ఐ నియామకం :

2021-23 కాలానికి గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఇండస్ట్రీ బాడీ ఐఐఎంఐఐ తెలిపింది. అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఇండియా కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ తరువాత ఆయన విజయం సాధించారు. ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) ఫేస్బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ను అసోసియేషన్ వైస్ చైర్మన్ గా నియమించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: గూగుల్ ఇండియా ఎండి సంజయ గుప్తాను చైర్మన్ గా ఐ.ఏ.ఎం.ఐ నియామకం
ఎవరు: ఎండి సంజయ గుప్తాను
ఎప్పుడు: జులై 19
విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్ నూతన ప్రధాని షేర్ బహ దూర్ దేవ్ బా :

నేపాల్ నూతన ప్రధాని షేర్ బహ దూర్ దేవ్ బా జులై 18న జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. 275 మంది సభ్యు లున్న పార్లమెంటులో 249 మంది ఓటింగులో పాల్గొనగా ఆయనకు అనుకూలంగా 165 మంది ఓటు వేశారు. నేపాల్ సుప్రీంకోర్టు. ఇచ్చిన తీర్పుతో ఆయన ఈ నెల 13న ప్రధానిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పునరుద్ధరించిన దిగువ సభ సమావేశాలు ఆదివారం. ప్రారంభం కాగా అనూహ్యంగా, తొలిరోజే విశ్వాస పరీక్ష పూర్తయింది. ఒకటిన్న రేళ్లు ఆయన ప్రధానిగా కొనసాగుతారని, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని ప్రచార మాధ్యమాలు తెలిపాయి .
క్విక్ రివ్యు :
ఏమిటి: విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్ నూతన ప్రధాని షేర్ బహ దూర్ దేవ్ బా
ఎవరు: ప్రధాని షేర్ బహ దూర్ దేవ్ బా
ఎక్కడ: నేపాల్ దేశం
ఎప్పుడు: జులై 19
మిజోరం 15వ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన కంభం పాటి హరిబాబు :

ఈశాన్య రాష్ట్రం మిజోరం 15వ గవర్నర్ కంభం పాటి హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారుజులై 19 న సాయంత్రం 4.30 గంటలకు ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ లో ని రాజభవన్ లో జరిగిన కార్యక్రమంలో గువాహటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ జోధానుమా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయి చారు. వాస్తవానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంసు దులియా ప్రమాణం చేయించాల్సి ఉంది. అయితే ఆయన కుటుంబస భ్యులు కరోనాతో బాధపడుతున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో ఉన్న న్యాయమూర్తి మైఖేల్ జోధానుమాకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మిజోరం ముఖ్యమంత్రి జోరందంగా, మంత్రులు, అధికారులు, కంభంపాటి హరిబాబు సతీమణి జయశ్రీ. ఆయన కుమార్తెలు, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: మిజోరం 15వ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన కంభం పాటి హరిబాబు
ఎవరు: కంభం పాటి హరిబాబు
ఎప్పుడు: జులై 19
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |