Daily Current Affairs in Telugu 17-09-2020
4 వ గ్లోబల్ ఆయుర్వేద శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించిన ఎం వెంకయ్య నాయుడు :
గ్లోబల్ ఆయుర్వేద సమ్మిట్ యొక్క 4 వ ఎడిషన్ ను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు “పాండమిక్ సమయంలో ఆయుర్వేదానికి అభివృద్ధి చెందుతున్న అవకాశాలు” అనే అంశంపై ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించారు. ఆయుర్వేద రోగనిరోధక శక్తిని ప్రపంచ స్థాయికి ‘హెల్త్ యాస్ వన్’, ‘ఆయుర్వేదం ద్వారా రోగనిరోధక శక్తి’ అనే పరిష్కారంగా ప్రదర్శించడం ఈ శిఖరాగ్రసమావేశం యొక్క లక్ష్యం. గ్లోబల్ ఆయుర్వేద సదస్సును సిఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) -కేరళ ఆయుష్ మంత్రిత్వశాఖ (ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి) భాగస్వామ్యంతో మరియు ఆయుర్వేద మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AMAI) సహకారంతో నిర్వహిస్తోంది. ఆయుర్వేద మెడిసిన్ తయారీదారుల సంస్థ భారతదేశంలో (AMMOI) మరియు ఆయుర్వేద హాస్పిటల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AHMA). దీనికి యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) లోని నేషనల్ ఆయుర్వేద మెడికల్ అసోసియేషన్ (నామా), స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఆయుర్వేద వైద్యులు మరియు చికిత్సకుల సంఘం, అసోసియేషన్ ఫర్ ఆయుర్వేద మెడిసిన్ నెదర్లాండ్ లు నుబందంగా ఉంటాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: 4 వ గ్లోబల్ ఆయుర్వేద శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించిన ఎం వెంకయ్య నాయుడు
ఎక్కడ:న్యుడిల్లి
ఎవరు: ఎం వెంకయ్య నాయుడు
ఎప్పుడు:సెప్టెంబర్ 17
ఆసియా జెమ్ చెంజర్ పురస్కారానికి ఎంపిక అయిన వికాస్ ఖన్నా :
ప్రముఖ పాక శాస్త్ర నిపుణుడు వికాస్ ఖన్నా దాతృత్వానికితగిన గుర్తింపు లబించింది.కోవిద్ 19 కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ఆకలితో అలమటించిన లక్షలాది పేదలకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణి చేసినందుకు గాను ఆయన్ను “2020 ఆసియా గేమ్ చెంజర్ పురస్కారం” ను వరించింది. ప్రముఖ ఆసియా సొసైటీ సంస్థ సెప్టెంబర్ 17 ఈ అవార్డుకు ఎంపిక అయిన వారి జాబితాను వెల్లడించింది.ఈ పురస్కారానికి ఎంపిక అయిన ఆరుగురు ప్రముఖులలో భారతీయ వ్యక్తి వికాస్ ఒక్కరే. అమెరికాలో మాన్ హోటల్ లోనివాసం ఉంటున్న అయన ఫేడ్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలు వండిన ఆహార పదార్థాల రూపంలో 3.50 కోట్ల మందికి బోజనాలు 35లక్షల శానిటరీ ప్యాడ్లు ,సుమారు 5లక్షల మందికి చెప్ప్డులు ,20 లక్షల మస్కులు తదితర నిత్యావసర వస్తువలను ఆయన పంపిణి చేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆసియా జెమ్ చెంజర్ పురస్కారానికి ఎంపిక అయిన వికాస్ ఖన్నా
ఎవరు: వికాస్ ఖన్నా
ఎప్పుడు: సెప్టెంబర్ 17
ఫెడ్ కప్ ను బిల్లి జీన్ కింగ్ కప్ గా పేరు మర్చిన టెన్నిస్ సమాఖ్య :
మహిళల టెన్నిస్ లోని ఓ చారిత్రిక పరిణామం.ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఫెడ్ కప్ బిల్లి జీన్ కింగ్ కప్ కాబోతుంది.అతివల టెన్నిస్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన అమెరికా మాజీ దిగ్గజ క్రీడాకారిణి బిల్లి జీన్ కింగ్ గౌరవ సూచకంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఫెడ్ కప్ పేరును ఆమె పేరిట మార్చింది.ఒక మహిళా పేరుతో జరగబోతున్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే ..మహిళలకు ఓక సర్క్యూట్ ఉండాలనే ఉద్దేశంతో బిల్లి నేతృత్వంలో తొమ్మిది మంది క్రీడాకారిణులు తమ కెరీర్ లను పణంగా పెడుతూ 1970 లో వర్జీనియాలో స్లాం టూర్ ను ప్రారంబించారు.”ఒరిజినల్ 9” గా పేరు పొందిన ఈ అమ్మాయిల కోసం నెలకొల్పిన ఈ వర్జీనియా స్లామ్స్ టూర్ ఆ తర్వాత మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యటిఎ) గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం మహిళల టెన్నిస్ ను డబ్ల్యుటిఎ నే నడిపిస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఫెడ్ కప్ ను బిల్లి జీన్ కింగ్ కప్ గా పేరు మర్చిన టెన్నిస్ సమాఖ్య
ఎవరు: టెన్నిస్ సమాఖ్య
ఎప్పుడు: సెప్టెంబర్ 17
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాధల్ పదవికి రాజీనామా :
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపంధించిన వ్యవసాయ రంగ బిల్లులపై రాజకీయ రగడ చెలరేగింది.విపక్షాల నుంచే కాక ఎన్డియే మిత్ర పక్ష మైన శిరోమణి అకాలీ దళ్ నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ అకాలిదాల్ పార్టీ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఏకంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసారు.అయినప్పటికీ మోది ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా లోక్ సభలో వాటిని సెప్టెంబర్ 17న ఆమోదింప జేసుకుంది. అన్నదాతలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే మా లక్ష్యం అని పేర్కొంటూ రైతు ఉత్పత్తుల వ్యపార వాణిజ్య (ప్రోత్సాహక,సులభతర బిల్లు రైతుల (సాధికారత రక్షణ) ధరల హామీ సేవల ఒప్పందం బిల్లు నిత్యవసరాల సరకుల (సవరణ)బిల్లులను కేంద్ర ప్రభుత్వం తాజా సమావేశాలలో లోక్ సభ లో ప్రవేశ పెట్టి౦ది.నిత్యవసరాల సరుకుల బిల్లు సెప్టెంబర్ 15న సభలో ఆమోదం పొందింది.మిగిలిన రెండు బిల్లులపై సెప్టెంబర్ 17న చర్చ జరిగింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాధల్ పదవికి రాజీనామా
ఎవరు: హర్ సిమ్రత్ కౌర్ బాధల్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 17
ప్రపంచ రోగుల బద్రత దినోత్సవం గా సెప్టెంబర్ 17 :
రోగుల భద్రతను ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతగా గుర్తించి, 72 వ ప్రపంచ ఆరోగ్య సభలో మొత్తం 194 WHO సభ్య దేశాలు, 2019 మేలో, ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 న గుర్తించటానికి ఆమోదించాయి. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం యొక్క లక్ష్యాలు ప్రజలలో అవగాహన మరియు వారి మద్య అనుసందానం పెంచడం, ప్రపంచ జనాబాలో రోగుల యొక్క బద్రత గురించి అవగాహనను మెరుగుపరచడం మరియు రోగుల భద్రతను ప్రోత్సహించడానికి ప్రపంచ సంఘీభావం తెలపడం మరియువాటికీ సంబందించిన చర్యలను ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ రోగుల బద్రత దినోత్సవం గా సెప్టెంబర్ 17
ఎవరు:WHO
ఎప్పుడు: సెప్టెంబర్ 17
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |