Daily Current Affairs in Telugu 17 -04-2021

current affairs pdf 2020,

Daily Current Affairs in Telugu 17 -04-2021

RRB Group d Mock test

తెలంగాణ రాష్ట్రంలో ఐఎస్ఓకు ఎంపికైన మొదటి గ్రామంగా ఇర్కోడ్ :

సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన ఇర్కోడ్ గ్రామం ఏటా ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందుతూ ఆదర్శంగా నిలుస్తోంది. కాగా ప్రస్తుతం పంచాయతీ పరిధిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ సేవలందించినందుకు గాను ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ఏప్రిల్ 16న గ్రామాన్నిఎంపిక చేసి సర్టిఫికెట్ను ఆన్లైన్ ద్వారా అందించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఐఎస్ఓకు ఎంపికైన మొదటి గ్రామంగా ఇర్కోడ్ నిలిచింది మొత్తం 650 గృహాలు, 2,482 జనాభా కలిగిన ఇర్కోడ్ గ్రామం. గతంలో 2016-17, 2017-18 సంవత్సరాలకు గాను శానిటేషన్, సోషల్ సెక్టార్ విభాగాల్లో రెండుసార్లు జాతీయ స్థాయి స్వశక్తి కరణ్ అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతో గ్రామంలో మహిళల ఆర్థిక సాధికారత కోసం మటన్, చికెన్ పచ్చడి తయారీతో గుర్తింపు పొందింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: తెలంగాణ రాష్ట్రంలో ఐఎస్ఓకు ఎంపికైన మొదటి గ్రామంగా ఇర్కోడ్

ఎక్కడ: తెలంగాణ రాష్ట్రంలో ఇర్కోడ్ గ్రామం

ఎప్పుడు : ఏప్రిల్ 17

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన  ఆజయ్ సేథ్ :

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఆజయ్ సేథ్ ఏప్రిల్ 16న బాధ్యతలు స్వీకరించారు. 1987 బ్యాచ్ కర్ణాటక ఐఏఎస్ అధికారి క్యాడర్ అయిన అజయ్. తరుణ్ బజాజ్  గారి స్థానంలో బాధ్యతలు చేపట్టారు. తరుణ్ బజాజ్ ఇటీవల ఆర్థిక మంత్రిత్వశాఖ రెవెన్యూ కార్యదర్శిగా బదిలీ అయిన నేపథ్యంలో అజయ్ ఆయన స్థానంలో నియమితులయ్యారు. అజయ్ గతంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. 2000 నుంచి 2004 మధ్య ఆర్థిక వ్యవహారాల శాఖ, వ్యయ శాఖల్లో డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీగా పలు  కీలక బాధ్యతలు నిర్వహించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన  ఆజయ్ సేథ్

ఎవరు : ఆజయ్ సేథ్

ఎప్పుడు : ఏప్రిల్ 17

రొమాగ్నా గ్రాండ్ ప్రి టైటిల్ సాదించిన  రెడ్ బుల్ స్టార్ మాక్స్ వేర్ స్టాఫెన్:

మరో టైటిల్పై కన్నేసిన ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్కు నిరాశ ఎదురైంది. అతడి జోరును అడ్డుకుంటూ రెడ్ బుల్ స్టార్ మాక్స్ వెర్టపెన్ రొమాగ్నా గ్రాండ్ ప్రిని కైవసం చేసుకున్నాడు. పోల్ పొజిషన్లో రేసు ఆరంభించిన హామిల్టన్ (మెర్సిడెజ్) ఆరంభంలో మెరుగ్గానే కనిపిం చాడు. కానీ పుంజుకున్న వెరెస్టాపెన్ అతడిని వెనక్కి నెట్టి టైటిల్ ఎగరేసుకుపోయాడు. వెరెస్టావెన్ 63 ల్యాప్స్ 25 పాయింట్లు హామిల్టన్ 19 ‘పాయింట్లు సాధించారు. ఈ సీజన్లో మ్యాక్స్  ఇదే ‘తొలి టైటిల్. మొత్తం మీద 11వ ట్రోఫీ. ఈ రేసులో లాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానంలో నిలిచాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: రొమాగ్నా గ్రాండ్ ప్రి టైటిల్ సాదించిన  రెడ్ బుల్ స్టార్ మాక్స్ వెర్టపెన్

ఎవరు : రెడ్ బుల్ స్టార్ మాక్స్ వెర్టపెన్

ఎప్పుడు : ఏప్రిల్ 17

కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత బచీసింగ్ రావత్ కన్నుమూత :

కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత బచీసింగ్ రావత్ (71) ఇక లేరు. రుషికేశ్లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో శనివారమే ఆయన ఎయి మ్స్ లో చేరారు. అల్మోరా-పిథోడ్గాఢ నియోజకవర్గం నుంచి రావత్ నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. వాజ్ పేయీ కేబినెట్లో కేంద్ర శాస్త్ర సాంకేతికత శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత బచీసింగ్ రావత్ కన్నుమూత

ఎవరు : బచీసింగ్ రావత్

ఎప్పుడు : ఏప్రిల్ 17

ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం  ఏప్రిల్ 17 :

 ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం గా ఏప్రిల్ 17  రోజున జరుపుకుంటారు. హిమోఫిలియా మరియు ఇతర రక్తస్రావం లోపాలకు అంతర్జాతీయ అవగాహన కల్పించే దినంగా  ఈ రోజును జరుపుకుంటారు. 1989 నుండి, ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం మొత్తం రక్తస్రావం లోపాల సంఘం చికిత్సలో నిరంతర పురోగతిని జరుపుకునేందుకు అవగాహన పెంచుకుంటుంది మరియు విస్తృత ప్రజలకు సరైన సంరక్షణకు సంబంధించిన సమస్యలపై అవగాహన మరియు దృష్టిని తీసుకువస్తుంది. ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్బంగా  ప్రపంచ రక్తస్రావం లోపాల సంఘాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం  ఏప్రిల్ 17:

ఎప్పుడు : ఏప్రిల్ 17

AP Economy Survey  2019-2020

Daily current affairs January 2021
Daily current affairs 01-01- 2021
Daily current affairs 02-01- 2021
Daily current affairs 03-01- 2021
Daily current affairs 04-01- 2021
Daily current affairs 05-01- 2021
Daily current affairs 06-01- 2021
Daily current affairs 07-01- 2021
Daily current affairs 08-01- 2021
Daily current affairs 09-01- 2021
Daily current affairs 10-01- 2021
Daily current affairs 11-01- 2021
Daily current affairs 12-01- 2021
Daily current affairs 13-01- 2021
Daily current affairs 14-01- 2021
Daily current affairs 15-01- 2021
Daily current affairs 16-01- 2021
Daily current affairs 17-01- 2021
Daily current affairs 18-01- 2021
Daily current affairs 19-01- 2021
Daily current affairs 20-01- 2021
Daily current affairs 21-01- 2021
Daily current affairs 22-01- 2021
Daily current affairs 23-01- 2021
Daily current affairs 24-01- 2021
Daily current affairs 25-01- 2021
Daily current affairs 26-01- 2021
Daily current affairs 27-01- 2021
Daily current affairs 28-01- 2021
Daily current affairs 29-01- 2021
Daily current affairs 30-01- 2021
Daily current affairs 31-01- 2021
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Download Manavidya app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *