
Daily Current Affairs in Telugu 16&17 August-2022
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కార్యదర్శిగా పశ్చిమబెంగాల్ ఐఎఎస్ అధికారి సునీల్కుమార్ గుప్తా నియామకం :

భారత నూతన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ గారి కార్యదర్శిగా పశ్చిమబెంగాల్ కేడర్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సునీల్ కుమార్ గుప్తా · నియమితులయ్యారు. వచ్చే ఏడాది డిసెంబర్ 31న పదవీ విరమణ చేసేంతవరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకు ఈ స్థానంలో 1979 బ్యాచ్ ఏపీ కేడర్’ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు గారు ఉన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా నియమితులైనప్పుడు ఆయన ఈ స్థానంలోకి వచ్చారు. ప్రస్తుతం వెంకయ్య పదవీకాలం పూర్తికావడంతో కొత్త ఉపరాష్ట్రపతికి కొత్త కార్యదర్శిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కార్యదర్శిగా పశ్చిమబెంగాల్ ఐఎఎస్ అధికారి సునీల్కుమార్ గుప్తా నియామకం
ఎవరు : సునీల్కుమార్ గుప్తా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :ఆగస్ట్ 16
ఐక్యరాజ్య సమితి (ఐరాస) (ఐజీఎఫ్) నాయకత్వ బృంద౦లో ఇద్దరు భారతీయులకు చోటు :

ఐక్యరాజ్య సమితి (ఐరాస) సరికొత్త ఇంటర్నెట్ పాలన వేదిక (ఐజీఎఫ్) నాయకత్వ బృందానికినికే ఆ పదవిలో కొనసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ 10 మంది సభ్యులను నియమించారు. వీరిలో భారత ఎలక్ట్రాన్రిక్స్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఐటీ శాఖ కార్యదర్శి అల్కేశ్ కుమార్ శర్మ కూడా ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. వీరితోపాటు నియమితులైన అయిదుగురు ఎక్స్ ఎఫీషియో సభ్యుల్లో ఐరాస సెక్రటరీ జనరలు తాను రాష్ట్ర స్థాయి కమిటి టెక్నాలజీ ప్రతినిధి అయిన అమన్ దీప్ సింగ్ గిల్ తాజా నియామకాన్ని ఆ కూడా ఉన్నారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖు లను ఐజీఎఫ్ నాయకత్వ బృందంలో సభ్యులుగా నియమించారు. ఐజీఎఫ్ చర్చలను, సిఫార్సులను ప్రపంచ దేశాలకు అందజేసి కార్యోన్ముఖం చేయడం నాయకత్వ వహించడం బృందం యొక్క బాధ్యత.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐక్యరాజ్య సమితి (ఐరాస) (ఐజీఎఫ్) నాయకత్వ బృంద౦లో ఇద్దరు భారతీయులకు చోటు
ఎప్పుడు :ఆగస్ట్ 17
డిసిజిఐ గా చీఫ్ డాక్టర్ విజి సోమాని పదవీకాలం పొడగిస్తూ ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ :

డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) చీఫ్ గా ఉన్న డాక్టర్ విజి సోమాని పదవీకాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ సోమని ఆగస్టు 14, 2019న మూడు సంవత్సరాల కాలానికి DCGI గా నియమితులయ్యారు. 16.Q8.2022 నుండి మూడు నెలల పాటు లేదా వరకు డ్రగ్ కంట్రోలర్ ఆర్ట్స్ (ఇండియా) పదవిని డాక్టర్ విజి సోమాని కొనసాగించాలని కాంపిటెంట్ అధారిటీ ఆమోదంతో నిర్ణయించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : డిసిజిఐ) గా చీఫ్ డాక్టర్ విజి సోమాని పదవీకాలం పొడగిస్తూ ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ఎవరు : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ఎక్కడ: విజి సోమాని
ఎప్పుడు :ఆగస్ట్ 16
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్ గా చంద్రకాంత్ పండిట్ నియామకం :

ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ ప్రధాన కోచ్ గా చంద్రకాంత్ పండిట్ ను నియమించింది. పలు దేశీయ జట్లతో విజయవంతమైన కోచింగ్ కెరీర్ ను ఆస్వాదించిన పండిట్ ఇటీక్షల మధ్యప్రదేశ్ కు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ కూడా అందించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్ గా చంద్రకాంత్ పండిట్ నియామకం
ఎవరు : చంద్రకాంత్ పండిట్
ఎప్పుడు :ఆగస్ట్ 17
భారతదేశపు మొట్టమొదటి సెలైన్ వాటర్ లాంతర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ :

ఎల్ఈడీ ల్యాంప్లకు శక్తినిచ్చే సముద్రపు నీటిని ఉపయోగి౦ఛి తయారు చేసే భారతదేశపు మొట్టమొదటి సెలైన్ వాటర్ లాంతర్ ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ . ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ప్రకారం, చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) నిర్వహించే మరియు వినియోగిస్తున్న తీరప్రాంత పరిశోధనా నౌక సాగర్ అన్వేషికను సందర్శించిన సందర్భంగా “రోష్ని” అనే పేరుతో మొట్టమొదటి లాంతరును ఆవిష్కరించారు సెలైన్ వాటర్ ల మీ పేదలు మరియు నిరుపేదలకు, ముఖ్యంగా 7,500 కిలోమీటర్ల పొడవైన భారతదేశ తీర రేఖ వెంబడి నివసిస్తున్న మత్స్యకార సమాజానికి “ఈజ్ ఆఫ్ లివింగ్” ని తీసుకువస్తుందని మంత్రి అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ “రోష్ని” అనే లాంతరును అభివృద్ధి చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారతదేశపు మొట్టమొదటి సెలైన్ వాటర్ లాంతర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఎవరు : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఎప్పుడు :ఆగస్ట్ 17
హిందుస్థాన్ ఉర్వరన్ మరియు రసయాన్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దేబాషిశ్ నందా :

ఐదు ప్రభుత్వ రంగ యూనిట్ల జాయింట్ వెంచర్ కంపెనీ అయిన హిందుస్థాన్ ఉర్వరన్ మరియు రసయాన్ లిమిటెడ్ (HURL) చైర్మన్ గా దేబాశిష్ నందా బాధ్యతలు స్వీకరించారు. మహారత్న సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) యొక్క పూర్తి సమయం డైరెక్టర్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన నందా ఆగస్టు 16 నుండి హెచ్ఆర్ఎల్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఎమ్ వైద్య స్థానంలో నందా నియమితులైనట్లు సిఐఎల్ ఒక పకటనలో తెలిసింది. దేశంలోని తూర్పు మరియు ఉత్తర ప్రాంతాలలోని రైతుల యూరియా అవసరాలను సరఫరా చేయడం మరియు తీర్చడం కోసం ఐదు ప్రభుత్వ రంగ యూనిట జాయింట్ వెంచర్ కన్సార్టియంగా జూన్ 2016లో HURL ఉనికిలోకి వచ్చింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : హిందుస్థాన్ ఉర్వరన్ మరియు రసయాన్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దేబాషిశ్ నందా
ఎవరు : దేబాషిశ్ నందా
ఎప్పుడు :ఆగస్ట్ 17
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) పై నిషేధం విధిస్తు ప్రకటించిన అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (పిపా) :

ఇటీవల కామన్వెల్త్ క్రీడలలో అద్భుత ప్రదర్శనతో సంతోషంలో మునిగిపోయిన భారత క్రీడా రంగానికి ఎదురుదెబ్బ భారత ఫుట్బాల్ కు అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (పిపా) రెడ్ కార్డు చూపించింది. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) పై నిషేధం విధిస్తున్నట్లు ఆగస్ట్ 16న ప్రకటించింది. అంతే. కాకుండా ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 వరకు స్వదేశంలో జరగాల్సిన అండర్ 17 మహిళ ప్రపంచ కప్ ను ప్రస్తుతానికి భారత్లో నిర్వహించడం లేదని వెల్లడిలచింది 35 ఏళ్ల చరిత్రలో ఎఎస్ఎల్ పై కాకుండా ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 వరకు స్వదేశంలో జరగాల్సిన అండర్ 17 మహిళల ప్రపంచకప్ ను ప్రస్తుతానికి భారత్లో నిర్వహించడం లేదని వెల్లడించింది 85 ఏళ్ల చరిత్రలో ఎఐఎస్ఎఎస్ పై నిషేధం పడడం ఇదే తొలిసారి ఏఐఎస్ ఎల్లో బయట వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో ఏపా ఈ నిర్ణయం తీసుకుంది. క్రీడా సంఘాల్లో పారదర్శకత రావాలని స్వాతంత్య్ర దినో త్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన ఒక్క రోజులోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కార ణంతో తక్షణమే ఏఐఎస్ఎఫ్ను నిషేధించాలని ఫిఫా మండలి బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఫిఫా చట్టాలను అది ఉల్లంఘించింది. ఏఐఎస్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలను పొందేలా పాలకుల కమిటీ. (సీఓఏ)ని ఏర్పాటు చేయాలనే ఉత్తర్వును రద్దు చేస్తే, అప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తివేస్తాం సమాఖ్య రోజువారీ కార్యకలాపాలపై తిరిగి ఏఐఎస్ఎస్ పూర్తి నియంత్రణ సాధించాలి ఉంటుంది. ఈ నిషేదం కారణంగా అక్టోబర్ లో జరగాల్చిన అండర్-17 మహిళల ప్రపంచకప్ ను ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారం ఈ దేశంలో నిర్వహించడం లేదు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) పై నిషేధం విధిస్తు ప్రకటించిన అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (పిపా)
ఎవరు : అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (పిపా)
ఎప్పుడు :ఆగస్ట్ 16
బిసిసిఐ యొక్క మాజీ కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్నుమూత :

బిసిసిఐ యొక్క మాజీ కార్యదర్శి,, ఝార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం (జేఎసీసీఏ) మాజీ అధ్యక్షుడు అమితాబ్ చౌదరి (62) కన్నుమూశారు. ఆగస్ట్ 16న ఉదయం గుండెపోటుతో అమితాబ్ మృతిచెందారు. ఝార్ఖండ్ రాష్ట్ర పోలీసు శాఖలో ఐజీపీగా బాధ్యతలు నిర్వహించి రిటైరైన ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ)కు చైర్మన్ గానూ పనిచేశారు. రాంచీలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంలో అమితాబ్ ముఖ్య భూమిక పోషించారు. అంతర్జాతీయ ఐపీఎల్ మ్యాచ్లు తీసుకురావడంలో ఆయనదే కీలకపాత్ర పోషించారు.
- బిసిసిఐ స్థాపన :డిసెంబర్ 1928
- బిసిసి ఐ యొక్క ప్రధాన కార్యాలయం : ముంబాయ్
- బిసిసిఐ ప్రస్తుత అద్యక్షుడు : సౌరవ్ గంగూలి
క్విక్ రివ్యు :
ఏమిటి : బిసిసిఐ యొక్క మాజీ కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్నుమూత
ఎవరు : అమితాబ్ చౌదరి
ఎక్కడ: రాంచి జార్ఖండ్ రాష్ట్ర౦
ఎప్పుడు :ఆగస్ట్ 17
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |