Daily Current Affairs in Telugu -16-10-2019

current affairs in telugu

Daily Current Affairs in Telugu -16-10-2019:

rrb ntpc online exams in telugu

Daily Current Affairs in Telugu -12-10-2019

హైదరాబాదు లో 2020 బయోఏషియా అంతర్జాతీయ సదస్సు:

ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హైదరాబాదు లో జగరనున్న 17వ బయో ఏషియా-2020 సదస్సు వెబ్ సైట్, థిమ్ ను అక్టోబర్ 16 న తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారు హైదరాబాదు లో ఆవిష్కరించారు. 17వ బయో ఏషియా సదస్సు యొక్క నినాదం –టుడే ఫర్ టుమారో(రేపటి కోసం నేడు) నిర్విస్తున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు స్విట్జర్లాండ్ భాగస్వామి కాగా, జర్మని సంయుక్త భాగస్వామిగా ఉటుంది. అసొం,కేరళ రాష్ట్రాలు రాష్ట్ర భాగస్వాములుగా ఉంటాయి. 100పైగా సంస్థలు ఈ సదస్సులో పాల్గోనబోతున్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి : హైదరాబాదు లో 2020 బయోఏషియా అంతర్జాతీయ సదస్సు

ఎప్పుడు : అక్టోబర్ 16

ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

ఎక్కడ : హైదరాబాదు

దేశంలో పెరిగిన పశుసంపద:

దేశంలో పశుసంపద పెరిగింది. కేంద్ర పశుసంవర్దక శాఖ అక్టోబర్ 16న విడుదల చేసిన 20వ పశుగణన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా పాడి పశువుల సంఖ్య 53.5 కోట్లకు చేరింది. 2012 తో పోలిస్తే ఇది 4.6% అధికం. అత్యధిక పశుసంపద ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపి, తెలగాణలు స్థానం దక్కించుకున్నాయి.క్షేత్రస్థాయిలో 80వేల మంది గణకులు దాదాపు 27 కోట్ల కుటుంబాల నుంచి ఈ వివరాలు సేకరించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : దేశంలో పెరిగిన పశుసంపద

ఎప్పుడు : అక్టోబర్ 16

ఎక్కడ : ఇండియా

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఆంధ్రప్రదేశ్ లో హాంకాంగ్ సంస్థ 700 కోట్ల పెట్టుబడులు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హాంకాంగ్ కు చెందిన ‘ఇంటిలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ ప్రతినిధులు అక్టోబర్ 16 న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పాదరక్షాల తయారి కోసం ప్రత్యేక ఆర్ధిక మండలి ఏర్పాటుపై సిఎంతో చర్చించారు. ఇందుకు రూ.700 కోట్లు ఖర్చవుతుందని, సుమారు 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆంధ్రప్రదేశ్ లో హాంకాంగ్ సంస్థ 700 కోట్ల పెట్టుబడులు

ఎప్పుడు : అక్టోబర్ 16

ఎవరు : హాంకాంగ్ కు చెందిన ‘ఇంటిలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ లిమిటెడ్ సంస్థ

ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

భారత్ లో తగ్గిన కటిక పేదరికం:

భారత్ లో కటిక పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. 1990 నుంచి పేదరికం రేటు సగం మేరకు తగ్గిందని తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తో వార్షిక సమావేశం నిర్వహించేదుకు ముందు అక్టోబర్ 16 విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. గత 15 ఏళ్లుగా 7 శాతాన్ని మించి ఆర్ధిక ప్రగతిని సాదిస్తోందని కుడా తెలిపింది. మరిన్ని ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించడంతో పాటు సరైన ఉద్యోగాలను కల్పించాలని ప్రపంచ బ్యాంకు సిఫార్సు చేసింది.  

క్విక్ రివ్యు :

ఏమిటి : భారత్ లో తగ్గిన కటిక పేదరికం

ఎప్పుడు : అక్టోబర్ 16

ఎవరు : ప్రపంచ బ్యాంకు

ఎక్కడ : భారత్

Manavidya Youtube Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *