
Daily Current Affairs in Telugu 15 September -2022
ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్స్ చైర్మన్ గా ప్రతాప్ పవార్ ఏకగ్రీవంగా ఎన్నిక :

ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్ గా 2022-23 కాలానికి ప్రతాప్ పవార్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరాఠీ దినపత్రిక సకల్ ను ప్రచురించే సకల్, మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ పవార్ వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు పజిలో ది మహరట్టా ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల బోర్డుల్లో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్యశ్రీ అవార్డుతో సత్కరించింది. ఏబీసీ డిప్యూటీ చైర్మన్ గా అర్.కే స్వామి ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ ఎండి శ్రీనివాసన్ కె స్వామి ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్స్ చైర్మన్ గా ప్రతాప్ పవార్ ఏకగ్రీవంగా ఎన్నిక
ఎవరు : ప్రతాప్ పవార్
ఎప్పుడు : సెప్టెంబర్ 15
టెన్నిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ :

పురుషుల టెన్నిస్ లో ఓ శకం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో, అసాధారణ ప్రదర్శనతో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వీరుడు రాకెట్ వదిలేయనున్నాడు. 24 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తన కెరీర్ కు తెరదించుతూ. 41 ఏళ్ల వయసులో రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్ కు వీడ్కోలు పలికాడు. 20 విజయాలతో పురుషుల సింగిల్స్ అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే వారు లండన్ లో జరిగే లేవర్ కు తను చివరి టోర్నీ అని వెల్లడించాడు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ట్విటర్లో నాలుగు పేజీల లేఖ పోస్టు చేశారు కెరీర్ లో రోజర్ సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిళ్లు 20. అత్యధికంగా ఎనిమిది వింబుల్డన్ టైటిళ్లు గెలిచిన అతడు ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్. అయిదు యుఎస్ ఓపెన్, ఒకే ఒక్క ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ లను నెగ్గాడు. 2012లో రోజర్ 17 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించే సమయానికి నాదల్ (10), జకోవిచ్ (b) అతడికి చాలా దూరంలో ఉన్నారు. ఆ తర్వాత మూడు ట్రోఫీలు గెలవడానికి సమయం తీసుకున్నాడు. 2018లో చివరిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో ఫెదరర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : టెన్నిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ :
ఎవరు : రోజర్ ఫెదరర్ :
ఎప్పుడు : సెప్టెంబర్ 15
డిజిటల్ అడ్రెస్ సిస్టంను అమలు చేసి దేశంలోనే మొదటి “స్మార్ట్ సిటీ గా నిలిచిన ఇండోర్ :

ఇండోర్ డిజిటల్ అడ్రెస్ సిస్టంను అమలు చేసి దేశంలోనే మొదటి “స్మార్ట్ సిటీ”గా అవతరించింది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం పూర్తిగా డిజిటల్ అడ్రసింగ్ సిస్టమ్‌ను అమలు చేయడానికి పటా నావిగేషన్స్ సంస్థతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది, ఇది భారతదేశంలో అలా చేసిన మొదటి నగరంగా నిలిచింది. ఈ అవగాహన ఒప్పందానికి అనుగుణంగా, ఇండోర్‌లోని అన్ని జెర్మెంట్ ఏజెన్సీలు మరియు అత్యవసర సేవల ద్వారా Pataa యాప్ ఉపయోగించబడుతుంది pataa యాప్ అనేది వినియోగదారుకు సహాయపడే బీఫ్ మరియు డేటింక్టివ్ కోడ్ నిర్దిష్ట జియోట్యాగ్ చేయబడిన లొకేషన్‌ను టింగ్ చేయండి.
క్విక్ రివ్యు
ఏమిటి : డిజిటల్ అడ్రెస్ సిస్టంను అమలు చేసి దేశంలోనే మొదటి “స్మార్ట్ సిటీ గా నిలిచిన ఇండోర్
ఎవరు : ఇండోర్
ఎక్కడ: మధ్యప్రదేశ్
ఎప్పుడు : సెప్టెంబర్ 15
అంగోలా దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన జోవో లౌరెన్కో :

అంగోలా దేశ అధ్యక్షుడిగా జోవో లౌరెన్కో తిరిగి ఎన్నికయ్యారు. 15 సెప్టెంబర్ 2022న అంగోలా అధ్యక్షుడు. 68 ఏళ్ల లౌరిన్కో, రాజధాని లువాండాలో అంగోలా యొక్క మొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్ అయిన ఎస్పరెంక డా కోస్తా తో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు ఆగస్టు 24 ఎన్నికల్లో 220 మంది సభ్యుల పార్లమెంటులో అధికార MPLA పార్టీ 51% ఓట్లను మరియు 124 సీట్లు సాధించింది. కాగా అంగోలా అనేది దక్షిణాఫ్రికా పశ్చిమ తీరంలో ఉన్న ఒక దేశం.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంగోలా దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన జోవో లౌరెన్కో
ఎవరు : జోవో లౌరెన్కో
ఎక్కడ: అంగోలా దేశ౦
ఎప్పుడు : సెప్టెంబర్ 15
పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రవూఫ్ కన్నుమూత :

పాకిస్థాన్ దేశానికి చెందిన మాజీ అంపైర్ అసద్ రవూఫ్ గుండెపోటుతో మరణిం చాడు. సెప్టెంబర్ 15న రాత్రి అసద్ కు గుండెపోటు వచ్చిందని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేక పోయిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రవప్ వయసు 66 ఏళ్లు. 2000లో అంతర్జా తీయ అంపైర్ కెరీర్ ప్రారంభించిన రవూఫ్, 64 టెస్టులకు బాధ్యతలు నిర్వర్తించాడు. 139. వన్డేలు, 28 టీ20లకు కూడా అంపైర్ గా పని చేశాడు అంపైర్ కాకముందు రవూప్ క్రికెటర్ గా 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కూడా ఆడారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రవూఫ్ కన్నుమూత
ఎవరు : అసద్ రవూఫ్
ఎక్కడ: పాకిస్థా
ఎప్పుడు : సెప్టెంబర్ 15
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |