Daily Current Affairs in Telugu -15-10-2019

current affairs in telugu

Daily Current Affairs in Telugu -15-10-2019:

rrb ntpc online exams in telugu

Daily Current Affairs in Telugu -12-10-2019

ఎట్ వుడ్, ఎవరిస్టోలకు బుకర్ ప్రైజ్:

ఆంగ్ల సాహితీవేత్తలకు ఇచ్చే ప్రతిష్టాత్మక   బుకర్ ప్రైజ్ ను ఈ ఏడాది(2019) కెనడా రచయిత్రి మార్గరెట్ ఎట్ వుడ్, బ్రిటష్ రచయిత్రి బెర్నర్ డైన్ ఎవరిస్టో లు సంయుక్తంగా గెలుచుకున్నారు. 79 ఏళ్ళ ఎట్ వుడ్ ను రెండో సారి ఈ బహుమతి వారించగా, బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి నల్లజాతి మహిళగా ఎవరిస్టో(60) చరిత్ర సృష్టించారు. ఎట్ వుడ్ రాసిన ‘ద టెస్ట్ మెంట్’, ఎవరిస్టో రాసిన’ గర్ల్ ఉమెన్, ఆదర్ నవలలు ఈ పురస్కారానికి ఎంపికయ్యాయి. అక్టోబర్ 15 న లండన్లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ అవార్డును అందుకున్నారు. 50,000 పౌండ్ల (సుమారు రూ.45 లక్షల) బహుమతిని వీరిద్దరూ పంచుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఎట్ వుడ్, ఎవరిస్టోలకు బుకర్ ప్రైజ్

ఎప్పుడు : అక్టోబర్ 15

ఎవరు : ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు  

ఎక్కడ : ఆఫ్రికా దేశాలైన సిమోర్రాలియోన్, కామోరోస్

ముగిసిన ఉపరాష్ట్రపతి విదేశీ పర్యటన:

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆఫ్రికా దేశాలైన సిమోర్రాలియోన్, కామోరోస్ లో ఐదు రోజుల పర్యటన ముగించుకొని అక్టోబర్ 15 న డిల్లి చేరుకున్నారు. ఆయన నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఆ దేశాలతో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంది. సిమోర్రాలియోన్ లో భారత హైకమిషన్ ఏర్పాటు చేయనున్నామని, అభివృద్ధి నిమిత్తం ఆ దేశానికి రూ. 15,500 కోట్ల రుణంగా ఇవ్వనున్నామని, వెంకయ్యనాయుడు తెలిపారు. వీటితో పాటు నిటిపారుదల రంగం అభివృద్ధికి మరో రూ. 214 కోట్లను రుణ సహాయం అందిస్తామని చెప్పారు. సిమోర్రాలియోన్ రాజధాని ప్రిటౌన్ లో నిర్మించనున్న నూతన అధ్యక్ష భవనానికి ఆర్ధిక సాయం చేస్తామన్నారు. జి.కే :

సిమోర్రాలియోన్ రాజధాని : ప్రిటౌన్

సిమోర్రాలియోన్ కరెన్సీ :

కామోరోస్ రాజధాని : మొరోని

కామోరోస్ కరెన్సీ : కామోరియన్ ఫ్రాంక్

క్విక్ రివ్యు :

ఏమిటి : ముగిసిన ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు  విదేశీ పర్యటన

ఎప్పుడు : అక్టోబర్ 15

ఎవరు : ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు  

ఎక్కడ : ఆఫ్రికా దేశాలైన సిమోర్రాలియోన్, కామోరోస్

ead Current Affairs in Telugu

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

అండర్ -15 శాఫ్ చాంపియన్ భారత్ :

శాఫ్ అండర్-15  మహిళల ఫుట్ బాల్ చాంపియన్ షిప్ ను భారత జట్టు సొంతం చేసుకుంది. అక్టోబర్ 15 న జరిగిన ఫైనల్లో భారత్ 5-3 తో బంగ్లాదేశ్ ను పెనాల్టి షూటౌట్లో ఓడించింది. నిర్ణిత సమయంలో రెండు జట్లు గోల్స్ చేయలేదు.

క్విక్ రివ్యు :

ఏమిటి : అండర్ -15 శాఫ్ మహిళల  చాంపియన్ భారత్

ఎప్పుడు : అక్టోబర్ 15

ఎవరు : మహిళల ఫుట్ బాల్ జట్టు

ఎక్కడ : థింపు,బుటాన్

వైస్ఎస్ఆర్ రైతు భరోసా- పిఎం కిసాన్ పథకం ప్రారంభం :

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కాకటురులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా- పిఎం కిసాన్ పథకాన్ని అక్టోబర్ 15 ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతులు,కౌలు రైతులకు ఏటా రూ.13,500 రూపాయలు అందించనున్నారు. 54 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఐదేళ్ళలో రూ.67,500 ల సాయం అందించనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : వైస్ఎస్ఆర్ రైతు భరోసా- పిఎం కిసాన్ పథకం ప్రారంభం

ఎప్పుడు : అక్టోబర్ 15

ఎవరు : వైస్ జగన్ మోహన్ రెడ్డి

ఎక్కడ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కాకటురులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో

Manavidya Youtube Channel

పోషకాహార లోపంలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులకు పోషకాహారం తగినంత అందడంలేదు.ఈ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగున (30వ స్థానం) ఉంది. రాష్ట్రంలో 6-23 నెలల వయసున్న చిన్నారుల్లో 1.3% ముందే కనీస ఆమోదయోగ్యమైన ఆహారాన్ని పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ్శాఖ చేపట్టిన సమగ్ర జాతీయ పోషకాహార సర్వ్ (సిఎన్ఎన్ఎస్) నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో జాతీయ సగటు 6.4%%, సిక్కిం 35.9% తో ప్రథమస్థానంలో నిలవగా 32.6% ,20.6% లతో కేరళ, అరుణాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానంలో నిలిచాయి. కనీస వైద్యభరిత ఆహారం అందించడంలోను ఆంధ్రప్రదేశ్ పరిస్థితీ మెరుగ్గా లేదు. 62% తో మేఘాలయ ప్రథమస్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22% మందే వైద్యభరితమైన ఆహారాన్ని పొందుతున్నారు. దేశ్వ్యాప్తంగా ఇది 21%గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌమార దశ లోని (10-19 ఏళ్ల) పిల్లలలో 9.4% మంది ఉబాకాయంతో బాధపడుతున్నారు. జాతీయ సగటు 4.8% గా ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : పోషకాహార లోపంలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్ (30వ స్థానం) ఉంది

ఎప్పుడు : అక్టోబర్ 15

ఎవరు : సమగ్ర జాతీయ పోషకాహార సర్వ్ (సిఎన్ఎన్ఎస్) నివేదిక

ఎక్కడ : ఇండియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *