Daily Current Affairs in Telugu 15-07-2020

Daily Current Affairs in Telugu 15-07-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

ఎపి సమాచార శాఖా ముఖ్య కమిషనర్ గా పి రమేష్ కుమార్ నియామకం :

సమాచార హక్కు చట్టం-2005కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ముఖ్య కమిషనర్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.రమేశ్ కుమార్, సమాచార కమిషనర్గా రేపాల శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు బుధవారం సచివాలయం మొదటి భవనం లోని సీఎస్ సమావేశ మందిరంలో వీరి చేత సీఎస్ నీలం సాహ్ని పదవీ ప్రమాణం చేయించారు. రాష్ట్ర సమాచార కమిషన్ కు ప్రభుత్వం ఇప్పటికే కొంత మంది సమాచార కమిషనర్లను నియమించగా ఖాళీ ఉన్న సమాచార ముఖ్య కమిషనర్, సమాచార కమిషనర్ ను ప్రభుత్వం ఇటీవల నియమించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఎపి సమాచార శాఖా ముఖ్య కమిషనర్ గా పి రమేష్ కుమార్ నియామకం

ఎవరు: పి రమేష్ కుమార్

ఎప్పుడు:జులై  15

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఉపాద్యక్షుడిగా అశోక్ లవసా నియామకం :

ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ) నూతన ఉపాధ్యక్షుడిగా నియమితు లయ్యారు. ఈ మేరకు బుధవారం ఏడీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. విధుల్లో చేరిన తరువాత ఆయన ఏడీబీలో ‘ప్రైవేట్ సెక్టార్ ఆపరేషన్స్ అండ్ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ షిప్స్’ విభాగం బాధ్యతలు చూస్తారు. ప్రస్తుతం ఈ విధుల్లో దివా కర్ గుప్తా ఉన్నారు. ఆయన ఈ సంవత్సరం ఆగస్ట్ 31న పదవీ విర మణ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు అశోక్ లవాసాకు ఈ అవకాశం లభించింది. అయితే, ఏడీబీలో ఉపాధ్యక్షుడిగా చేరేందుకు ముందుగా ఎన్నికల కమిషనర్ పదవికి అశోక్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా ఉన్న ఆయన త్వరలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పదోన్నతి పొందనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఉపాద్యక్షుడిగా అశోక్ లవసా నియామకం

ఎవరు: అశోక్ లవసా

ఎప్పుడు: జులై 15

దేశీయ న్యుమోనియా  టీకాకు డిసిజిఐ నుండి ఆమోదం :

న్యుమోనియాకు పూర్తిస్థాయిలో దేశీయంగా అభివృద్ధి చేసిన టీకాకు భారత ఔషధ నియంత్రణ ‘ జనరల్ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా -డీసీజీఐ) ఆమోదం లభించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా జులై 14న తెలిపింది. పూనే కేంద్రంగా పని చేసే సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా.. టీకా కు సంబంధించి సమర్పించిన మొదటి రెండు దశల ఔషద పరిక్షలసమాచారాన్ని ప్రత్యెక నిపుణుల బృందం ఎస్ఈసి బృందం పరిశీలించింది. న్యుమోనియా ఉ సంబంధించి దేశీయంగా తయారు చేసిన తొలి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీకా ఇదే కావడం విశేషం

క్విక్ రివ్యు :

ఏమిటి: దేశీయ న్యుమోనియా  టీకాకు డిసిజిఐ నుండి ఆమోదం

ఎవరు: డిసిజిఐ  

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: జులై 15

ప్రపంచం లోనే అత్యంత చౌకైన కరోన టెస్టింగ్ కిట్ అబివృద్ది చేసిన ఐఐటి డిల్లి:

ప్రపంచంలోనే అత్యంత చౌకైన కరోనా టెస్టింగ్ కిట్ను ‘క్రిష్ యూరోను తాము దేశీయంగానే అభివృద్ధి చేశామని ఐఐటీ-ఢిల్లీ వెల్లడించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ జులై 15 దీన్ని ఆవిష్క రించారు. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా  రమేశ్ పోక్రియాల్ ఈ దిశగా ఇది ఒక గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ కిట్ ధర కేవలం రూ.399, ఆర్ఎస్ఏ ఐసోలేషన్, ల్యాబ్ చార్జీలు కూడా కలిపితే మొత్తం ధర రూ.650 అవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని కోట్లతో పోలిస్తే ఇదే తక్కువ ధర. దీనిద్వారా 3 గంటల్లో ఫలితం తెలుసుకోవచ్చు

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచం లోనే అత్యంత చౌకైన కరోన టెస్టింగ్ కిట్ అబివృద్ది చేసిన ఐఐటి డిల్లి

ఎవరు: ఐఐటి డిల్లి

ఎప్పుడు:  జులై 15

ఎక్కడ: డిల్లి

 దేశంలోనే తొలి దివ్యాంగ ఐఏఎస్ అధికారి ఆయన రాజేశ్ సింగ్ నియామకం :

దేశంలోనే తొలి దివ్యాంగ ఐఏఎస్ అధికారి ఆయన రాజేశ్ సింగ్  జార్ఖండ్ లోని బొకారో జిల్లా కమిషనర్గా జులై 15న నియమితులయ్యారు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే రోజు 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతో రాజేశ్ సింగ్ కు ఈ పోస్టింగ్ వచ్చింది. అంతకుముందు ఆయన రాష్ట్ర ఉన్నత సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచే శారు. పాట్నాకు చెందిన తన ఆరో ఏటనే చూపు కోల్పోయారు. అయినా లక్ష్యసాధనకు ఈ లోపం అడ్డంకి కాదని నిరూపించారు. 2007 బ్యాచ్ అసోం మేఘాలయ కేడర్ ఐఏఎస్ అధికారి శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే తొలి పోస్టింగ్ విషయంలోనూ న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో అనుకున్నది సాధించారు. రాకేష్ చక్కటి నవలా రచయితతో పాటు మంచి క్రీడాకారుడూ ఉన్నారు. ఆంధుల ప్రపంచ కప్ క్రికెట్ లో ఆయన భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు

క్విక్ రివ్యు :

ఏమిటి: దేశంలోనే తొలి దివ్యాంగ ఐఏఎస్ అధికారి ఆయన రాజేశ్ సింగ్ నియామకం

ఎవరు: రాజేశ్ సింగ్

ఎప్పుడు:  జులై 15

ఎక్కడ: జార్ఖండ్

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *