
Daily Current Affairs in Telugu 14&15 June-2022
ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనున్న ముంబయ్ :.

ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు ముంబయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది అక్టోబరు 30న డీవై పాటిల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు ఫిఫా స్థానిక నిర్వాహక కమిటీ (ఎల్డీసీ) జూన్ 14 న ప్రకటించాయి. అక్టోబరు 26న గోవాలో సెమీ, ఫైనల్స్ జరుగనున్నాయి. గ్రూపు దశలో 21 మ్యాచ్ ను ఒడిషా, గోవా, మహారాష్ట్రలో నిర్వహిస్తారు. అక్టోబరు 11. 14, 17 తేదీల్లో భారత్ తలపడే 3 గ్రూపు దశ మ్యాచ్ లకు భువనేశ్వర్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబరు 11న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 16 జట్లు బరిలో దిగుతాయి. మొత్తం 32 మ్యాచ్ లు జరుగుతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనున్న ముంబయి
ఎవరు: ముంబయి
ఎప్పుడు : జూన్ 14
భారతదేశంలోని మొట్టమొదటి బోట్ లైబ్రరీని ఒడిశాలోని బితార్కానికా నేషనల్ ఫారెస్ట్ లో ఏర్పాటు :

ఒడిశాలోని బితార్కానికా నేషనల్ ఫారెస్ట్ లోపల, ఫారెస్టర్లు పిల్లల కోసం భారతదేశంలోని మొట్టమొదటి బోట్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. 672 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న భితర్ కనికా వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలో రెండవ అతిపెద్ద మడ అడవుల పర్యావరణ వ్యవస్థ. కాగా ఇది ఉప్పునీటి మొసళ్ల పెద్ద జనాభాకు ప్రసిద్ధి చెందింది. ఈ లైబ్రరీలో సుమారు 1500 పుస్తకాలు ఉన్నాయి, వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బితార్కానికా ఎకో-టూరిజం అండ్ ఎకో-డెవలప్మెంట్ సొసైటీ (బీడ్స్) నిధులు సమకూర్చింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశంలోని మొట్టమొదటి బోట్ లైబ్రరీని ఒడిశాలోని బితార్కానికా నేషనల్ ఫారెస్ట్ లో ఏర్పాటు
ఎక్కడ ఒడిశాలోని బితార్కానికా నేషనల్ ఫారెస్ట్ లో ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 14
కెనడా ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో స్వర్ణ పతక౦ గెలుచుకున్న మాన్సి జోషి, మనీషా రాందాస్ :
కెనడా ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ కు చెందిన మాన్సి జోషి, మనీషా రాందాస్ స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో S 21-18, 15-21, 22-205 ఒక్సానా కొజీనా (ఉక్రెయిన్) పై గెలుపొందింది. మహిళల ఎస్ యూప్ సింగిల్స్ ఫైనల్లో మనీషా 27-25, 21-9తో అకియో సుగినో (జపాన్)పై విజయం సాధించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కెనడా ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో స్వర్ణ పతక౦ గెలుచుకున్న మాన్సి జోషి, మనీషా రాందాస్ :
ఎవరు: మాన్సి జోషి, మనీషా రాందాస్
ఎప్పుడు : జూన్ 14
ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ప్రైజ్ కు ఎంపికైన ఐఐటీఎం ఆచార్యుడు టి.ప్రదీప్ :

సౌదీ అరేబియా దేశం ఇచ్చే ప్రతిష్టాత్మక “ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ప్రైజ్ కు ఇండియన్ ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం) ఆచార్యుడు టి.ప్రదీప్ గారు ఎంపికయ్యారు. నీటికి సంబందించిన ఆవిష్కరణల్లో పురోగతి సాధించిన వారికి క్రియేటివిటీ ప్రైజ్ కింద ‘ఇంటర్నేషనల్ సైంటిఫిక్ అవార్డు’ అందజేస్తారు. బహుమతిగా 2,66,000 యూఎస్ డాలర్లు (రూ.రెండు కోట్ల మేరకు) అందుతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ప్రైజ్ కు ఎంపికైన ఐఐటీఎం ఆచార్యుడు టి.ప్రదీప్
ఎవరు: టి.ప్రదీప్
ఎప్పుడు : జూన్ 14
కేంద్ర కేబినెట్ భద్రత కార్యదర్శిగా వీఎస్కే కౌముది నియామకం :

కేంద్ర కేబినెట్ భద్రత కార్యదర్శిగా వీఎస్కే కౌముది కేంద్ర కేబినెట్ సెక్రటే రియట్ కార్యదర్శిగా (భద్రత) 1986 బ్యాచ్ కు చెందిన ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి వీఎస్ కే కౌముది నియమితుల యారు. ప్రస్తుతం ఈయన హోం శాఖలో అంతర్గత భద్రతా వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర కేబినెట్ భద్రత కార్యదర్శిగా వీఎస్కే కౌముది నియామకం
ఎవరు: వీఎస్కే కౌముది
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు : జూన్ 15
సైనిక నియామకాల నిమిత్తం రూపొందించిన ‘అగ్నిపథ్ కార్యక్రమాన్ని ప్రారంబించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ :

రక్షణశాఖ పరిధిలోని త్రివిధ దళాలలకు సంబంధించిన సైనిక నియామకాల నిమిత్తం రూపొందించిన ‘అగ్నిపథ్ కార్యక్ర మాని.కేంద్ర ప్రభుత్వం జూన్ 14న అందుబాటులోకి తెచ్చింది. దీని కింద ఈ ఏడాది సుమారు 46 వేల మందిని నియమించ నుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతుల సమక్షంలో విలేకరులకు వెల్లడించారు. అగ్నివీరుల నమోదు ప్రక్రియను మూడు నెలల్లో కేంద్రీకృత ఆన్లైన్ ద్వారా చేపడతారు. ఇందు కోసం ప్రత్యేక ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నమోదు ప్రక్రియ ‘ఆల్ ఇండియా ఆల్ క్లాస్’ ప్రాతిపదికన ఉంటుంది. అభ్యర్థులు వైద్య అర్హతలు సాధించాల్సి ఉంటుంది. కాగా, నాలుగేళ్ల తర్వాత ఈ అగ్నివీరులను ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చని కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్ సింగ్ డాకూర్ చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సైనిక నియామకాల నిమిత్తం రూపొందించిన ‘అగ్నిపథ్ కార్యక్రమాన్ని ప్రారంబించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
ఎవరు: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
ఎక్కడ :డిల్లి
ఎప్పుడు : జూన్ 15
ప్రెస్ కౌన్సిల్ అప్ ఇండియా చైర్మన్ గా జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నియామకం:

ప్రెస్ కౌన్సిల్ అప్ ఇండియా (పీసీఐ) కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ (72) ని ఎంపిక చేసినట్టు సమాచారం: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య (నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పీసీఐ సభ్యుడు ప్రకాశ్ దూబేలతో కూడిన కమిటీ మంగళవారం నాడిక్కడ సమావేశమై ఈమేరకు ఆమె నియామకా నికి ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం జస్టిస్ రంజనా దేశాయ్ జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పవర్ విభజన కమిషను ఇటీవల నేతృత్వం వహించారు. పీసీఐ చైర్పర్స న్ గా ఉన్న జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ గత ఏడాది నవంబరులో పదవీ విరమణ పొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రెస్ కౌన్సిల్ అప్ ఇండియా చైర్మన్ గా జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నియామకం
ఎవరు: జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్
ఎక్కడ ; డిల్లి
ఎప్పుడు : జూన్ 15
హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్బన్ నియమకం :

హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్ గా జెన్నిఫర్ లార్బన్ నియమితులయ్యారు. ప్రస్తుతం కాన్సుల్ జనరల్ గా ఉన్న జోయెల్ రీఫ్మాన్ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జెన్నిఫర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆమె హైదరాబాద్కు రాను న్నారు. ఆమె గతంలో భారతదేశంలో వివిధ హోదాల్లో పనిచేశారు. భారత్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా, ముంబయిలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్ గా పనిచేశారు. ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్బన్ నియమకం
ఎవరు: జెన్నిఫర్ లార్బన్
ఎక్కడ :హైదరాబాద్
ఎప్పుడు : జూన్ 15
గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ముకేశ్ కుమార్ సిన్హా నియామకం :

గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) చైర్మన్ ముకేశ్ కుమార్ సిన్హా నియ మితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని నెలల క్రితం వరకు గోదావరి బోర్డు చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్కు కేంద్ర జల్ సంఘం సభ్యునిగా పదోన్నతి రావడంతో ఆయన స్థానంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎం.పి.సింగ్కు జీఆర్ఎంబీ అదనపు బాధ్యతలు అప్పగిం చారు కొత్త చైర్మన్ గా సినాను నియమిస్తూ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత అధారిటీ మెంబర్ సెక్రెటరీగా ఉన్న ఎం.కె. శ్రీనివాస్ను పదోన్నతిపై పట్నాలోని గంగ వరద నియంత్రణ కమి షన్ చైర్మన్ గా నియమించారు. ప్రస్తుతం పోలవరం. ప్రాజెక్టు అథారిటీ ప్రధాన అధికారిగా చంద్రశేఖర్ అయ్యర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండగా, మెంబర్ సెక్రటరీ పదోన్నతిపై బదిలీ అయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ముకేశ్ కుమార్ సిన్హా నియామకం :
ఎవరు: ముకేశ్ కుమార్ సిన్హా
ఎక్కడ :డిల్లి
ఎప్పుడు : జూన్ 15
కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ షిర్డీకి ‘దేఖో అప్నా దేశ్’ పేరిట ప్రారంభం అయిన తొలి ప్రైవేటు రైలు :

కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ షిర్డీకి తొలి ప్రైవేటు రైలు ‘దేఖో అప్నా దేశ్’ పేరిట 2022 జూన్ 14న బయలుదేరింది. కేంద్రం ‘భారత్ గౌరవ్’ పథకం’ ఈ బుక్స్ పెట్టిన తొలి ప్రైవేటు రైలు ఇదే. కింద ప్రవేశ అయిదు రోజుల పాటు ప్యాకేజీ టూర్ కింద ఇందులో ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే తెలియజేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ షిర్డీకి ‘దేఖో అప్నా దేశ్’ పేరిట ప్రారంభం అయిన తొలి ప్రైవేటు రైలు
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్
ఎప్పుడు : జూన్ 15
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |