Daily Current Affairs in Telugu -14-10-2019

current affairs in telugu

Daily Current Affairs in Telugu -14-10-2019:

rrb ntpc online exams in telugu

Daily Current Affairs in Telugu -12-10-2019

Daily Current Affairs in Telugu -13-10-2019

అభిజిత్ బెనర్జీకి ఆర్ధిక నోబెల్ :

పేదరికపు విశాకోరాల నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేలా అద్భుతపరిష్కారాలను సూచించిన ప్రవాస భారత ఆర్ధిక దిగ్గజం అభిజిత్ వినాయక్ బెనర్జీని ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ఆయన భార్య ఎస్తేర్ డోప్లోతో పాటు, మరో ఆర్థికవేత్త అయిన క్రెమర్ ను 2019 సంవత్సరానికి ఈ అవార్డుకు సంయుక్తంగా ఎంపిక చేసినట్లు స్వీడిష్ రాయల్ అకాడమి ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.

ఇప్పటి వరకు నోబెల్ పురస్కారాలు పొందిన భారతీయులు:’ఇప్పటి వరకు 9 మంది భారతీయులకు నోబెల్ పురస్కారం వరించింది.

పేరు సంవత్సరం కేటగరీ
రవీంద్రనాథ్ టాగూర్ 1913 సాహిత్యం
సి.వి.రామన్ 1930 భౌతిక శాస్తం
హరగోబింద్ ఖురానా 1968 వైద్యం
మదర్ తెరిస్సా 1970 శాంతి
సుబ్రమన్యాన్ చంద్రశేఖర్ 1983 భౌతిక శాస్తం
అమర్త్య సేన్ 1998 ఆర్ధిక శాస్తం
వెంకటరామన్ రామకృష్ణన్ 2009 రసాయన శాస్తం
కైలాస సత్యర్టి 2014 శాంతి
అభిజిత్ బెనర్జీ 2019 ఆర్ధిక శాస్తం

క్విక్ రివ్యు :

ఏమిటి : అభిజిత్ బెనర్జీకి ఆర్ధిక నోబెల్ :

ఎప్పుడు : అక్టోబర్ 14

ఎవరు : స్వీడిష్ రాయల్ అకాడమి ఆఫ్ సైన్సెస్

ఎక్కడ :స్విట్జర్లాండ్

తెలంగాణ ప్రభుత్వం ద్వారా “రైతు బంధు” కు వెయ్యికోట్ల కేటాయింపు:

రైతు బంధు పతకం కింద అక్టోబర్ 14న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.500 కోట్లు జమచేసింది. త్వరలో మరో రూ.500 కోట్లు జమ చేయనుంది. గత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ముగిసిన  కరిఫ్ (వానా కాలం) సీజన్ కు ఈ పథకం కింద రూ.1700 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న రూ.500 కకోట్లు విడుదల చేసిన ప్రభుత్వం మరో రూ.500 కోట్లు త్వరలో రైతుల ఖాతాలో చేయనుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : తెలంగాణ ప్రభుత్వం ద్వారా “రైతు బంధు” కు వెయ్యికోట్ల కేటాయింపు

ఎప్పుడు : అక్టోబర్ 14

ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

ఎక్కడ : తెలంగాణ

రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 13,500 : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం :

రైతు కుటుంబాలకు మరింత భరోసా కల్పించాలని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకానికి గతంలో ప్రకటించిన మొత్తానికి రూ.1000 కలిపి ఏడాదికి రూ. 13,500 చొప్పున ఇవ్వబోతుంది. దిన్ని ఏడాదికి మూడు విడుతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ ఏడాదికి సంబంచింది ఒక్కో రైతుకు ప్రస్తుతం రూ.11,500 చొప్పున అందేలా చర్యలు చేపట్టింది. మిగిలిన 2 వేలను సంక్రాంతికి అందజేయనుంది. ఈ పథకానికి “వైఎస్ఆర్ రైతు భరోసా-పిఎం కిసాన్” అని నామకరణం చేశారు. పిఎం కిసాన్ కింద 3 విడతల్లో కేంద్రం అందించే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,500 కలిపి ఇస్తుంది.కౌలు రైతులకు రాష్ట్రమే రూ. 13,500 జమ చేయనుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 13,500 : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

ఎప్పుడు : అక్టోబర్ 14

ఎవరు : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

ఎక్కడ : ఆంద్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *