
Daily Current Affairs in Telugu 14-02-2020
షావుకారు జానకికి కే.వి రమణ పురస్కారం:

వంశీ ఇంటర్నేషనల్ ,తిరుమల బ్యాంక్ సంయుక్త ఆద్వర్యంలో ఏడ దశాబ్దాల స్వర్ణయుగ మహానటి షావుకారు జానకికి కే,వి రమణ జాతీయ పురస్కారం -2020 ప్రదానం చేశారు.స్వర్ణ కంకణం పుష్పాబిషేకం మహోత్సవం నిర్వహించారు.తెలంగాణా ప్రబుత్వం సలహాదారు రమణ చారి పేరిట ఆయన జన్మదిన సందర్బాన్ని పురస్కరించుకుని రెండేళ్లుగా ఈ సంస్థలు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాయి.రవీంద్ర భారతి లో ఫెబ్రవరీ 14న సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ అద్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిధిగా తెలంగానా శాసన మండలి చైర్మన్ గుట్ట సుకేందర్ రెడ్డి హాజరయ్యారు.నట కీరిటి రాజేంద్ర ప్రసాద్ ,నటుడు రచయిత తనికేల్ల భరణి ,నటి మణులు జమున ,రోజా రమని ,తిరుమల బ్యాంక్ చైర్మన్ వై .రాజేంద్ర ప్రసాద్ ,వంశీ సంస్థల వ్యవస్థాపకులు వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : షావుకారు జానకికి కే.వి రమణ పురస్కారం
ఎవరు: షావుకారు జానకికి
ఎక్కడ :హైదరాబాద్
ఎప్పుడు:ఫిబ్రవరి 14
ఎపి గవర్నర్ బిశ్వా బుషణ్ హరిచందన్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం :

ఎపి గవర్నర్ బిశ్వా బుషణ్ హరిచందన్ పంజాబ్ లోని దేశ్ భగత్ విశ్వవిద్యాలయంలో గౌరవ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది,సామాజిక శాస్త్ర విభాగంలో ఆయన చేసిన కృషికి సేవలకు గుర్తింపు గా ఈ డాక్టరేట్ అందజేశారు.విశ్వ విద్యాలయం ఎదో స్నాతకోత్సవాన్ని పంజాబ్ లోని మదిగోబింద్ ఘర్ లో ఫెబ్రవరి 14 నిర్వహించారు.ఈ సందర్భంగా కులపతి డాక్టర్ జోరా సింగ్ గవర్నర్ కు డాక్టర్ రేట్ ప్రదానం చేశారు.గవర్నర్ హరిచందన్ విద్యార్తులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ అబివ్రుద్దిలో బాగస్వామ్యం ఉండేలా అంటా కృషి చేయాలనీ సూచించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎపి గవర్నర్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
ఎవరు: బిశ్వా బుషణ్ హరిచందన్
ఎక్కడ :ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు:ఫెబ్రవరి 14
తుపాకుల గూడెం బ్యారేజి పేరును సమ్మక్క బ్యారేజిగా మార్పు:

తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న తుపాకుల గూడెం బ్యారేజికి తెలంగాణా ఆదివాసి వీర వనిత ,వన దేవత సమ్మక్క పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కే .చంద్ర శేఖర్‌రావు నినయించారు.ఈ మేరకు బ్యారేజి కి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేయాలనీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీ ధర్ రావు ఫెబ్రవరి 12న ఆదేశించారు.సాగు నీటి ప్రీజేక్టుల నిర్మాణం పూర్తి అయి బీడు భూముల్లో కాళేశ్వరం నీలు చేరుకుంటున్న శుభ సందర్బంలో ఇప్పటికే పలు బ్యారేజిలకు రిజర్వాయర్ లకు దేవతా మూర్తుల పేర్లను పెట్టుకున్నామని సిఎం కేసిఆర్ గుర్తు చేశారు.మరో వైపు ఫెబ్రవరి 13న ముక్య మంత్రి కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : తుపాకుల గూడెం బ్యారేజి పేరును సమ్మక్క బ్యారేజిగా మార్పు
ఎవరు:తెలంగాణా ప్రబుత్వం
ఎక్కడ :తెలంగాణా
ఎప్పుడు:ఫిబ్రవరి 14
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఎయిర్ ఇండియా సిఎండిగా రాజీవ్ బన్సాల్ నియమకం :

ప్రబుత్వ రంగ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా కు సిఎండిగా సీనియర్ ప్రబుత్వ అధికారి అయిన రాజీవ్ బన్సాల్ ను కేంద్ర ప్రబుత్వం ఫెబ్రవరి 13న నియమించారు.నాగాలాండ్ క్యాడర్ కు చెందిన 1988 బ్యాచ్ ఐఎఎస్ ఆఫీసర్ రాజీవ్ బన్సాల్ గతంలో విజయవంతంగా ఆ సంస్థను నడిపించారు.2017 లో మూడు నెలల పాటు మధ్యంతర ఎయిర్ ఇండియా సిఎండిగా సేవలందించారు.ఆ సమయంలో వ్యయాలను గణనీయంగా తగ్గించి సమయానికి విమానాలు నడిచేలా చేశారు.దేంతో ప్రస్తుతం అప్పులు ఊబిలో కోరుకుపొయిన సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రబుత్వం ఆయన్ని మళ్ళి నియమించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎయిర్ ఇండియా సిఎండిగా రాజీవ్ బన్సాల్ నియమకం
ఎవరు: రాజీవ్ బన్సాల్
ఎప్పుడు:ఫిబవరి 14
రీడింగ్ మిషన్ -హర్యానా పథకం పథకం ప్రవేశ పెట్టిన హర్యాన ప్రబుత్వం :

హర్యానా రాష్ట్ర ప్రబుత్వం “రీడింగ్ మిషన్–హర్యానా” అనే పతకం ను ప్రారంబించింది.ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు పుస్తక పటన అలవాటును ప్రోత్సహించడానికి ఈ పథకం ను ప్రారంబించింది.ఈ పథకం కేంద్ర ప్రబుత్వ పథకం అయిన “రీడింగ్ మిషన్ -2022”తరహలో ఉంది.రాష్ట్ర ప్రబుత్వ చొరవతో విద్యాసంస్థ లలోని విద్యార్థులు నెలవారీ సమీక్షా సమావేశాలు మరియు మాస్ బుక్ రీడింగ్ ను నిర్వహించనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : రీడింగ్ మిషన్ హర్యానా పథకం పథకం ప్రవేశ పెట్టిన హర్యాన ప్రబుత్వం
ఎవరు:హర్యానా ప్రబుత్వం
ఎక్కడ :హర్యాన
ఎప్పుడు:ఫెబ్రవరి 13
ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా మన్ ప్రీత్ సింగ్ ఎంపిక :

2019 ఏడాది కి గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్ )”ప్లేయర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు ను భారత పురుషుల హాకీ జట్టు సారధి మన్ ప్రీత్ సింగ్ గెల్చుకున్నాడు దీంతో ఈ అవార్డు ను గెలుచుకున్న మొట్టమొదటి భారత హాకీ ప్లేయర్ గా మన్ ప్రీత్ సింగ్ రికార్డు నెలకొల్పాడు.పురుషుల విభాగంలో ఎఫ్ఐహెచ్ ప్లేయర్ గా ఆఫ్ ది ఇయర్ గా అవార్డు కొరకు బెల్జియం ప్లేయర్ ఆర్తర్ వాన్ డారెన్ ,అర్జంటినా ఆటగాడు లుకాస్ విల్లాలు పోటీలో పోలలైన ఓట్లను దక్కించుకున్న మన్ ప్రీత్ సింగ్ విజేతగా నిలిచాడు.ఆర్థర్ 19.7 శాతం లుకాస్ 16.5 శాతం ఓట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.మన్ ప్రీత్ సింగ్ తో పాటు భారత యువ మిడ్ ఫీల్డర్ వివేక్ సాగర్ ప్రసాద్ ఎఫ్ఐహెచ్ “రైజ్జింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకున్నాడు.మహిళల విభాగంలో ఇదే అవార్డ్డును భారత ప్లేయర్ లాల్ రెం సియామి గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎఫ్ఐ హెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా మాన్ ప్రీత్ ఎంపిక :
ఎవరు :మన్ ప్రీత్ సింగ్
ఎప్పుడు:ఫెబ్రవరి 13
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |