
Daily Current Affairs in Telugu 13&14 August-2022
నెదర్లాండ్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ని గెలుచుకున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్ హర భరతకోటి :

ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ హర భరతకోటి తన కెరీర్లో మరో టైటిల్ సాధించాడు. నెదర్లాం డ్స్ లో జరిగిన హెచ్ఐజెడ్ యూనివర్సిటీ ఆప్లయిడ్ సైన్సెస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 22 ఏళ్ల హర్ష చాంపియన్ అవతరించాడుఆగస్ట్ 14న ముగిసిన ఈ టోర్నీలో పార్టీ మొత్తం ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి రెండు వేల యూరోలు (రూ. లక్షా 63 వేలు) ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హర్ష ఎనిమిది గేముల్లో గెలిచి. మరో గేమ్లో ఓడిపోయాడు. తొలి రౌండ్లో క్లీన్ జోబిక్ (నెదర్లాండ్స్)పై కు ఎత్తుల్లో రెండో కౌంట్ లో ఎడువార్డ్ కోనెన్ (నెదర్లాండ్ పై 28 ఎత్తు ల్లో ఎల్దార్ వాన్ బార్ నెదర్లాండ్స్ పై 24 ఎత్తుల్లో గెలిచిన హర్ష నాలుగో రౌండ్లో శ్రేయస్ రాయల్ (ఇంగ్లండ్) చేతిలో 5 గ్ ఎత్తుల్లో ఓడిపో యారు. ఐదో రౌండ్ లో తేరుకున్న హర్ష వారిని కేవలం 14 ఎత్తుల్లో రేని దచేన్ నెదర్లాండ్ ను ఓడించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; నెదర్లాండ్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ని గెలుచుకున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్ హర భరతకోటి
ఎవరు : గ్రాండ్ మాస్టర్ హర భరతకోటి
: గ్రాండ్ మాస్టర్ హర భరతకోటి
ఎప్పుడు : ఆగస్ట్ 14
1,082 మందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలు ప్రకటించింన కేంద్ర ప్రభుత్వ0 :

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్రాల పోలీసు విభాగాలకు చెందిన 1,082 మందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలు ప్రకటించింది. విధి నిర్వహణలో అసమాన ప్రతిభ కనబరిచిన వారికి సాహసోపేతంగా వ్యవహరించినవారికి ఇచ్చే సేవా పతకాలూ ఇందులో ఉన్నాయి. 317 మందికి పోలీసు శౌర్య పతకాలు, 87 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 648 మందికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వను న్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. శౌర్య పతకాలు అందుకునే 347 మందిలో 204 మంది జమ్మూ-కశ్మీర్ లో సేవలు అందించినవారే. మొత్తంమీద అత్యధికంగా 109 పతకాలు కేంద్ర రిజర్వ్ పోలీసు దళం’ (సీఆర్చీ ఎప్) సిబ్బంది పొందారు. ఐటీబీపీకి చెందిన 20 మందిక వివిధ పతకాలు లభించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి ; 1,082 మందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలు ప్రకటించింన కేంద్ర ప్రభుత్వ0
ఎవరు : కేంద్ర ప్రభుత్వ0
ఎప్పుడు : ఆగస్ట్ 14
75 పర్వత శిఖరాలను అధిరోహించనున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ దళాలు ;

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళం అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15న చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న 75 పర్వత శిఖరాలను ఐటీబీపీ సిబ్బంది అధిరోహించనున్నారు. ‘అమృత్ హణ్ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్ర మంలో 75 శిఖరాలపైన జాతీయ జెండాలను ఒకేసారి ఎగురవేసి రికార్డు నెలకొల్పనున్నారు. దీంతోపాటు ఎల్సీ వెంబడి ఐటీబీపీ సిబ్బంది. 75 రోజులపాటు ప్రత్యేక గస్తీ నిర్వహించను చెప్పారు. ఆగస్టు 1న లద్దాల్లోని కారాకో రమ్ పాస్ వద్ద ఇది మొదలైందని, అక్టోబరు 14న అరుణాచల్ ప్రదేశ్లోని జచెప్ లా వద్ద ముగుస్తుందని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; 75 పర్వత శిఖరాలను అధిరోహించనున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ దళాలు
ఎవరు : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ దళాలు
ఎప్పుడు : ఆగస్ట్ 14
‘వాయు సేవ శౌర్య పతకం’ గెలుచుకున్న భారత వాయుసేన ఫైట్ లెఫ్టినెంట్ డి రవీందర్ రావు ::

భారత వాయుసేనకు చెందిన పైట్ లెఫ్టినెంట్ డి. రవీంద్రరావుకు ప్రభుత్వం ‘వాయు సేవ శౌర్య పతకం’ ప్రకటించింది. ప్రమాదంలో చిక్కుకున్న తోటి పైలట్ ప్రాణాలను అత్యంత ధైర్య సాహసాలతో రక్షించినందుకు దీనికి ఎంపికయ్యారు. 2021 నవంబర్ 6న లెఫ్టినెంట్ రవీంద్రరావు జాగ్వార్ యుద్ధవిమానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ల్యాండింగ్ తర్వాత సమీపంలో మరో జాగ్వార్ విమానం నుంచి పెద్ద పేలుడు శబ్దం రావడాన్ని విన్నారు. ఆ విమానం కూలిపోయి రన్ వె మీద . జారిపోతుండటాన్ని గమనించి, ఉన్నపళంగా ఆ స్థలానికి వద్దకు చేరుకున్నారు. ఆ విమానం తలకిందులై ఉంది. స్థల కొంత భాగం విరిగిపోయింది. రెండు ఇంజిన్లూ వెనక మాత్రం నడుస్తున్నాయి. అందులోని పైలట్ రక్తదారలతో సీటు పట్టీలకు వేలాడుతూ కనిపించారు. అగ్ని మాపక శకటాలకు రవీంద్రరావు సరైన మార్గదర్శనం చేశారు తలకిందులైన విమానం నుంచి బాధిత పైలట్ తప్పించుకొనే పరిస్థితిలో లేరని గమనించి తన ప్రాణాలను లెక్కచేయ కుండా ఆ విమానం కాక్ పిట్ కిందికి పాక్కుంటూ వెళ్లారు. విమాన ఇంజిన్లను అపే ప్రయత్నం చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; ‘వాయు సేవ శౌర్య పతకం’ గెలుచుకున్న భారత వాయుసేన ఫైట్ లెఫ్టినెంట్ డి రవీందర్ రావు
ఎవరు : ఫైట్ లెఫ్టినెంట్ డి రవీందర్ రావు
ఎప్పుడు : ఆగస్ట్ 14
ఘంటసాల పురస్కారం గెలుచుకున్న ప్రముఖ గాయని పి.సుశీల :

కన్నడ-తెలుగు ప్రజలు తోబుట్టువులు అన్ని భాషల అభిమానులూ నన్ను ఆదరించారు. 12 భాషల్లో పాటలు పాడా ప్రేక్షకుల అభిమానమే నాకు జీవం పోసింది’ అని ప్రముఖ గాయకురాలు. పి.సుశీల అన్నారు. బెంగళూరులోని శ్రీకృష్ణదేవరాయ కళామందిరంలో తెలుగు విజ్ఞాన సమితి ఆగస్ట్ 13న ఆమెకు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆమె మాట్లాడుతూ. పురస్కారాల కోసం నేను ఏనాడూ పాడలేదు. మంటసాల నా గురువు నా దైవం. ఆయన ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చా. తొమ్మిది పదుల వయసులోనూ పాడాలనే తపన ఉన్నా పాడలేకపోతున్నా అని తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ చంద్రశేఖర్ కంబార మాట్లాడుతూ ఉత్తరాదిన లతా మంగేష్కర్ దక్షిణాదిన సుశీల సంగీత సామ్రాజ్యాలు స్థాపించారని శ్లాఘించారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ. రాధాకృష్ణరాజు, ఉపాధ్యక్షుడు గంగరాజు, ప్రధాన కార్యదర్శి ఇడమకంటే లక్ష్మీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాస్కరుని సత్య జగదీశ్ రాసిన మన ‘ఘంటసాల కథ” అనే పుస్త కాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; ఘంటసాల పురస్కారం గెలుచుకున్న ప్రముఖ గాయని పి.సుశీల
ఎవరు : పి.సుశీల
ఎప్పుడు : ఆగస్ట్ 13
ట్రాన్స్-హిమాలయన్ మల్టీ-డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్ వర్క్ కు అద్యయనం కు అంగీకరించిన చైనా దేశం :

ట్రాన్స్-హిమాలయన్ మల్టీ-డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్‌వర్క్ ప్రోగ్రాం కింద నేపాల్ తో క్రాస్-బోర్డర్ రైల్వే కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఆర్థిక సహాయం చేయడానికి చైనా దేశం అంగీకరించింది. ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)లో ఒక భాగం. దేశంలో చైనా-సహాయక ప్రాజెక్టుల కోసం చైనా 118 మిలియన్ డాలర్లను కూడా హామీ ఇచ్చింది. చైనా గ్రాంట్ అసిస్టెన్స్ కింద కీరుంగ్-ఖాట్మండు రైల్వే సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని చేపడుతుంది
క్విక్ రివ్యు :
ఏమిటి ; ట్రాన్స్-హిమాలయన్ మల్టీ-డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్ వర్క్ కు అద్యయనం కు అంగీకరించిన చైనా దేశం
ఎవరు : చైనా దేశం
ఎప్పుడు : ఆగస్ట్ 14
స్టాక్ మార్కెట్ వర్గాల్లో ‘బిగ్ బుల్’గా ప్రసిద్ది చెందిన రాకేశ్ జంజన్ వాలా కన్నుమూత :

స్టాక్ మార్కెట్ వర్గాల్లో ‘బిగ్ బుల్’గా ప్రసిద్ధిగాంచిన రాకేశ్ ఝునాున్వాలా (62) ఆది వారం ఉదయం హఠాత్తుగా తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన మరణించారని. ఆదివారం ఉదయం 6.15 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే మృతిచెందినట్లు బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారు. వారెన్ బఫెట్తో పోల్చారూ ‘భారత వారెన్ బఫెట్ వ్యవహరించేవారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; స్టాక్ మార్కెట్ వర్గాల్లో ‘బిగ్ బుల్’గా ప్రసిద్ది చెందిన రాకేశ్ జంజన్ వాలా కన్నుమూత
ఎవరు : రాకేశ్ జంజన్ వాలా
ఎప్పుడు : ఆగస్ట్ 13
12న ప్రపంచ ఏనుగుల దినోత్సవ౦గా ఆగస్ట్ 12 :

ఏనుగుల సంరక్షణపై అవగాహన కల్పించడానికి మరియు అడవి బందీలుగా ఉన్న ఏనుగుల యొక్క మెరుగైన రక్షణ మరియు నిర్వహణ కోసం అందరికి అవగాహన మరియు సానుకూల పరిష్కారాలను పంచుకోవడానికి ఏటా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సున్నితమైన దిగ్గజాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన పెంచడంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. .ఇది ఏనుగుల రక్షణ అవసరాన్ని మరియు వాటి మనుగడను నిర్ధారించడానికి చట్టాలు మరియు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా హైలైట్ చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి ; 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవ౦గా ఆగస్ట్ 12
ఎవరు : రాకేశ్ జంజన్ వాలా
ఎప్పుడు : ఆగస్ట్ 13
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |