Daily Current Affairs in Telugu 13 June-2022
దేశ చరిత్రలో తొలిసారిగా ‘డిస్ ప్లే ఫ్యాబ్’తయారీ రంగంలో పెట్టుబడిని సాధించిన తెలంగాణా రాష్ట్రము :

దేశ చరిత్రలో తొలిసారిగా ‘డిస్ ప్లే ఫ్యాబ్’తయారీ రంగంలో తెలంగాణా రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల భారీ పెట్టుబడి లభించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రముఖ ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ తన అనుబంధ సంస్థ ఎలెస్ట్ ద్వారా తెలంగాణలో అడ్వాన్స్డ్ అమోలెడ్ డిస్ ప్లే ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సాధించింది. జూన్ 12న బెంగళూరులో మంత్రి కె. తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఎలెస్ట్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఎబెస్ట్ తరపున రాజేశ్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో 6వ తరం అమోలెడ్ డిస్ ప్లే ఫ్యాబ్ ఉత్పత్తి కోసం రూ. 24 వేల కోట్లను సంస్థ పెట్టుందిగా పెట్టనుంది.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని :హైదరబాద్
- తెలంగాణ రాష్ట్ర సిఎం :కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ :తమిలసై సౌందరరాజన్
- తెలంగాణా రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖా మంత్రి : కే.తారక రామారావు
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశ చరిత్రలో తొలిసారిగా ‘డిస్ ప్లే ఫ్యాబ్’తయారీ రంగంలో పెట్టుబడిని సాధించిన తెలంగాణా రాష్ట్రము
ఎవరు : తెలంగాణా రాష్ట్రము
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు : జూన్ 13
ఇన్-స్పేస్ సెంటర్ ను ప్రారంబించిన భారత ప్రదాని నరేంద్ర మోడి :

గుజరాత్ రాష్ట్రము లోని అహ్మదాబాద్ లో ఇండియన్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) మోదీ గారు ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను, సవీన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. ఐటీ తరహాలోనే గ్లోబల్ స్పేస్ సెక్టార్ లోనూ భారత సంస్థలు అగ్రగామికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో గతంలో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం లభించేది కాదని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సంస్కరణలను తెరతీయడం ద్వారా ప్రైవేట్ రంగానికి స్వాగతం పలుకుతోందని తెలిపారు. సైన్ సెక్టార్ లో సంస్కరణల ద్వారా అన్ని నియంత్రణలను, ఆంక్షలను తొలగించారని వివరించారు. ప్రైవేట్ రంగానికి ఇప్-స్కేప్ తగిన మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
- గుజరాత్ రాష్ట్ర రాజధాని : అహ్మదాబాద్
- గుజరాత్ రాష్ట్ర సిఎం : భూపేంద్ర భాయ్ పటేల్
- గుజరాత్ రాష్ట్ర గవర్నర్ : ఆచార్య దేవ్ వ్రథ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్-స్పేస్ సెంటర్ ను ప్రారంబించిన భారత ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు : భారత ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ: గుజరాత్ లో ని అహ్మదాబాద్
ఎప్పుడు : జూన్ 13
ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో స్వర్ణపతకం గెలుచుకున్న తెలుగు కుర్రాడు శనపతి గురునాయుడు :

అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి తెలుగు తేజం మెరిసింది. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు శనపతి గురునాయుడు పసిడి పతకంతో ఆదరగొట్టాడు. గురునాయుడు ప్రతిభతో ఈ టోర్నీలో భారత్కు బంగారు పతకాల బోణీ లభించింది. మెక్సికోలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ లో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురునాయుడు బాలుర 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. స్నాచ్ లో 104 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ లో 126 కేజీలు బరువెత్తి ఓవరాల్గా 200 కేజీలతో గురునాయుడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియా లిఫ్టర్ మాజీద్ అలీ (229 కేజీలు; స్నాచ్లో 105 క్లీన్ ఆండ్ జెర్క్ 124) రజతం. కజకిస్తాన్ లిఫ్టర్ రాసిల్ ఉమ్రావ్ (224 కేజీలు: స్నాచ్ లో 100 – క్లీన్ అండ్ జెర్క్ 124) కాంస్యం సాధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో స్వర్ణపతకం గెలుచుకున్న తెలుగు కుర్రాడు శనపతి గురునాయుడు
ఎవరు : తెలుగు కుర్రాడు శనపతి గురునాయుడు
ఎప్పుడు : జూన్ 13
ట్రిపుల్ జంప్ లో జాతీయ రికార్డు సృష్టించిన ఐశ్వర్య బాబు :

అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో కర్ణాటక అమ్మాయి ఐశ్వర్య బాబు చాటింది. ట్రిపుల్ జంప్ చేసి జాతీయ రికార్డు సృష్టించింది. జూన్ 13 న జరిగిన పోటీల్లో ఐశ్వర్య 14. 14 మీటర్ల దూరం దూకి మయూఖ జానీ (14.11 మీ, 2011లో) సృష్టించిన రికార్డును తిరగరాసింది. ఈ పోటీల్లో రేణు (13,43 మీ) రజతం, కార్తీక (13.25 మీ) కాంస్యం నెగ్గారు. ఆదివారం లాంగ్ జంప్ లో 6,73 మీటర్ల దూకి అంజు బాబీ జార్జ్ (6.83 మీ) తర్వాత ఉత్తమంగా దూకిన భారత జాతీయ రికార్డు సృష్టించింది.. జూన్ 13న జరిగిన పోటీల్లో ఐశ్వర్య 14. 14 మీటర్ల దూరం దూకి మయూఖ జానీ (14.11 మీ. 2011లో సృష్టించిన రికార్డును తిరగరాసింది. ఈ పోటీల్లో రేణు (13.43 మీ) రజతం, కార్తీక (13.25 మీ) కాంస్యం నెగ్గారు. జూన్ 13న లాంగ్ జంప్ 6,73 మీటర్ల దూకి అంజు బాబీ జార్జ్ (6.83 మీ) తర్వాత ఉత్తమంగా దూకిన భారత మహిళా అథ్లెట్గా ఐశ్వర్య ఘనత సాధించింది. పురుషులు డిస్కప్ట్ లో కృపాల్సెంగ్ (60,31. మీ) స్వర్ణం గెలుచుకోగా మహిళల విభాగంలో నవజీత్ కౌర్ (55.67 మీ) పసిడి పతకం నెగ్గింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : . ట్రిపుల్ జంప్ లో జాతీయ రికార్డు సృష్టించిన ఐశ్వర్య బాబు
ఎవరు : ఐశ్వర్య బాబు
ఎక్కడ:చెన్నై
ఎప్పుడు : జూన్ 13
మాజీ ఒలింపియన్‘ హరిచంద్ కన్నుమూత :

మాజీ ఒలింపియన్’ హరిచంద్ మర ణించారు. ఆయన వయసు 69 ఏళ్లు. పంజా బ్లోని హోషియారప్పుర్కు చెందిన హరి. లాంగ్ డిస్టెన్స్ పరుగులో పలు రికార్డులు నెలకొ లారు. 1976 మాంట్రియల్, 1980 మాస్కో ఒలింపిక్స్లో మెరిసిన ఆయన.. 1978 ఆసియా క్రీడల్లో 5 వేల మీటర్లు, 10 వేల మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలు సాధించారు. మాంట్రియల్ ఒలింపిక్స్ లో 28 నిమిషాల 48.72 సెకన్లలో 10 వేల మీటర్ల పరుగును పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డు 32 ఏళ్ల పాటు నిలి చింది. మాంట్రియల్ క్రీడల్లో హిట్స్ ఎనిమిదో స్థానంలో నిలిచిన హరి. ఆ తర్వాత మాస్కో ఒలింపిక్స్లోలో (28 నిమిషాల 45.8 సె) హిట్స్ లో పదో స్థానం సాధించారు..
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాజీ ఒలింపియన్’ హరిచంద్ కన్నుమూత
ఎవరు : హరిచంద్
ఎప్పుడు : జూన్ 13
.
బాల కార్మికుల వ్యతిరేఖ దినోత్సవంగా జూన్ 12 :

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ప్రపంచవ్యాప్తంగాఉన్నటువంటి బాల కార్మికులు అంతరించిపోవడం, దాని నిర్మూలనకు అవసరమయ్యే చర్యలను తీసుకోవడానికివాటిపైన దృష్టి సారించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 2015లో, ప్రపంచ నాయకులు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGలు)ను స్వీకరించారు, అందులో వారు బాల కార్మికులను ఆ వ్యవస్థను అంతం చేయడానికి ఒక నిబంధనను చేర్చారు.
- అంతర్జాతీయ కార్మిక సంస్థ స్థాపన :1919
- అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం : జెనీవా( స్విట్జర్ ల్యాండ్ )
- అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రస్తుత సెక్రటరి జనరల్ : గై రైడర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాల కార్మికుల వ్యతిరేఖ దినోత్సవంగా జూన్ 12
ఎవరు : అంతర్జాతీయ కార్మిక సంస్థ
ఎప్పుడు : జూన్ 12
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |