
Daily Current Affairs in Telugu 13-05-2020
20 లక్షల కోట్ల రూపాయలు ఆర్ధిక ప్యాకేజి ని ప్రకటించిన భారత ప్రదాని నరేంద్ర మోడి :

మహమ్మారి వైరస్ అయిన కోవిద్ -19 (కరోనా)తో వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు పోరాడుతుండగా భారత ప్రదాని నరేంద్ర మోడి భారత ప్రజలనుద్దేశించి 20 లక్షల కోట్ల రూపాయలు ఎకనామిక్ ప్యాకేజిని ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే పథకం రూపకల్పన చేసింది. ఆర్ధిక ప్యాకేజి వివరాలను ఆర్ధిక మంత్రిత్వ శాఖ అతి త్వరలో వెల్లడిస్తుంది. భారత ఆర్హ్తిక వ్యవస్థలోని అన్నివర్గాలను ఆదుకునే ప్రణాళికతో ఒక భారీ ఆర్ధిక ప్యాకేజి ని మే 12న ప్రదాని మోడీ ప్రకటించారు.ఈ ప్యాకేజి రైతులు,కార్మికులు,మత్స్య కారులు,వలస దారులు మరియు దేశ పరిశ్రమలకు తోడ్పడాలని భావిస్తుంది. ఈ ప్యాకేజి ద్వారా కోవిడ్-19 మహమ్మారి నుండి గ్రామిన భారత దేశాన్ని ఆదుకోవాలని ప్రధాన మంత్రి ఈ ప్యాకేజిని ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 20 లక్షల కోట్ల రూపాయలు ఆర్ధిక ప్యాకేజి ని ప్రకటించిన భారత ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు: భారత ప్రదాని నరేంద్ర మోడి
ఎప్పుడు : మే 13
CBSE నూతన చైర్మన్ గా నియమితులయిన మనోజ్ అహుజా :

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) నూతన చైర్మన్ గా ఓడిశా కేడర్ ఐఎఎస్ మనోజ్ అహుజా ను నియమించారు. ప్రస్తుతం ఆయన స్పెషల్ డైరెక్టర్ ,లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గా పని చేస్తున్నారు. ఆయన స్థానంలో అనితా కార్వాల్ ను సిబిఎస్ఇ చైర్మన్ గా నియమించనున్నారు. గత వారంలో మానవ వనరుల అబివృద్ధి మంత్రిత్వ శాఖ పాటశాల విద్య అక్షరాస్యత శాఖ కార్యదర్శిగా నియైతులయిన ఐ.ఎ.ఎస్. అనితా కార్వాల్ తరువాత మనోజ్ అహుజా నియమితులయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : CBSE నూతన చైర్మన్ గా నియమితులయిన మనోజ్ అహుజా
ఎవరు: మనోజ్ అహుజా
ఎప్పుడు : మే 13
ఫార్ములా వన్ డ్రైవర్ సెబాస్టియన్ వెటేల్ ఫెరారి జట్టుకు రిటైర్మెంట్ :

నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన ఫార్ములావన్ డ్రైవర్ సెబాస్టియన్ వెటేల్ 2020 ఏడాదికి జట్ట్టును వీడ్కోలు పలుకుతున్నాడు. మేము కలిసి పని చేయడానికి ఇక పై అవకాశం లేదు ఫెరారి జట్టుతో నా బంధం ఈ ఏడాదితో ముగియనుంది.నెఉ ఫెరారీ ఎఫ్ -1 టీం తో కలిసి తీసుకున్న నిర్ణయం ఇది అని సెబాస్టియన్ వేటేల్ తెలిపారు.2015 లో ఫెరారీ లో వేటేల్ జత కట్టాడు .ఫెరారీ డ్రైవర్ గా ఇప్పటి వరకు వేటేల్ 103 రేసుల్లో పాల్గొన్న గా కేవలం 14 రేసుల్లో మాత్రమే విజేత గా నిలిచాడు.2017,2018 సీజన్ ఓ డ్రైవర్ ప్రపంచ చాంపియన్ రన్నర్ గా నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫార్ములా వన్ డ్రైవర్ సెబాస్టియన్ వెటేల్ ఫెర్రి జట్టుకు రిటైర్మెంట్
ఎవరు: సెబాస్టియన్ వెటేల్
ఎప్పుడు : మే 13
పాక్ వన్డే ,టి20 జట్ల కెప్టెన్ గా బాబర్ ఆజం నియామకం :

స్టార్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం ను పాకిస్తాన్ వన్డే ,టి20 జట్లకు కొత్త కెప్టెన్ గా నియమించారు. సర్ఫరాజ్ అహ్మద్ ను కెప్తెన్సీ బాద్యతల నుంచి తప్పించి వీటిని బాబర్ ఆజం కు కట్టబెట్టారు .టెస్టులకు మాత్రం కెప్టెన్ గా అజహర్ అలీ నే కొనసాగుతారని చీఫ్ సెలక్షన్ మిస్భా ఉల్ హక్ తెలిపారు. అలాగే 2020-21 సీజన్ కు సంబంధించి న ఆటగాళ్ళ కాంట్రాక్టు జాబితాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ప్రకటించింది.18 మంది పేయర్ల కాంట్రాక్టు లో కొత్తగా ఇద్దరికీ చోటు దక్కింది.నసీం షా ,అఫ్తికార్ అహ్మద్ లు రాగా హసన్ అలీ ,అమీర్ ,వహాబ్ రియాజ్ లకు కాంట్రాక్టు దక్కలేదు .
క్విక్ రివ్యు :
ఏమిటి : పాక్ వన్డే ,టి20 జట్ల కెప్టెన్ గా బాబర్ ఆజం నియామకం :
ఎవరు: బాబర్ ఆజం
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు: మే 13
భారత్ కు ఎన్డిబి నుంచి బిలియన్ డాలర్ల రుణ సహాయం :

కరోన వైరస్ పోరులో భారత్ కు ఆర్తికంగా బ్రిక్స్ న్యు డెవలప్ మేట బ్యాంక్ (ఎన్డిబి)అండగా నిలిచింది. ఎమర్జెన్సి అసిస్టెంట్ ప్రోగ్రాం ద్వారా భారత్ కు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7500కోట్ల రుణం) సహాయం అందించినట్లు ఎన్ డిబి మే 13న వెల్లడించింది. వైరస్ వ్యాప్తి వల్ల కలిగిన సామాజిక ఆర్ధిక నష్టాలను తగ్గించడానికి ఈ రుణం ఉపయోగపడుతుంది.కరోనా వైరస్ కారణంగా బ్రిక్స్ దేశాలయిన బ్రెజిల్ ,రష్యా ,ఇండియా,చైనా,దక్షిణాఫ్రికా ఆర్థికంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపద్యంలో ఆయా దేశాలకు ఆర్థీక సహాయం అందించాలని ఎన్డిబి నిర్ణయించింది. ఇందులో భాగంగా భారత్ కు తక్షణ సహాయంగా 1బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు 2020 ఎప్రిల్ 30న ఎన్.డి .బి డైరెక్టర్ లు అంగీకరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్ కు ఎన్ డిబి నుంచి బిలియన్ డాలర్ల రుణ సహాయం
ఎవరు: ఎన్డిబి
ఎప్పుడు: మే 13
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |