
Daily Current Affairs in Telugu 12-02-2020
మిదాని సిఎండిగా సంజయ్ కుమార్ జూ నియామకం :

హైదరాబాద్‌లో ప్రదాన కేంద్రంగా కొనసాగుతున్న కేంద్ర ప్రబుత్వ రంగ సంస్థ మిశ్రదాతు నిగం లిమిటెడ్ (సిఎండి)గా సంజయ్ కుమార్ జా నియమితులయ్యారు.ఇందుకు కేంద్ర నియామకాల కేబినేట్ కమిటీ ఫెబ్రవరి 12న ఆమోద ముద్ర వేసారు.ప్రస్తుతం మిదాని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంజయ్ కుమార్ కు సిఎండిగా పదోన్నతి కల్పించాలని డిఫెన్స్ ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ చేసిన ప్రతిపాదన కు కేబినేట్ కమిటీ పచ్చజండా ఊపింది. మే 01 నుంచి ఆయన నూతన బాద్యతలు స్వీకరించే వరకు సంబంధిత పదవిలో నే కొనసాగుతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మిదాని సిఎండిగా సంజయ్ కుమార్ జూ నియామకం
ఎక్కడ:డిల్లి
ఎవరు:సంజయ్ కుమార్ జా
ఎప్పుడు: ఫెబ్రవరి 12
యుఎఈ క్రికెట్ డైరెక్టర్ గా రాబిన్ సింగ్ నియామకం :

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ సింగ్ యుఎఈ క్రికెట్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.ప్రదాన కోచ్ డగీ బ్రౌన్ పై వేటు వేసిన ఏమిరేట్స్ క్రికెట్ బోర్డు రాబిన్ సింగ్ కు బాద్యతలు అప్పగించింది.ఫిక్సింగ్ కుంబ కోణంలో సంక్షోబంలో కోరుకుపొఇన యుఎఈ క్రికెట్ ను రాబిన్ ఎలా నడిపిస్తాడో చూడాలి .ఫిక్సింగ్ అబియోగాలపై ఇంతక ముందు ఆ జట్టు కెప్టెన్ మహమ్మద్ నవీద్ తో పాటు సీనియర్ ఆటగాళ్ళు నిషేదానికి గురయ్యారు
క్విక్ రివ్యు :
ఏమిటి: యుఎఈ క్రికెట్ డైరెక్టర్ గా రాబిన్ సింగ్ నియామకం :
ఎక్కడ:దుబాయి
ఎవరు: రాబిన్ సింగ్
ఎప్పుడు:ఫెబ్రవరి 12
డాక్టర్ కార్ల్ జూన్ ,డాక్టర్ నరసింహం లకు జినోమ్ వ్యాలి ఎక్సలెన్స్ అవార్డు:

ఈ ఏడాది జినోమ్ వ్యాలీ ఎక్స లెన్స్ అవార్డు యుఎస్‌లోని యునివేర్సిటి ఆఫ్ పెన్సిల్వేనియా పాథాలజీ ,లాబరేటరీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ కార్ల్ హెచ్ జూన్ నోవార్టిస్ సి ఇఓ డాక్టర్ నరసింహన్ కు లబించింది.బయోఏసియ -2020 సదస్సు పురస్కరించుకుని ఈ అవార్డు లు ప్రకటించారు.ఫెడరేషన్ ఆఫ్ ఏసియన్ బయోటెక్ అసోసియేషన్ (ఫ్యబా )తెలంగాణా రాష్ట్ర ప్రబుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లో ఫెబ్రవరి 17-19 తేదిల్లో ఈ సదస్సు నిర్వహించనున్నాయి.డాక్టర్ కార్ల్ హెచ్ జూన్ కేన్సర్ చికిత్సలో వినియోగించే టి సెల్ తెరఫి అబివృద్ది చేసారు .డాక్టర్ నరసింహన్ సెల్ ,జిన్ తెరఫి వ్యాక్సిన్ల విభాగంలో ఎన్నో ఆవిష్కరణలకు నేతృత్వం ఆహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డాక్టర్ కార్ల్ జూన్ ,డాక్టర్ నరసింహం లకు జినోమ్ వ్యాలి ఎక్సలెన్స్ అవార్డు
ఎక్కడ :హైదరాబాద్
ఎవరు:డాక్టర్ నరసింహం ,డాక్టర్ కార్ల్ జాన్
ఎప్పుడు:ఫెబ్రవరి 12
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఐసిఎఐ అద్యక్షుగా అతుల్ కుమార్ గుప్తా :

భారత చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థ (ఐసిఎఐ)అద్యక్షుదిగా అతుల్ కుమార్ గుప్త ఉప అద్యక్షుడిగా నిహార్ నిరంజన్ జంబుసియా ఎన్నికయ్యారు.2020-21 సంవత్సరానికి వీరు ఎన్నికయ్యారు/ మూడు లక్షల మంది సబ్యులు ,7.20 లక్షల మంది సిఎ విద్యార్థులతో కూడిన ఐసిఎఐ ప్రపంచంలోనే అతి పెద్ద అకౌంటింగ్ సంస్థ .
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసిఎఐ అద్యక్షుగా అతుల్ కుమార్ గుప్తా
ఎవరు: అతుల్ కుమార్ గుప్తా
ఎప్పుడు:ఫెబ్రవరి 12
ఐసిసి గాటోర్నీ తొలి మహిళా రిఫరీగా జీఎస్ లక్ష్మి :

2019 డిసెంబర్ లో పురుషుల అంతర్జాతియ క్రికెట్ మ్యాచ్ కు రిఫరీగా వ్యాహరించిన తొలి మహిళా గుర్తిమౌ పొందిన ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ గండి కోట సర్వ (జీఎస్)లక్ష్మి మరో ఘనతను సాధించనున్నారు.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐఐసి)ప్రపంచ స్థాయి టోర్నీలో తొలి మహిళా మ్యాచ్ రిఫరీగా ఆమె వ్యవహరించనున్నారు.రాజమహేంద్ర వారంకి చెందిన 51 ఎలా జీఎస్లక్ష్మి 2020 ఫెబ్రవరి 21న అశ్రేలియా లో మొదలుకానున్న మహిళా టి20 వరల్డ్ కప్ లో మ్యాచ్ రిఫరేగా బాద్యతలు నిర్వర్తిస్తారు.ఈ మెగా టోర్నీకి మ్యాచ్ రిఫరీగా వ్యవహరించే ముగ్గురిలో ఏకైక మహిళా జీఎస్ లక్ష్మి నే .లక్ష్మి తో పాటు స్టీవ్ బెర్నార్డ్ క్రిస్ బ్రాడ్ లను మ్యాచ్ రిఫరీగా ఐసిసి నియమించిది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐసిసి గాటోర్నీ తొలి మహిళా రిఫరీగా జీఎస్ లక్ష్మి
ఎవరు: జీఎస్ లక్ష్మి
ఎప్పుడు:ఫెబ్రవరి 12