
Daily Current Affairs in Telugu 12-01-2020
విక్రమాదిత్య నుంచి తేజస్ యుద్ద విమానం టేకాఫ్ విజయవంతం :

భారత్ స్వశక్తితో అబివృద్ది చేసిన నౌకా దళ తేజస్ యుద్ద విమానం జనవరి 12న మరో మైలు రాయిని సాధించింది.విమాన వాహక నౌక “ఐఎన్ఎస్ విక్రమాదిత్య “నుంచి ఇది మొదటిసారి గా నింగిలోకి దూసుకెళ్లింది.ఒకింత పైకి లేచినట్లు ఈ నౌక డెక్ భాగం నుంచి ఈ యుద్దవిమానం స్కీ జంప్ పద్దతిలో సర్రున నింగిలోకి దూసుకెళ్లింది. జనవరి 10న ఈ లోహ విహంగం పై విక్రమాదిత్య పై తొలిసారి గా దిగిన సంగతి తెలిసిందే.చిన్నగా ఉండే విమాన వాహక నౌక డెక్ పై దిగడం టేకాఫ్ కావడం నౌకాదళ యుద్ద విమానానికి కీలకం
క్విక్ రివ్యూ:
ఏమిటి: విక్రమాదిత్య నుంచి తేజస్ యుద్ద విమానం టేకాఫ్ విజయవంతం
ఎక్కడ: డిల్లి
ఎప్పడు:జనవరి 12
బూమ్రా కు ఉమ్రీగర్ పురస్కారం :

బిసిసిఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రాదాన ఆకర్షణ గా నిలిచాడు.2018-19 సీజన్లో అంతర్జాతియ క్రికెట్ లో విశేషం గా రాణించిన అతను పాలీ ఉమ్రీగర్ ,ధిలీప్ సర్దేసాయ్ అవార్డును అందుకున్నారు.అత్యత్తమ అంతర్జాతీయ క్రికెటర్ కు ఉమ్రీగర్ పురస్కారంతో పాటు రూ.15లక్షలచెక్కు ఇస్తారు.టెస్టు క్రికెట్లో సీజన్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడితో పాటు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి సర్దేశాయ్ పురస్కారం ను అందిస్తారు.బూమ్ర ఆరు టెస్టుల్లో 34వికెట్లు పడగొట్టాడు.ప్రపంచనంబర్ వన్ వన్డే బౌలరైన బూమ్రా 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికాపర్యటన సందర్బంగా టెస్టులో అరంగ్రేటం చేసాడు.ఇక సీజన్లో అత్యధిక పరుగులు (8మ్యాచుల్లో 677)చేసిన బ్యాట్స్మెన్ గా పుజారా సర్దేసాయ్ పురస్కారాన్నిఅందుకున్నారు.;లెగ్ స్పిన్నర్ పూనం యాదవ్ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికేటర్ అవార్డును స్వీకరించింది.క్రుష్ణామచారి శ్రీ కాంత్ కు కల్నల్ సికే నాయుడు జీవిత సాపల్య పురస్కారం,అంజుం చోప్రా కు బీసిసిఐ మహిళల జీవిత కాల సాపల్య పురస్కారం దక్కాయి.
ఇతర అవార్డులు :
స్మృతి మందాన –మహిళల వన్డేలో అత్యధిక పరుగులు
జులన్ గోస్వామి –మహిళల వన్డేలో అత్యధిక వికెట్లు
మయాంక్ అగర్వాల్ –ఉత్తమ అంతర్జాతీయ అరంగ్రేటం
శేఫాలి శర్మ –ఉత్తమ అంతర్జాతియ అరంగ్రేటం (మహిళలు)
శివం దూబే –లాల అమర్ నాథ్ అవార్డు (రంజీ ట్రోపి ఉత్తమ బౌలర్ )
క్విక్ రివ్యూ:
ఏమిటి: బూమ్రా కు ఉమ్రీగర్ పురస్కారం :
ఎక్కడ:ముంబాయి
ఎప్పడు: జనవరి 12
సెర్బియా దే ఏటి పి కప్ :

చిర కాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ ను జకోవిచ్ మట్టికరిపించడంతో సెర్బియ జట్టు మొట్ట మొదటి ఏటిపి కప్ ను గెలుచుకుంది.జనవరి 12న జరిగిన ఫైనల్లో సెర్బియా 2-1తో స్పెయిన్ పై విజయం సాధించింది. రెండో సింగిల్స్ మ్యాచ్లో ప్రపంచ నంబర్ -2 జకోవిచ్ 6-2,7-6,(7-4)తో ప్రపంచ నంబర్ వన్ నాదల్ ను మట్టికరిపించాడు.అంతకు ముందు రాబర్తో బాటిస్టా ఆగట్ (స్పెయిన్)7-5,6-1తో దుసన్ లజోవిచ్ పై గెలిచాడు.నిర్ణయాత్మక డబుల్స్ లో జకొవిచ్ విక్టర్ త్రయోకి ద్వయం 6-3,6-4 తో ఫెల్సి యానో లోఫెజ్ ఫాట్లో కార్రెన్ బుస్తా జంటను ఓడించి సెర్బియాకు కప్పును అందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సెర్బియా దే ఏటి పి కప్ :
ఎవరు: జకోవిచ్
ఎక్కడ: సిద్నీ
ఎప్పడు:జనవరి 12
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఖేల్ ఇండియా క్రీడల్లో తెలంగాణ కు మరో స్వర్ణం :

ఖెలో ఇండియా క్రీడల్లో మూడో సీజన్లో తెలంగాణా ఖాతాలో మరో స్వర్ణం చేఇంది.జనవరి 12న జరిగిన అండర్ -17 భాలికల 100మీ పరుగులో జీవంజి దీప్తి పసిదితో ఆదరగోట్టింది.12.2556సెకన్ల లో రేసు పూర్తి చేసుకుని ఆమె సరికొత్త మీట్ రికార్డును నెలకొల్పుతూ అగ్ర స్థానంలో నిలిచింది.రెండో స్థానంలో నిలిచిన అథ్లెట్ కంటే దీప్తి 0.0030 సేకన్లకంటే ముందు రేసు ముగించ్కుని త్రుటిలో అగ్ర స్తానాన్ని దక్కించుకోవడం విశేషం .
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఖేల్ ఇండియా క్రీడల్లో తెలంగాణ కు మరో స్వర్ణం
ఎవరు: జీవంజి దీప్తి
ఎక్కడ: గుహవటి
ఎప్పడు:జనవరి 12
హునర్ హాట్ ప్రదర్శన ప్రారంబం:

హైదరాబాద్లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన హునర్ హాట్ ప్రదర్శన ప్రారంబమైంది.కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి జనవరి 12న ఈ ప్రదర్శన ను ప్రారంబించారు.ఈ సందర్బంగా నక్వీ మాట్లాడుతూ పార్లమెంట్ ఉబయ సబల్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)దేశమంతటా వర్తిస్తుందని భారత్లో అంతర్బాగమై రాష్ట్రాలన్నీ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందే అని తేల్చి చెప్పారు.దేశంలోని ముస్లిం లకు ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవని ,అన్ని మతాల ప్రజలకు బద్రత ఉంటుందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హునర్ హాట్ ప్రదర్శన ప్రారంబం:
ఎవరు: కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి
ఎక్కడ: హైదరబాద్
ఎప్పడు: జనవరి 12