
Daily Current Affairs in Telugu 11&12-07-2021
ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ దక్కిన మరో విజయం :

ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) అదరగొట్టాడు. వింబుల్డన్ లో హ్యాట్రిక్ కొట్టాడు. జులై 11న ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్ 6-7 (4-7), 6–4, 6-4, 6-3తో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) పై విజయం సాధించాడు. తొలి సెట్ ను అనూహ్యంగా టైబ్రేక్ లో కోల్పోయిన జకోవిచ్ క్రమంగా పుంజుకుని పైచేయి సాధించాడు. కాగా 34 ఏళ్ల జకోవిచ్ కు ఈ ఏడాదిలో ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. తొలి సెట్ పోయినా ఆరంభంలో తడబడ్డ బెరెటిని అనూహ్యంగా పుంజుకోవడంతో తొలి సెట్ అత్యంత రసవత్తరంగా సాగింది. ధాటిగా ఆటను ఆరంభించిన జకోవిచ్ చక్కని షాట్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. నాలుగో గేమ్ నే బ్రేక్ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. జకోవిచ్ తేలిగ్గానే సర్వీసు నిలబెట్టుకోగా మంచి సర్వర్ అయినప్పటికీ బెరెటిని సర్వీసు కాపాడుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. కానీ 9వ గేమ్ తో ఆట గమనం అనూహ్యంగా మారిపోయింది. 30-40 వద్ద డబుల్ ఫాల్ట్ చేసి బెరేటి చేతిలో దెబ్బ తిన్నాడు. ఎనిమిదో గేం లో సర్వీసు నిలబెట్టుకున్న జకోవిచ్ వెంటనే మరో బ్రేక్ సాధించి సెట్ ను చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ దక్కిన మరో విజయం
ఎవరు: నొవాక్ జకోవిచ్
ఎప్పుడు: జాలై 12
కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో విజేతగా నిలిచిన అర్జంటినా దేశం :

28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు అర్జెంటీనా ముగింపు పలికింది.. తనదైన ఆటతీరుతో కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఎన్నో అంచనాల మధ్య మైదానంలో అడుగుపెట్టిన ఆ జట్టు.డిఫెండింగ్ ఛాంపియన్ బ్రెజిల్ ను దాని సొంతగడ్డపైనే చిత్తుచేసి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ప్రపంచ ఆల్‌టైమ్ అగ్రశ్రేణి ఆటగాడు లియొనాల్ మెస్సీకి జాతీయ జట్టు తరపున ఇదే తొలి ప్రధాన టైటిల్ప్ ప్రఖ్యాత మారకానా స్టేడియంలో అర్జెంటీనా జాతీయ పతాకాలతో ఊగిపోయింది. కోపా అమెరికా 2021 పుట్‌బాల్ ఛాంపియన్షిప్ లో ఆ జట్టు విజేతగా నిలవడంతో ఆ దేశ అభిమానుల కేరింతలతో మోగిపోయింది. ఆది వారం ఫైనల్లో అర్జెంటీనా 1-0 తేడాతో బ్రెజి ల్ను ఓడించింది. డి మారియా జీవితాంతం గుర్తుండిపోయే గోల్ తో జట్టును గెలిపి చాడు. సెమీస్ లో కొలంబియాపై గెలిచిన అర్జెంటీనా జట్టులో అయిదు మార్పులతో ఆ జట్టు కోచ్ స్కాలోని తొలి పదకొండు మందిని మైదానంలోకి పంపి ఆశ్చర్యపరిచాడు మరో వైపు బ్రెజిల్ ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది.ఆరంబం నుంచి జాగ్రత్తగా ఆడిన ఇరు జట్లు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలతో ప్రదర్శించాయి.కాగా కోఫా అమెరికా టైటిల్ ను గెలుచుకున్న అర్జంటినా జట్టు దాదాపు రూ.48కోట్ల ప్రైజ్ మని అందుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో విజేతగా నిలిచిన అర్జంటినా దేశం
ఎవరు: అర్జంటినా జట్టు
ఎప్పుడు: జాలై 12
బీసీసీఐ వర్కింగ్ కమిటీలో చోటు దక్కించుకున్న మహ్మద్ అజరుద్దీన్ :

దేశవాళీ క్రికెట్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం బీసీసీఐ 11 మందితో ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కు చోటు దక్కింది. కరోనా మహమ్మారి కారణంగా రద్దయిన 2020 సీజన్ కు సంబం ధించి క్రికెటర్లకు పరిహారం అందించడం, ఈ ఏడాది దేశ వాళీ టోర్నీల నిర్వహణ కోసం ఈ వర్కింగ్ కమిటీ ఏర్పాట యింది. జూన్ 20న బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర సంఘాలకు పంపిన లేఖలో కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆధ్వర్యంలో ఉపాధ్య క్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా, కోశ్యావారి అరుణ్ ధుమాల్, అజహర్, అభిషేక్ దాల్మియా (ఈజోన్), రోహన్ జైట్లీ (నార్త్ జోన్) కూడా సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బీసీసీఐ వర్కింగ్ కమిటీలో చోటు దక్కించుకున్న మహ్మద్ అజరుద్దీన్
ఎవరు: మహ్మద్ అజరుద్దీన్
ఎప్పుడు:జులై 12
కర్ణాటకరాష్ట్ర 19వ గవర్నర్ గా థావర్ చంద్ గహ్లట్ నియమకం :

కర్ణాటక 19వ గవర్నర్ గా థావర్ చంద్ గహ్లోత్ జులై 11 న బాధ్యతలు చేపట్టారు. రాజ్ భవన్ ని గ్లాస్ హౌస్ లో నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస ఓకా థావర్ చంద్ ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు గవ ర్నర్ గా సేవలందించిన వజూభాయి వాలా, ముఖ్య మంత్రి యడియూరప్ప, విపక్ష నేత సిద్ధరామయ్య, సభాపతి విశ్వేశ్వర హెగ్దే కాగేరి, విధాన పరిషత్తు సభాధ్యక్షుడు బసవరాజు హొరట్టి. కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే, మండ్య ఎంపీ సుమలత అంబ రీశ్, మంత్రులు కె.ఎస్. ఈశ్వరప్ప, సి.పి.యోగీశ్వర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కర్ణాటకరాష్ట్ర 19వ గవర్నర్ గా థావర్ చంద్ గహ్లట్ నియమకం
ఎవరు: థావర్ చంద్ గహ్లట్
ఎక్కడ: కర్ణాటకరాష్ట్ర౦
ఎప్పుడు: జులై 12
యూరో కప్పు ను సొంతం చేసుకున్న ఇటలీ జట్టు :

ఇటలీ ఇరగదీసింది. మిని సాకర్ ప్రపంచక ఏ గా పరిగణించే యూరో కప్ ను సొంతం చేసుకుంది. జులై 11 న జరిగిన మ్యాచ్ లో ఈ అజ్జూరీ జట్టు పెనాల్టీ షూటౌట్లో 3-2 తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది. మ్యాచ్ లో అదనపు సమయం ముగిశాక కూడా స్కోరు 1-1తో సమంగా ఉండడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ మెరుపు షూటౌట్ నిర్వహించక తప్పలేదు. ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో ట్రోఫీ గెలిచేందుకు మైదానంలో అడుగు పెట్టిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. పోరు ఆరంభమైన ఉత్కంఠ రెండు నిమిషాలకే ఆ జట్టు ఆటగాడు లూక్ షా బెరార్డి బ గోల్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. మ్యాచ్ ఆరంభమైన రెండు నిమిషాలకే గోల్ చేసిన లూక్ యూరో కప్ ఫైనల్లో అతి తక్కువ సమయంలోనే గోల్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.. 34 ఏళ్ల వయసు కల ఇటలీ ఆటగాడు లియోనార్డ్ యూరో ఫైనల్లో గోల్ చేసిన అత్యంత వయసు గల ఆటగాడిగా నిలిచారు. మరోవైపు 36 ఏళ్ల 331 రోజుల వయసులో ఫైనల్లో అడుగు పెట్టిన ఇటలీ కెప్టెన్ కిలిని.ఓ సారథిగా యూరో తుదిపోరులో బరిలో దిగిన అత్యంత వయసు కల ఆటగాడిగా నిలిచారు. విజేతగా నిలిచిన ఇటలీ దాదాపు రూ.88 కోట్లు నగదు బహుమతి సొంతం చేసుకోనుంది. రన్నరప్ ఇంగ్లాండ్ సుమారు రూ.61 కోట్లు ఖాతాలో వేసుకోనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: యూరో కప్పు ను సొంతం చేసుకున్న ఇటలీ జట్టు
ఎవరు: ఇటలీ జట్టు
ఎప్పుడు: జులై 12
ప్రపంచ జనాభా దినోత్సవం గా జులై 11 :

ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11 నప్రతి సంవత్సరం జరుపుకుంటారు., ఇది ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క పాలక మండలి 1989 లో స్థాపించింది. ఈ రోజు మొట్టమొదట 11 జూలై 1990 న 90 కి పైగా దేశాలలో గుర్తించబడింది. అప్పటి నుండి, అనేక UNFPA దేశ కార్యాలయాలు మరియు ఇతర సంస్థలు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాయి, ప్రభుత్వాలు మరియు పౌర సమాజ భాగస్వామ్యంతో జనాభా దినోత్సవం ను జరుపుకుంటారు.
. క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ జనాభా దినోత్సవం గా జులై 11
ఎప్పుడు: జులై 11
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |