
Daily Current Affairs in Telugu 09-02-2020
అదునాతాన క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్ :

ఇరాన్ సైన్యంలో సుశిక్షిత రివల్యుషనరీ గార్డ్స్ దళం ఫెబ్రవరి 09 ఒక అదునాతాన్ బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించింది. ఇందులో కొత్త తరం ఇంజిన్లు ఉన్నాయని ,ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు దీన్ని రూపొందించాలని ఆ దళం తెలిపింది. రాడ్-500 అనే ఈ క్షిపనిలో జోహేయిర్ ఇంజిన్ ఉందని పేర్కొంది.మిశ్రమ పద్గార్తలతో ఇది తయారైందని ఉక్కుతో రూపొందించిన ఇతర ఇంజన్ల కన్నా తేలిగ్గా ఉంటుందని వివరించింది. ఈ క్షిపణిలో 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాక గలదని తెలిపింది.అమెరికా తో ఇటీవల ఉద్రిక్తలు ఏర్పడే నేపద్యంలో ఇరాన్ తాజా చర్యకు ప్రాదాన్యం ఏర్పడింది.ఇరాన్ క్షిపణి ,అను కార్య క్రమాలను లక్ష్యంగా చేసుకుంటూ అమెరికా కఠిన ఆంక్షలు విదించిన సంగతి తెలిసిందే.
క్విక్
రివ్యూ:
ఏమిటి: అదునాతాన క్షిపణిని
ఆవిష్కరించిన ఇరాన్
ఎవరు: ఇరాన్
ఎప్పుడు:ఫెబ్రవరి 09
అకాన్కాగో పర్వతం అధిరోహించిన బాలిక :

దక్షిణ అమెరికా లోని అతి పెద్ద పర్వతం అకాన్కాగో ను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు గా ముంబై బాలిక కామ్య కార్తికేయన్ (12) రికార్డు సృష్టించింది.ఆకన్కాగో అర్జంటినా లోని అండీస్ పర్వత శ్రేణిలో ఉంటుంది .6,962 మీటర్ల ఎట్టయినా ఈ పర్వతాని కామ్య ఫెబ్రవరి 01న అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేసింది.ఆమె నేవీ చిల్డ్రన్ స్కూల్ లో 7వ తరగతి విద్యార్థి 2019ఆగస్టు 24 కామ్య లద్దాక్ లోని 6,260 మీటర్ల ఎత్తుగల మెంతోక్ కాంగ్రి 2 అధిరోహించిది. అదే ప్రాంతంలోని 6,153 మీటర్ల స్తోక్ కాంగ్రి ను ఎక్కిన అతి పిన్న వయస్కురాలు కూడా కామ్యానే కావడం విశేషం.
క్విక్
రివ్యూ:
ఏమిటి: అకాన్కాగో పర్వతం అధిరోహించిన
బాలిక
ఎవరు: కామ్య కార్తికేయన్
ఎక్కడ:దక్షిణ అమెరికా
ఎప్పుడు:ఫెబ్రవరి 09
అండర్ -19 విజేత నిలిచిన బంగ్లాదేశ్ :

బంగ్లా దేశ్ చరిత్ర సృష్టించింది. చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకుంటూ మొదటి సారి ప్రపంచ కప్పుసాధించింది.డిఫెండింగ్ చాంపియన్ భారత్ ను ఓడిస్తూ అండర్ -19 ప్రపంచ కప్ ను చేజిక్కుంచుకుంది.ఫెబ్రవరి 09న జరిగిన పైనల్లో బంగ్లాదేశ్ డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 3వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది.మొదట బ్యాటింగ్ లో భారత యువ జట్టు పేలవ ప్రదర్శన చేసింది.బంగ్లా బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 47.2ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్ అయింది.ఒపెనర్ యశస్వి జైశ్వాల్ (88:121బంతుల్లో )టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చేదనలో బంగ్లాదేశ్ తడబడిన ఇమాన్ (47;79 బంతుల్లో )కెప్టెన్ అక్బర్ అలీ (43నాట్ అవుట్ )పోరాటంతో గట్టెక్కింది.సవరించిన లక్ష్యాన్ని (46 ఓవర్లలో 170)బంగ్లా 42.1 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి చేధించిది. 41 ఓవర్లలో బంగ్లాదేశ్ 163/7 తో ఉన్నపుడు వర్షం ఆటకు అంతరాయం కలిగించిది.స్పిన్నర్ రవి బిష్ణోయ్ (4/30)అద్బుతంగా బౌలింగ్ చేసి ఆశలు రేపినా భారత్ కు ఓటమి తాప్పలేదు .అక్బర్ అలికి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు” లబించింది.
క్విక్
రివ్యూ:
ఏమిటి: అండర్ -19 విజేత నిలిచిన బంగ్లాదేశ్
ఎవరు: బంగ్లాదేశ్
ఎప్పుడు:ఫెబ్రవరి 09
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
పిబిఎల్ లీగ్‌లో బెంగుళూర్ దే టైటిల్:

ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లో బెంగళూర్ రాఫ్తెర్స్ టైటిల్ నిలబెట్టుకుంది.డిఫెండింగ్ చంపియన్ గా అయిదో సీజన్ బరిలో దిగిన ఆ జట్టు విజేత గా నిలిచింది.ఆదివారం ఫైనల్లో బెంగళూర్ 4-2తేడాతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ పై గెలిచింది.పురుషుల సింగల్స్ లో సాయి ప్రనీత్ 14-15,15-9,15-3 తో లీ చీక్ పై గెలిచి బెంగళూర్ కు శుభారంబం అందించాడు.అయితే వారియర్స్ ట్రంప్ మ్యాచ్ గా ఎంచుకున్న పురుషుల డబుల్స్ లో బోడిన్ లీ యాంగ్ 15-11,13-15,15-14తో జార్జ్ సపుత్రో పై నెగ్గి 2-1 తో తమ జట్టు కుఆధిక్యాన్ని అందించింది.మహిళల సింగల్స్ లో టై జు యింగ్ 15-9,12-15,తో లీ పై గెలిచింది.దాంతో స్కోరు 2-2తో సమమైంది.బెంగళూర్ ట్రంప్ మ్యాచ్ గా ఎన్నుకున్న నిర్ణయాత్మక మిక్సేడ్ డబుల్స్ పోరులో పెన్గ్ వాన్ 15-14,14-15.15-12తో కృష్ణ ప్రసాద్ కిం పై పైచేయి సాధించి జట్టుకు విజయతీరాలకు చేర్చింది.
క్విక్
రివ్యూ:
ఏమిటి: పిబిఎల్ లీగ్‌లో
బెంగుళూర్ దే టైటిల్
ఎవరు: బెంగళూర్ టీం
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు:ఫెబ్రవరి 09
బోడో శాంతి ఒప్పంద ఉత్సవాల్లో ప్రదాని నరేంద్ర మోడి :

అస్సాం లో ని కొక్రాజర్ లో జరుపుతున్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాల్లో ప్రదాని నరేంద్ర మోడి ఫెబ్రవరి 07 న పాల్గొన్నారు .ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రదాని నరేంద్ర మోడి గారు మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల శాంతి అబివ్ర్ద్ది కోసం కలిసి పనిచేయవలసిన సమయం ఆసన్నమైంది.బోడో ఒప్పందం ద్వారా శాంతి అహింసా విజయం సాధించాయని అది ప్రజల వల్లే సాద్యమైనదని పేర్కొన్న్నారు.బోడో శాంతి ఒప్పందమ 21వ శతాబ్దంలో అస్సాంతో సహా మొత్తం ఈశాన్య ప్రాంతానికే ఒక నూతన ప్రారంబం అని ప్రదాని మోడి గారు పేర్కొన్నారు.బోడో లాండ్ ప్రజలకు ప్రత్యెక రాజకీయ ఆర్ధిక హక్కులను కల్పించే త్రైపాక్షిక ఒప్పందం పై కేంద్ర ప్రబుత్వం అస్సాం రాష్ట్ర ప్రబుత్వం బోడో ఉద్యమ సంస్థలు 2020 జనవరి 27 సంతకాలు చేసారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బోడో శాంతి ఒప్పంద ఉత్సవాల్లో ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ:కోక్రజర్,అస్సాం
ఎప్పుడు:ఫెబ్రవరి 09