
Daily Current Affairs in Telugu 09-01-2020
హర గోవింద్ ఖురానా కు పాక్ లో అరుదైన గౌరవం :

ప్రఖ్యాత భారత అమెరికన్ శాస్త్రవేత్త హర గోవింద్ ఖురానా కు పాకిస్తాన్ లో అరుదైన గౌరవం దక్కనుంది.ఆయన పేరిట ప్రత్యెక పరిశోదన విభాగాన్ని (రీసెర్చ్ చైర్) ఏర్పాటు చేయనున్నట్లు లాహోర్ లోని గవర్నమెంట్ కాలేజ్ యునివేర్సిటి (జీసియు) జనవరి 09న ప్రకటించింది.ఖురానా1922 అవిభక్త భారత్ లోని రాయ్ పూర్ లోని గ్రామం (ప్రస్తుతం పాక్ లోఉంది)లో జన్మించారు.1968 వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హర గోవింద్ ఖురానా కు పాక్ లోఅరుదైన గౌరవం :
ఎవరు: హర గోవింద్ ఖురానా
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు:జనవరి 09
నాలుగు దేశాల అండర్ -19టోర్నీ విజేత భారత్ :

నాలుగు దేశాల అండర్ -19 వన్డే టోర్నీలో భారత కుర్రాళ్ళ జట్టు చాంపియన్ గా నిలిచింది.జనవరి 09 పైనల్లో భారత్ అండర్ -19 జట్టు 69పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అండర్ -19 ప గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 259 పరుగులు చేస్సింది.ఫ్రువ్ జురెల్ (101) శతకానికి తోడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (70) అర్థ సంచరీతో సత్తా చాటిన జట్టుకు మంచి స్కోరు అందించారు.13 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ద్రువ్ ,తిలక్ ఆదుకున్నారు.నాలుగో వికెట్కు 164 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ప్రత్యర్హ్తి బౌలర్లలో గెరాల్డ్ (3/19) మూడు వికెట్లు తీశాడు.అనంతరం లక్ష్య చెదనలో దక్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది.భారత్ ,దక్షిణాఫ్రికా,తో పాటు న్యూజిలాండ్ ,జిమ్బంబ్వే జట్లు తలపడ్డ ఈ సిరీస్లో నిలకడగా రాణించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాలుగు దేశాల అండర్ -19టోర్నీ విజేత భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: డర్బన్
ఎప్పుడు: జనవరి 09
జనవరి 10నుండి ఖెలో ఇండియా క్రీడలు ప్రారంబం :

దేశంలో అతి పెద్ద క్రీడా సంబరాలకు వేళైంది .ఖెలో ఇండియా యూత్ క్రీడల మూడో సీజన్ జనవరి 10 నుండి ప్రారంబమవ్వనుంది. ఇందిరా గాంధి స్టేడియంలో ఆరంబోత్సవంలో వేడుక జరగనుంది.13 రోజుల పాటు జరిగే జరిగే ఈ ఆటల పండుగకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అత్లేట్ల బరిలో దిగనున్నారు.దేశంలోని క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు యవ ఆటగాల్ల నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చేందుకు 2018లో ఖెలో ఇండియా క్రీడలకు శ్రీకారం చుట్టారు.అండర్ -17,అండర్ -21 విభాగాల్లో పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రీడల్లో అధ్బుత ప్రదర్శన కనబరిచిన అత్లేట్లను భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) అండగా నిలుస్తోంది.ఉపకార వేతనంతో పాటు దేశ వ్యాప్తంగా సాయ్ కేంద్రాల్లో వాళ్ళకు శిక్షణ కల్పిస్తోంది.2018 హరియాణ ఈ క్రీడలలో ఓవరాల్ చాంపియన్ నిలవగా గతేడాది మహారాష్ట్ర ఆ పీటాన్ని అధిరోహించింది.ఇందులో సైక్లింగ్.లాన్ బౌల్స్ క్రీడలను తొలిసారి ప్రవేశపెడుతున్దడంతో మొత్తం క్రీడాంశాల సంఖ్య 20కు చేరింది.35జట్ల నుంచి సుమారు 6500 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జనవరి 10నుండి ఖెలో ఇండియా క్రీడలు ప్రారంబం
ఎక్కడ:గుహవతి
ఎప్పుడు: జనవరి 09
న్యాయవాదుల ప్రపంచ కప్ రన్నర్అప్ గా భారత్ :

న్యాయవాదుల క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ జట్టు రన్నర్ అప్ గా నిలిచింది.న్యూజిలాండ్ లో ముగిసిన ఈ కప్ పైనల్లో భారత్ జట్టు 24 పరుగుల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడింది.జనవరి 09 మొదట పాక్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. చెదనతో పాక్ బౌలరల్తో ధాటికి భారత్ 169పరుగులకే ఆలౌటైంది.లీగ్ దశలో పాకిస్తాన్ తో పాటు ఆస్ట్రేలియా,వెస్టిండీస్,బంగ్లాదేశ్ లను భారత్ ఓడించింది.రన్నర్ అప్ నిలిచిన భారత జట్టులో ఆంద్ర ప్రదేశ్ ,తెలంగాణ కు చెందిన న్యాయవాదులు ఉన్నారు .అల్లంకి రమేష్ ,సురేష్ కుమార్ ,క్రాంతి ,ప్రభాకర్ ,లు ఇతరులు పాల్గొనారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : న్యాయవాదుల ప్రపంచ కప్ రన్నర్అప్ గా భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు:జనవరి 09
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
వెయిట్ లిఫ్తర్ సరబ్ జిత్ పై నాలుగేళ్ల నిషేధం :

భారత్ మహిళా వెయిట్ లిఫ్టర్ సరబ్ జిత్ కౌర్ (71కేజీలు )పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేల్ల నిషేధం విధించింది.ఆమె నిషిద్ద ఉత్ప్రేరకాలు తీసుకున్న పరీక్షలో తేలడంతో జనవరి 08న ఈ నిర్ణయం తీసుకుంది.విశాఖ పట్నంలో జరిగిన మహిళల సీనియర్ జాతీయ వియిట్ లిఫ్టింగ్ చాంపియన్ సందర్భంగా ఆమె నుంచి రక్త ముత్ర నమునాల్ని సేకరించి పరీక్షించారు.ఇందులో నిషేధిత ఉత్ప్రేరకాలను సరబ్ జిత్ తీసుకున్నట్లు తేలింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెయిట్ లిఫ్తర్ సరబ్ జిత్ పై నాలుగేళ్ల నిషేధం
ఎవరు: సరబ్ జిత్ కౌర్
ఎప్పుడు:జనవరి 09
శాంతికి భారత్ కృషి చేయాలి :ఇరాన్

ఇరాన్ అమెరికాకు మద్య నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు భారత్ తిసుకేనే ఎలాంటి శాంతి చర్యల పైన ఇరాన్ స్వాగతిస్తుందని భారత్లోని ఆదేశ రాయబారి అలీచేగేనే పేర్కొన్నారు.ఇరాన్ అమెరికామద్య ఉద్రిక్తలను మరింత పెరగ బోవని ఆశిస్తున్నాని వ్యఖ్యానించారు. సులేమానికి నివలులర్పించేదుకు ఇరాన్ ఏమ్బసిలో జనవరి 09 ఏర్పాటు చేసిన ఒక కార్య క్రమలో చేగేని ఈ మేరకు మాట్లాడారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శాంతికి భారత్ కృషి చేయాలి :ఇరాన్
ఎవరు: భారత్
ఎక్కడ: ఇరాన్
ఎప్పుడు: జనవరి 09