
Daily Current Affairs in Telugu 08-07-2021
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సియివో మను సాహ్ని పదవికి రాజీనామా :

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి మను సాహ్నీ జులై 08 న తన పదవికి రాజీనామా చేశాడు. సహచరులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడన్న కారణంగా మార్చిలో సాహ్నీని సెలవుపై పంపిన ఐసీసి. అతడిపై విచారణ ఆరంభించింది. ఈ నేపథ్యంలో సాహ్నీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ముఖ్య కార్యనిర్వహణ అధికారి మను సాహ్నీ వెంటనే ఐసీసీ నుంచి వెళ్లిపోతాడు. జెఫ్ అలార్డీస్ తాత్కా లిక సీఈఓగా కొనసాగుతాడు” అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 2019 ఐసీసీ ప్రపంచకప్ అనంతరం డేవ్ రిచర్డ్సన్ నుంచి సాహ్నీ ఐసీసీ సీఈ వోగా బాధ్యతలు అందుకున్నాడు. 2022 వరకు అతడి పదవీకాలం ఉంది. వివిధ విధానపరమైన నిర్ణయాల విషయంలో పెద్ద బోర్డులతో అతడికి విభేదాలున్నాయి. నిరంకుశంగా వ్యవహరిస్తాడన్నది సాహ్నీపై ఆరోపణ కూడా ఉంది..
- ఐసిసి ప్రధాన కార్యలయం :దుబాయ్
- ఐసిసి అద్యక్షుడు :గ్రెగ్ బార్క్లే
- ఐసిసి స్థాపన :15 జూన్ 1909
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సియివో మను సాహ్ని పదవికి రాజీనామా
ఎవరు: మను సాహ్ని
ఎప్పుడు: జులై 08
భారత ఆర్థికవేత్త కౌశిక్ బసు దక్కిన హంబోల్ట్ రీసెర్చ్ అవార్డు :

భారత ఆర్థికవేత్త కౌశిక్ బసుకు ఆర్థిక శాస్త్రానికి హంబోల్ట్ రీసెర్చ్ అవార్డు లభించింది. ఈ అవార్డును జర్మనీలోని హాంబర్గ్‌లోని బుసెరియస్ లా స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ హన్స్-బెర్న్డ్ షెఫర్ ఆయనకు ప్రదానం చేశారు. ప్రపంచ బ్యాంకు మాజీ చీఫ్ ఎకనామిస్ట్, బసు ప్రస్తుతం కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు. అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఫౌండేషన్ జులై 06 న భారత ఆర్థికవేత్త కౌశిక్ బసుకు హంబోల్ట్ రీసెర్చ్ అవార్డును ప్రదానం చేసింది. కౌశిక్ బసు మూడేళ్లపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. హంబోల్ట్ రీసెర్చ్ అవార్డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను, ఆర్థికవేత్తలను సత్కరిస్తుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత ఆర్థికవేత్త కౌశిక్ బసు దక్కిన హంబోల్ట్ రీసెర్చ్ అవార్డు
ఎవరు: కౌశిక్ బసు
ఎప్పుడు: జులై 08
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి వీరేంద్ర సింగ్ కన్నుమూత :

హిమాచల్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, కాంగ్రెస్ సినీయర్ నేత వీరభద్ర సింగ్ (87) తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న వీరభద్ర సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆసుప త్రిలో చేరి కోలుకున్నాక అదేనెల 30న ఇంటికి వెళ్ళారు. అయితే గుండె, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో శిమ్లాలోని ఇందిరా గాంధీ వైద్య కళాశాల ఆసుపత్రి (ఐజీఎంసీ)లో అక్కడ చికిత్స పొందుతుండగానే రెండోసారి పాజిటివ్ గా తేలింది. కాగా గుండెపోటుతో పరిస్థితి మరింత విషమించి కన్ను మూసారు.. వీరభద్ర సింగ్ గారు 9 సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచే శారు. కాగా కేంద్రంలో పర్యాటకం, పౌర విమానయానం,పరిశ్రమలు తదితర శాఖలకు సహాయ మంత్రిగానూ పనిచేశారు.
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని : సిమ్లా (వేసవి రాజదాని) ధర్మ శాల (శీతాకాల రాజదాని )
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి : జైరాం టాకూర్
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : రాజేంద్రన్ విశ్వనాధన్ అర్గేకర్
క్విక్ రివ్యు :
ఏమిటి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి వీరేంద్ర సింగ్ కన్నుమూత
ఎవరు: వీరేంద్ర సింగ్
ఎక్కడ : హిమాచల్ ప్రదేశ్
ఎప్పుడు: జులై 08
.
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |