
Daily Current Affairs in Telugu 08-04-2021
భారత సెయిలింగ్ లో ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి మహిళ గా నేత్ర కుమనన్ :

భారత సెయిలింగ్ క్రీడాకా రులు చరిత్ర సృష్టించారు. అత్యధి కంగా నలుగురు భారత సెయిలర్లు టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధిం చారు. ఒమన్లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్ లో ఏప్రిల్ 08 న విష్ణు శరవణన్ (లేజర్ స్టాండర్డ్ క్లాస్), గణపతి చెంగప్ప- వరుణ్ రక్కర్ (49ఇఆర్ క్లాస్)లు సత్తా చాటి టోక్యో బెర్తులు సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 07 నేత్ర కుమనన్ (లేజర్ రేడియల్) ఒలింపి కకు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ సెయిలింగ్ లో మూడు ఈవెంట్లలో భారత్ బరిలో దిగుతుండటం ఇదే తొలిసారి ఇప్పటి వరకు ఒలింపిక్స్లో భారత్ తరపున 9 మంది పాల్గొనగా.. కేవలం ఒకేఒక్క ఈవెంట్లో బరిలో దిగారు. నాలుగు సార్లు ఇద్దరేసి క్రీడాకారులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి:భారత సెయిలింగ్ లో ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి మహిళ గా నేత్ర కుమనన్
ఎవరు:నేత్ర కుమనన్
ఎప్పుడు : ఏప్రిల్ 08
2021ఒలింపిక్స్ లో నుండి తప్పుకున్న్తట్లు ప్రకటించిన ఉత్తర కొరియా :

2021 జూలై, ఆగస్టు నెలల్లో జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడల్లో తమ దేశం పాల్గొనబోవడం లేదని ఉత్తర కొరియా క్రీడా మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 6న ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి తమ దేశ క్రీడాకారులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్ 2020 జూలై, ఆగస్టులలో . జరగాల్సింది. అయితే కరోనా వైరస్ ఈ మెగా క్రీడలను జూలై, ఆగస్టుకు వాయిదా వేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి:2021ఒలింపిక్స్ లో నుండి తప్పుకున్న్తట్లు ప్రకటించిన ఉత్తర కొరియా
ఎవరు:ఉత్తర కొరియా
ఎప్పుడు : ఏప్రిల్ 08
ఎక్కడ:ఉత్తర కొరియా
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశంగా నిలిచిన అమెరికా :

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశంగా అమెరికా నిలిచింది . అమెరికా తర్వాత చైనా రెండో స్థానంలో, భారత్,మూడో స్థానంలో ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏప్రిల్ 7న విడుదల చేసిన 35వ వార్షిక బిలియనీర్ల జాబితా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.తాజా నివేదిక ప్రకారం… అమెరికాలో 724 మంది, చైనాలో 698 మంది, భారత్ లో 140 మంది బిలియనీర్లు ఉన్నారు. జర్మనీ (136), రష్యా (117) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బిలియనీర్స్ జాబితాలో సంపన్నుల సంఖ్య 660 పెరిగి 2,755కి చేరింది ప్రస్తుత వీరి సంపద విలువ 13.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
- అమెజాన్ వ్యవస్థాపక సీఈవో జెఫ్ బెజోస్ వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద 177 బిలియన్ డాలర్లకు చేరింది
- ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 151 బిలియన్ డాలర్ల సంపదతో (బిలియన్ డాలర్ల వృద్ధి) రెండో స్థానంలో ఉన్నారు.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానం దక్కించుకున్నారు. 84.5 బిలియన్ డాలర్ల సంపదతో టాప్ 10 అంతర్జాతీయ బిలియనీర్స్ జాబితాలో మరోసారి పదో స్థానం దక్కించుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి:ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశంగా నిలిచిన అమెరికా
ఎవరు: అమెరికా
ఎప్పుడు :ఏప్రిల్ 08
ఇండియన్ వరల్డ్ రికార్డ్ లో నిలిచిన భారత్ కు చెందిన అతి పిన్న వయస్కురాలు సోలిహా షబ్బీర్ :

శ్రీనగర్లోని దాల్గేట్ కు చెందిన సోలిపో షబీర్ తన పేరును “ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్” లో నిలిచిన జమ్మూకాశ్మీర్ లోని అతి పిన్న వయస్కురాలు గా అవతరించింది. ఈమె మొదటి రచయితగా “హబ్బా ఖటూన్స్ కవితల జీవితాన్ని పునర్నిర్మించిన” పేరుగా చేర్చారు .హబ్బా ఖటూన్ కవితల జీవితాలను పునరుద్దరించిన పేరుగా దీనిని చేర్చారు. ఈ 22 ఏళ్ల షబీర్ ఇప్పటివరకు ‘In the lawn of dark’, ‘Obsolete- The poem పుస్తకం, ‘Zoon — The heart of Habba Khatoon’ 5 అనే పుస్తకాలు రాశారు. ఆమె 15 సంవత్సరాల వయస్సు నుండి రాయడం ప్రారంభించిందని తన తొమ్మిదవ తరగతిలో, తన గురువుకు సహాయంతో తన మొదటికవితను విజయవంతంగా రాశానని చెప్పారు .
క్విక్ రివ్యు :
ఏమిటి:ఇండియన్ వరల్డ్ రికార్డ్ లో నిలిచిన భారత్ కు చెందిన అతి పిన్న వయస్కురాలు సోలిహా షబ్బీర్
ఎవరు: సోలిహా షబ్బీర్
ఎక్కడ: జమ్మూకాశ్మీర్
ఎప్పుడు : ఏప్రిల్ 08
ఒఎన్‌జిసి సంస్థ డైరెక్టర్ గా భాద్యతలు చేపట్టిన సుభాష్ కుమార్ :

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) డైరెక్టర్ (ఫైనాన్స్) సుభాష్ కుమార్ ఇటీవల చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయంపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ 2021 మార్చి 30 న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సిఎండి శశి శంకర్ పర్యవేక్షణపై కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఎక్స్ప్లోరేషన్ & ప్రొడక్షన్ (ఇ అండ్ పి) చైన్ వ్యాల్యుస్ అంతటా విభిన్న కార్యకలాపాలలో ఆయనకు 36 సంవత్సరాల అనుభవం ఉంది. అతను 1985 లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ఒఎన్‌జిసిలో చేరాడు మరియు వివిధ హోదాల్లో పనిచేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి:ఒఎన్‌జిసి సంస్థ డైరెక్టర్ గా భాద్యతలు చేపట్టిన సుభాష్ కుమార్
ఎవరు: సుభాష్ కుమార్
ఎప్పుడు :ఏప్రిల్ 08
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |