
Daily Current Affairs in Telugu 08-01-2020
మార్చిలో తెలంగాణా లో వింగ్స్ ఇండియా -2020 సదస్సు:

కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ వైమానిక సదస్సు విహంగ భారత్ (వింగ్స్ ఇండియా) -2020కి తెలంగాణ ఆథిత్యం ఇవ్వనుంది..వచ్చ్చే మార్చి 12నుండి 15వరకు బేగంపేట విమానాశ్రయంలో దీనిని నిర్వహించనున్నారు.జనవరి 09న దీనిపై డిల్లోలో కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అద్యక్షతన సన్నాహక సమావేశం జరగనుంది.ఇందులో పాల్గొనాలని తెలంగాణ పరిశ్రమలు,ఐటి,పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ కేంద్ర మంత్రి ఆహ్వానించారు.సదస్సులో నిర్వహణలో తెలంగాణ ప్రబుత్వం భాగస్వామిగా ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: మార్చిలో తెలంగాణా లో వింగ్స్ ఇండియా -2020 సదస్సు
ఎక్కడ: తెలంగాణా
ఎవరు; కేంద్ర పౌర విమానయాన శాఖ
ఎప్పుడు: జనవరి 08
హైదరాబాద్ లో ఆఫ్గనిస్తాన్ దౌత్య కార్యాలయం ప్రారంబం:

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ దౌత్య కార్యాలయాన్ని హైదరాబాద్ లో జూబ్లి హిల్స్ రోడ్డు నంబరు 46లో జనవరి 08న ఆదేశ ఉప విదేశాంగ మంత్రి సహీద్ ఏసర్ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమ్మూద్ ఆలితో కలిసి ప్రారంబించారు. భారత్ –ఆఫ్గనిస్తాన్ దేశాల మద్య బలమైన సంబందాలకు వ్యాపరాబివ్రుద్ది కి కార్యాలయం ఏర్పాటు తోడ్పడుతుందని సహీద్ పేర్కొన్నారు.మంత్రి మహమ్మూద్ అలీ మాట్లాడుతు వ్యాపారం,విద్య,వైద్యం పరంగా రెండు దేశాల మద్య సత్సంబంధాల పెరిగేందుకు కార్యాలయం ఏర్పాటు దోహదం చేసిందని ఆన్నారు. కార్యక్రమంలో ఆఫ్గనిస్తాన్ ప్రతినిధులు మియహాన్ సయ్యది ,సిద్దిఖి ,హస్సాని ,డిల్లోలోని దౌత్య కార్యాలయ ప్రతినిధి తాహిర్ ఖాద్రి,హైదరాబాద్ లోని దౌత్య కార్యాలయ కాన్సుల్ జనరల్ సయ్యద్ మొహమ్మద్ ఇబ్రహీం కిల్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: హైదరాబాద్ లో ఆఫ్గైస్తాన్ దౌత్య కార్యాలయం ప్రారంబం:
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: జనవరి 08
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఐఐసి ర్యాంకింగ్ టెస్టుల్లోను అగ్రస్థానంలో కోహ్లి :

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (ఐసిసి) టెస్టు బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.అతను 928 పాయింట్లతో ముందుండగా 911 పాయింట్లతో స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.పూజార ఓ స్థానం కోల్పోయి ఆరో స్థానంలో నిలిచాడు రహానే రెండు ర్యాంకులు నష్టపోయి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.సూపెర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మార్నాస్ లబుశేన్ కెరీర్ లోనే అత్యుత్తమంగా మూడో ర్యాంకు సాధించాడు.బౌలర్ల ర్యాంకింగ్‌లో బూమ్ర ఆరో స్థానంలో నిలిచాడు.అశ్విన్ 9వ ,షమి 10వ స్థానంలో ఉన్నారు.ప్యాట్స్ కమిన్స్ అగ్ర స్థానంలో కొనసాగుహున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: టెస్టుల్లోను అగ్రస్థానంలో కోహ్లి :
ఎవరు; విరాట్ కోహ్లి
ఎప్పుడు: జనవరి 08
డీఎఫ్ఆర్ ఎల్ లో వ్యోమగాములకు ఆహారం:

ఇస్రో 2020ఏడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్ యాన్ ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు కోసం మైసూర్ కు చెందిన డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ ల్యాబరేటరీ (డీఎఫ్ఆర్ఎల్ ) పలు రకాల ఆహార పదార్థాలు సిద్దం చేయనుంది ఇస్రో, కేంద్ర ప్రబుత్వ ఆదేశాల మేరకు ఈ వంటకాలు తాయారు చేయనుంది ఇడ్లి సాంబార్ ,ఎగ్ రోల్స్ ,వెజ్ రొల్స్ ,వెజ్ పులావ్ తో పాటు మాంసాహరాన్ని వండి పెట్టనుంది.32ఆహార పదార్థాల జాబితాను ఇస్రోకు పంపించింది.ఈ ఆహారాన్ని కొన్ని నెలల పాటు పాడవకుండా,తాజా గా,పోషకాలతో ఉంటాయని డీఎఫ్ఆర్ ఎల్ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: డీఎఫ్ఆర్ ఎల్ లో వ్యోమగాములకు ఆహారం
ఎవరు; ఇస్రో
ఎప్పుడు: జనవరి 08
ఇరాక్ లోని అమెరికాబలగాలపై ఇరాన్ ప్రతీకార దాడి :

పశ్చిమాసియాలో రాజుకున్న అగ్గి యుద్ద రూపమే దాల్చేలా ఉంది తం దేశ అగ్ర సైనిదికారి అయిన మేజర జనరల్ సులేమాని హత్యపై ప్రతీకారేచ్చ తో రగిలిపోతున్న ఇరాన్ ,ఇరాక్ లో ఆమెరికా సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది.రెండు సైనిక స్థావరాలపై 22బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.ఈ దాడిలో కనీసం 80మది అమెరికా సైనికులు మరణించారని ఇరాన్ అధికార వార్తా సంస్థలలు తెలిపాయి.మృతి చెందిన వారిని అమెరిక ఉగ్రవాద సైనికులు గా పేర్కొన్నాయి.దాడి చోటుచేసుకున్న రెండు స్తావరల్లోను అమెరికా సైనిక సిబ్బంది ,సంకీర్ణ దళ బలగాలు ఉన్నాయి.తాజా దాడి ని అమెరికాకు చెంప దెబ్బగా పరిగణించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఇరాన్‌లోని అమెరికాబలగాలపై ఇరాన్ ప్రతీకార దాడి
ఎక్కడ: ఇరాక్
ఎవరు; ఇరాన్
ఎప్పుడు: జనవరి 08