Daily Current Affairs in Telugu 07-09-2020

Daily Current Affairs in Telugu 07-09-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

కాళోజి నారాయణరావు అవార్డుకు ఎంపిక అయిన రమా చంద్ర మౌళి :

ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు అవార్డుకు వరంగల్ జిల్లాకు చెందిన కవి, కథార చయిత రమా చంద్రమౌలి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈయన వరంగల్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా కూడా  పనిచేసి పదవీ విరమణ చేసారు.  రమా చంద్రమౌళి గారు దీపశిఖ, స్మృతిధార, అంతర్గానం, అంతర అసంపూర్ణ సహా పలు రచనలు చేశారు ఆయన రాసిన నవల  కాల నాళిక అనే నవల తెలంగాణ ఉద్యమ పరిణామాన్ని ఆవిష్కరించింది దీనికి గాను ఈ అవార్డు ప్రకటించిన విషయం ప్రభుత్వం సెప్టెంబర్ 07న ఓ ప్రకటనలో పేర్కొంది .

క్విక్ రివ్యు :

ఏమిటి: కాళోజి నారాయణరావు అవార్డుకు ఎంపిక అయిన రమా చంద్ర మౌళి

ఎవరు: రమా చంద్ర మౌళి

ఎక్కడ:తెలంగాణా

ఎప్పుడు: సెప్టెంబర్ 07

ఎఫ్.డిఐ ల రాకలో తెలంగాణ కు దక్కిన ఎనిమిదో స్థానం :

దేశంలో 2018-20 సంవత్సరం చివరి ఆరు నెలల్లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎస్.డి)లలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ 10వ స్థానంలో నిలిచాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డిపార్ట్ మెంట్ పర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గణాంకాల ప్రకారం ఈ ఆరునెలల కాలంలో దేశంలో రూ.1,71,55,877 కోట్ల (23,88134 డాలర్లు ) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇందులో తెలంగాణకు రూ 4,86519 కోట్లు , ఆంధ్రప్రదేశ్ రూ.1475,99 కోట్లు దక్కాయి. దేశంలోకి  వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో తెల౦ గాణ వాటా 2 84% కాగా, ఆంధ్రప్రదేశ్ కు 1.86 దక్కాయి. అత్యధికంగా  30.35 శాతం పెట్టుబడులు మహారాష్ట్రకు వెళ్లాయి. తర్వాతి స్థానాల్లో కర్ణాటక ( 17.92 %) డిల్లి  (16.6%). గుజరార్ – (11.05%) ఝార్ఖండ్ (7.1%)తమిళనాడు (4.21%) హరి యాజ (303%) ఉన్నాయి

క్విక్ రివ్యు :

ఏమిటి: ఎఫ్.డిఐ ల రాకలో తెలంగాణ కు దక్కిన ఎనిమిదో స్థానం

ఎవరు: తెలంగాణ

ఎక్కడ:న్యుడిల్లి’

ఎప్పుడు: సెప్టెంబర్ 07

సుప్రీం న్యాయ సేవల కమిటీ అధ్యక్షునిగా జస్టిస్ నారి మన్  నియామకం :

 భారత అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్టు  న్యాయ సేవల కమిటీకి  అధ్యక్షునిగా  సర్వోన్నత న్యాయ స్థాన న్యాయ మూర్తి అయిన  జస్టిస్ ఆర్ .ఎఫ్ నారి మన్  గారు నియమితులయ్యారు.గత నవంబర్  నుంచి ఈ పదవిలో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రా ఇటీవల పదవి విరమణ చేయడంతో ఈ నియామకాన్ని చేపట్టారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: సుప్రీం న్యాయ సేవల కమిటీ అధ్యక్షునిగా జస్టిస్ నారి మన్  నియామకం

ఎవరు: జస్టిస్ నారిమన్ 

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: సెప్టెంబర్ 07

2019 కి గాను  దక్కిన ఇందిరాగాంధీ శాంతి బహుమతి స్వీకరించిన డేవిడ్ ఎటెన్ బరో  :

బ్రిటిష్ ప్రసారకుడు డేవిడ్ ఎటెరోకు 2019 సంవత్సరానికి గాను దక్కిన ఇందిరాగాంధీ శాంతి బహుమతిని సెప్టెంబర్ 07 నప్రదానం చేశారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనకు ఈ పుర స్కారం అందించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణలో డేవిడ్ 50 ఏళ్ల నుంచి అంది స్తున్న సేవల్ని కొనియాడారు. ప్రకృతి గురించి మానవాళికి తెలియజెప్పడానికి అద్భుతమైన చిత్రాలు, పుస్తకాల ద్వారా ఆయన విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ ఇందిరా గాంధీ శాంతి బహుమతి కింద ఏటా  ఒకరికి రూ 25 లక్షల నగదు పురస్కారం అందిస్తుంటారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: 2019 కి గాను  దక్కిన ఇందిరాగాంధీ శాంతి బహుమతి స్వీకరించిన డేవిడ్ ఎటెన్ బరో 

ఎవరు: డేవిడ్ ఎటెన్ బరో 

ఎక్కడ:న్యుడిల్లి

ఎప్పుడు: సెప్టెంబర్ 07

సియామ్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయిన కెనిచి ఆయుకావా :

మారుతి సుజుకి ఎండి మరియు సియివో అయిన కెనిచి ఆయుకావా రెండేళ్ల కాలానికి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల  సంస్థ (సియామ్) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన స్థానంలో రాజన్ వాధేరా గారిని నియమి౦చనున్నారు. సియోమ్ నూతన ఉపాధ్యక్షుడిగా అశోక్ లేలాండ్ ఎండి మరియు సిఇఒ విపిన్ సోంధి గారు ఎన్నికయ్యారు. సియామ్ అనేది  భారత ఆటోమోటివ్ పరిశ్రమ యొక్క  ఒక అత్యున్నత సంస్థ.

క్విక్ రివ్యు :

ఏమిటి సియామ్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయిన కెనిచి ఆయుకావా

ఎవరు: కెనిచి ఆయుకావా

  ఎప్పుడు: సెప్టెంబర్ 07

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *