
Daily Current Affairs in Telugu 06&07-07-2021
వన్డే మహిళా ర్యాంకింగ్ లో నంబర్ వన్ స్థానం లో నిలిచిన మిథాలి రాజ్ :

భారత కెప్టెన్ మిథాలీరాజ్ వన్డేల్లో తిరిగి నంబర్ వన్ ర్యాంకును చేజిక్కిం చుకుంది. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో వరుసగా మూడు అర్ధసెంచరీలు చేసిన మిథాలి. ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకుంది. ఇంగ్లాండ్ తో సిరీస్ తొలి రెండు వన్డేల్లో 72, 59 పరుగులు చేసిన మిథాలి.. చివరి వన్డేలో అజేయంగా 75 పరుగులు సాధించింది. తొలి సారిగా 2005లో నంబర్ వన్ అయిన మిధాలి. చివరిగా 2018 ఫిబ్రవరిలో అగ్రస్థానంలో ఉంది. భారత యువ ఓపెనర్ షెఫాలీవర్మ 49 స్థానాలు మెరుగై 71వ ర్యాంకుకు చేరుకుంది. బౌలర్లలో దీప్తిశర్మ 12వ ర్యాంకులో నిలిచింది. ఇంగ్లాండ్ చివరి వన్డేలో ఆమె 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: వన్డే మహిళా ర్యాంకింగ్ లో నంబర్ వన్ స్థానం లో నిలిచిన మిథాలి రాజ్ :
ఎవరు: మిథాలి రాజ్
ఎప్పుడు: జులై 07
1000 వ ఫస్ట్ క్లాస్ వికెట్ టేకర్ లిస్టులో చేరిన జేమ్స్ అండర్సన్ :

వెటరన్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1000 వికెట్లు పూర్తి చేయడంతో తన టోపీకి మరో ఘనత ను జోడించాడు. మాంచెస్టర్‌లో కెంట్‌తో జరిగిన లాంక్షైర్ కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ లో అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో పేసర్లలో అండర్సన్ 1000 వికెట్ లు సాధించిన ప్రముఖ వ్యక్తి.. ఈ శతాబ్దంలో 1,000 ఫస్ట్-క్లాస్ వికెట్లు సాధించిన 14 వ ఆటగాడు అండర్సన్ మరియు పేసర్లలో ఐదవ వ్యక్తి గా నిలిచారు. . ఆండెర్సన్ ముందు 1000 వికెట్ల మైలురాయిని దాటిన ఇతర పేస్ బౌలర్లు ఆండీ కాడిక్, మార్టిన్ బిక్నెల్, డెవాన్ మాల్కం మరియు వసీం అక్రమ్ వంటి వారు ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 1000 వ ఫస్ట్ క్లాస్ వికెట్ టేకర్ లో చేరిన జేమ్స్ అండర్సన్
ఎవరు: జేమ్స్ అండర్సన్
ఎప్పుడు: జులై 06
ఐసీఏబీఆర్ కార్యనిర్వాహక బోర్డు సబ్యుడిగా తెలుగు శాస్త్రవేత్తఎంపిక :

ప్రతిష్టాత్మక ఐసీఏబీఆర్ (ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆన్ అప్లైడ్ బయో ఎకానమీ రీసెర్చి) కార్యనిర్వాహక బోర్డు సభ్యుడిగా ఆర్థిక వ్యవ సాయ శాస్త్రవేత్త డాక్టరు నూతలపాటి చంద్రశేఖరరావు ఎంపికయ్యారు. జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన ఇటలీలోని రావెల్లో కేంద్రంగా జరిగిన సదస్సులో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రపంచంలోని వివిధ విశ్వ.విద్యాలయాల భాగస్వామ్యంతో పాటు పలు దేశాలకు చెందిన నిపుణులను కార్యవర్గంలోకి తీసుకుంటారు.1998లో ఏర్పాటైన ఈ సంఘం బయో ఎకానమీ, వ్యవసాయ బయో టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి, బయో ఆధారిత ఎకానమీ రీసెర్చి తదితర అంశాలపై దృష్టి పెడుతుంది. దీనికి సభ్యునిగా ఎంపికైన చంద్రశేఖరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. బాపట్ల వ్యవ సాయ కళాశాలలో ఆయన డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల పాటు వ్యవసాయశాఖలో సేవలందించారు. సెస్ నుంచి పీహెచ్ చేశారు. హైదరాబాద్ లోని ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రంలో ఫ్యాకల్టీ మెంబర్ గా పదేళ్ల పాటు వ్యవహరించారు. ప్రస్తుతం దిల్లీలోని జాతీయ ఆర్థికాభివృద్ధి సంస్థలో ఆచార్యునిగా పనిచేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనా మిక్ గ్రోత్, దిల్లీ సంస్థలో పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసీఏబీఆర్ కార్యనిర్వాహక బోర్డు సబ్యుడిగా తెలుగు శాస్త్రవేత్తఎంపిక
ఎవరు: నూతలపాటి చంద్రశేఖరరావు
ఎప్పుడు: జులై 06
ఎనిమిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ లను నియమించిన కేంద్ర ప్రభుత్వం :

కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది.ఇందులో నలుగురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయగా మరో నలుగురిని కొత్తగా అవకాశం కల్పించింది.విశాఖపట్నం మాజీ ఎంపి బాజాపా సీనియర్ నేత కుంబం పాటి హరిబాబులను మిజోరం రాష్ట్ర గవర్నర్ గా నియమించింది
- కర్ణాటక రాష్ట్రం – థావర్ చంద్ గెహ్లాట్
- హర్యానా – బందరు దత్తారు త్రేయ
- మిజోరం – కుంబం పాటి హరిబాబు
- మధ్యప్రదేశ్ – ముంగు భాయ్ చగాన్ భాయ్ పటేల్
- హిమాచల్ ప్రదేశ్ – రాజేంద్రన్ విశ్వనాధన్ అర్గేకర్
- ఝార్ఖండ్ – రమేష్ బైన్
- త్రిపుర – సర్యదేవ్ నారాయణ ఆర్య
- గోవా – పి.ఎస్ శ్రీధరన్ పిళ్ళై
తెలంగాణ నుంచి తొలి సారిగా కేబినేట్ మంత్రిగా కిషన్ రెడ్డి నియామకం :

కేంద్రంలో నరేంద్రమోదీ కేబినెట్లో, సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 25 నెలల ఏడు రోజుల వ్యవధిలోనే కిషన్ రెడ్డి పదోన్నతి పొందారు. తెలంగాణ ఆవిర్భవించాక కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి కేబినెట్ హోదా దక్కించుకున్న తొలి నేతగా గుర్తింపు పొందారు. నరేంద్ర మోదీ తొలి విడత సర్కా ర్ లో బండారు దత్తాత్రేయ స్వతంత్ర హోదాలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డి హోంశాఖ సహాయమంత్రి పదవి దక్కించుకుని 2019 మే నెల 30 నుంచి ఆ పదవిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి భాజపా నేతలు సీ హెచ్.విద్యాసాగర్ రావు,బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయలు కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రులుగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో భాజపా నుంచి చూస్తే.వెంక య్యనాయుడి తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రిప దవి పొందిన రెండో నేత కిషన్ రెడ్డి.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ నుంచి తొలి సారిగా కేబినేట్ మంత్రిగా కిషన్ రెడ్డి
ఎవరు: కిషన్ రెడ్డి
ఎప్పుడు: జులై 07
కృష్ణానదీ యాజ మాన్య బోర్డు ) చైర్మన్ గా ఎం.పి. సింగ్ భాద్యతలు స్వీకరణ :

కృష్ణానదీ యాజ మాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ గా ఎం.పి. సింగ్ జులై 06 న బాధ్య తలు స్వీకరించారు. బోర్డు తాత్కాలిక ఛైర్మ వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. మే నెలలో బోర్డు ఛైర్మన్ గా ఉన్న పరమేశం పదవీమణ పొందిన విషయం తెలిసిందే.కాగా ఎం.పి.సింగ్ కు పుష్పగుచ్ఛం అందజేస్తు గుజరాత్ లోని గాంధీనగర్ లో కేంద్ర సంఘం (సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజినీర్ గా ఉన్న ఎం.పి.సింగ్ కు పదోన్నతి కల్పించి ఆనంతరం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, కృష్ణా బోర్డు బాధ్యతలను అప్పగించింది..
క్విక్ రివ్యు :
ఏమిటి: కృష్ణానదీ యాజ మాన్య బోర్డు ) చైర్మన్ గా ఎం.పి. సింగ్ భాద్యతలు స్వీకరణ
ఎవరు: ఎం.పి. సింగ్
ఎప్పుడు: జులై 07
భారత నూతన క్రీడా శాఖ మంత్రిగా అనురాగ్ టాకూర్ భాద్యతలు :

ఒలింపిక్స్ ఆరంభానికి ముందు దేశానికి కొత్త క్రీడల మంత్రి వచ్చారు. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కిరెన్ రిజిజు బుధవారం కేంద్ర మంత్రివర్గ స్థానంలో అనురాగ్ ఠాకూర్‌కు క్రీడల మంత్రిత్వ శాఖను అప్పగించారు. 46. ఏళ్ల అనురాగ్ బీసీసీఐలో ఎన్నో ఏళ్లు కీలకంగా పనిచేశారు. చాలా కాలం కార్యదర్శిగా ఉన్న ఆయన 2016 మే నుంచి ఫిబ్రవరి 2017 వరకు అధ్యక్షు డిగా వ్యవహరించారు. టోక్యో ఒలింపిక్స్ కు రెండు వారాల ముందు అనురాగ్ క్రీడల మంత్రిగా నియమితుడు కావడం విశేషం. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నుంచి బాధ్యతలు అందుకున్న రిజిజు రెండేళ్లకు పైగా క్రీడల శాఖ మంత్రిగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత నూతన క్రీడా శాఖ మంత్రిగా అనురాగ్ టాకూర్ భాద్యతలు
ఎవరు: అనురాగ్ టాకూర్
ఎప్పుడు: జులై 07
భారత హాకీ దిగ్గజం కేశవ్ దత్ కన్నుమూత :

భారత హాకీ దిగ్గజం కేశవ్ దత్ ఇక లేరు. 95 ఏళ్ల ఆయన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కోలకతాలోని తన నివా సంలో కన్నుమూశారు 1948, 1952 ఒలింపిక్స్ ల్లో స్వర్ణాలు గెలిచిన జాతీయ జట్టులో సభ్యుడుగా ఉన్నారు కేశవ్. భారత హాకీ ప్రస్థానంలో ఓ శకం ముగి సింది. కేశవ్ దత్ మరణంతో హాకీ స్వర్ణ యుగంలో ఓ తరానికి తెరపడింది. 1948, 1952 ఒలింపిక్స్ ల్లో బంగారు పతకాలు గెలిచిన భారత హాకీ జట్టులోని ఆటగాళ్లందరూ ఇప్పటికే కన్నుమూయగా. ఇప్పు డేమో మిగిలి ఉన్న ఏకైక ఆటగాడు కేశవ్ దత్ కూడా మృతి చెందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత హాకీ దిగ్గజం కేశవ్ దత్ కన్నుమూత
ఎవరు: కేశవ్ దత్
ఎప్పుడు: జులై 07
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత :

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూశారు. నటుడిగా దిలీప్ కుమార్ గారు 1944లో ‘జ్వార్ భాటా’ చిత్రంతో హిందీ చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. ఆరు దశాబ్దాలుగా ఉన్న కెరీర్లో దిలీప్ కుమార్ ‘మొఘల్-ఎ-అజామ్’, ‘నయా దౌర్’, ‘బాబుల్’, డీదార్’, ‘మధుమతి’, ‘దేవదాస్’, ‘గంగా జమునా’, రామ్ ఘ ర్ శ్యామ్ ‘,’ కర్మ ‘మరియు. బాలీవుడ్ విషాద రాజుగా ఆయన ప్రసిద్ది చెందారు. అతను చివరిసారిగా 1998 లో వచ్చిన కిలా చిత్రం లో కనిపించాడు. అతను 1954 లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్న మొదటి నటుడు మరియు మొత్తం 8 సార్లు గెలుచుకున్నాడు. అతను మరియు షారూఖ్ ఖాన్ సంయుక్తంగా చాలా ఫిలింఫేర్ ట్రోఫీల రికార్డును కలిగి ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత
ఎవరు: దిలీప్ కుమార్
ఎప్పుడు: జులై 06
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |