
Daily Current Affairs in Telugu 06 -05-2021
స్వస్థా అహార్ యోజన అనే ఒక పథకం ను ప్రారంభించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం :

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ కరోనా రోగులకు ఉచిత స్వస్థా అహార్ యోజన (ఆరోగ్యకరమైన ఆహార పథకం) అనే ఒక వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వస్ కైలాష్ సారంగ్ గారు ఏప్రిల్ 04 న ప్రారంభించారు. దీని ద్వారా రోగికి సమయానుసారంగా పోషకమైన ఆహారం లభి౦ చేలా చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ను పైలట్ ప్రాజెక్టుగా భోపాల్లోని ఆసుపత్రుల్లో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి సారంగ్ తెలిపారు. విజయవంతం అయిన తరువాత, ఈ పథకం రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా విస్తరింపజేయనున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: స్వస్థా అహార్ యోజన అనే ఒక పథకం ను ప్రారంభించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: మధ్యప్రదేశ్
ఎప్పుడు: ఏప్రిల్ 06
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని :భోపాల్
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి :శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ రాష్ట్రగవర్నర్ –ఆనంది బెన్ పటేల్
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలికిన బార్బరా స్ట్రికోవా :

మహిళల టెన్నిస్ డబుల్స్ ను ప్రపంచ రెండో ర్యాంకర్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్ కు వీడ్కోలు పలికింది. 35 ఏళ్ల స్ట్రికోవా తల్లి కాబోతున్నట్లు గత మార్చిలో ప్రకటించింది. 2019 వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్ట్రికోవా చైనీస్ తైపీకి చెందిన సు వె సెయితో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. అదే ఏడాది సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ కు చేరుకుంది. చివరిసారి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఆడిన స్ట్రికోవా సింగిల్స్ విభాగంలో కెరీర్ బెస్ట్ 16వ ర్యాంక్ చేరుకోవడంతోపాటు రెండు టైటిల్స్ ను గెలిచింది. డబుల్స్ లో స్ట్రికోవా వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ లో నిలువడంతోపాటు 31 టైటిల్స్ ను సొంతం చేసుకుంది. ఈ 31 టైటిల్స్ రెండింటిలో (2016లో –సిన్సినాటి, టోక్యో ఓపెన్) భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వామిగా ఉంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: అంతర్జాతీయ టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలికిన ప్లేయర్ బార్బరా స్ట్రికోవా
ఎవరు: బార్బరా స్ట్రికోవా
ఎప్పుడు: ఏప్రిల్ 06
మనోజ్ దాస్ జ్ఞాపకార్థం ‘మనోజ్ దాస్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారం’ ను ప్రవేశ పెట్టిన ఒడిష ప్రభుత్వం :

ప్రముఖ లిటరేటర్ మనోజ్ దాస్ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ‘మనోజ్ దాస్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారం’ అందజేస్తుందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఆంగ్ల సాహిత్యానికి సృజనాత్మక సహకారం అందించినందుకు ఒడిశా నుండి వచ్చిన సాహిత్యకారులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. దీని ద్వారా రూ.10 లక్షల నగదు బహుమతిని కలిగి ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మనోజ్ దాస్ మరియు అతని చరిత్రకారుడు అయిన సోదరుడు మన్మత్ నాథ్ దాస్ పేరిట ‘మన్మత్- మనోజ్ మెమోరియల్’ అనే స్మారక చిహ్నాన్ని బాలసోర్ జిల్లాలోని వారి జన్మస్థలం సంఖారి గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: మనోజ్ దాస్ జ్ఞాపకార్థం ‘మనోజ్ దాస్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారం’ ను ప్రవేశ పెట్టిన ఒడిషా ప్రభుత్వం
ఎవరు: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
ఎక్కడ: ఒడిశా
ఎప్పుడు: ఏప్రిల్ 06
ఒడిశా రాష్ట్ర రాజధాని : భువనేశ్వర్
ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి -నవీన్ పట్నాయక్
ఒడిశా రాష్ట్ర గవర్నర్ –గణేషి లాల్
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మాజీ ఏరోనాటికల్ శాస్త్రవేత్త మానస్ బిహారీ వర్మ కన్నుమూత :

పద్మ శ్రీ అవార్డు గ్రహీత గా పేరున్న మాజీ ఏరోనాటికల్ శాస్త్రవేత్త మానస్ బిహారీ వర్మ గుండెపోటుతో ఏప్రిల్ 4న దర్భాంగా జిల్లాలోని తన స్వస్థలంలో మరణించారు. ఆయన వయసు 78సంవత్సరాలు . మాజీ అధ్యక్షుడు ఎపిజె అబ్దుల్ కలాం యొక్క సన్నిహితుడు. వర్మ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అతను లాహేరియసారైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: పద్మ శ్రీ అవార్డు గ్రహీత మాజీ ఏరోనాటికల్ శాస్త్రవేత్త మానస్ బిహారీ వర్మ కన్నుమూత
ఎవరు: మానస్ బిహారీ వర్మ
ఎప్పుడు:ఏప్రిల్ 04
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |