
Daily Current Affairs in Telugu 06-01-2020
గగన్ యాన్ కోసం చేల్లెకేరేలో శిక్షణ కేంద్రం :

బారతీయ అంతరిక్ష పరిశోదన కేంద్రం (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న మానవ సహిత ఉపగ్రహం గగన్ యాన్ కోసం కర్నాటక లోని చిత్ర దుర్గ జిల్లా చేల్లెకేరే లో అదనపు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చెయనుంది.హ్యూమన్ స్ప్పెస్ పాలిట్ సెంటర్ గా కూడా పిలిచే ఈ కేంద్రం నుంచి గగన్ యాన్ కు సంబంధించిన కార్యక్రమాలతో పాటు వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఇస్రో జనవరి06 బెంగళూరులో ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గగన్ యాన్ కోసం చేల్లెక్క;లో శిక్షణ కేంద్రం
ఎవరు: ఇస్రో
ఎక్కడ: కర్ణాటక లోని చిత్ర దుర్గ జిల్లా చేల్లెకేరే
ఎప్పుడు: జనవరి 06
100హార్డిల్స్ లో తెలుగమ్మాయి జాతీయ రికార్డు :

తెలుగమ్మాయి యరాజి జ్యోతి చరిత్ర సృష్టించింది.దాదాపు పద్దెనిమిదేళ్ళ గా పదిలంగా ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. సీనియర్ మహిళల 100మీ హర్తిల్స్ లో సరికొత్త రికార్డును తన పేరిట లికించుకుంది.అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల అట్లేటిక్స్ చాంపియన్ షిప్ లో బాగంగా 100మీ హర్తిల్స్ లో (13.037) సెకన్ల టైమింగ్ తో లక్ష్యాన్ని చేరుకున్న ఆమె 2002లో అనురాధబిస్వాల్ (13.38 సే)నెలకొల్పిన రికార్డును తిరగరాసింది.స్వప్న కుమారి(13.23సే-జార్కండ్),ఆపర్ణ (13.55సే-కేరళ) వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.గుంటూర్లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తరపున బరిలో దిగిన ఆమె చిరుతలా పరుగెత్తి మేటి రికార్డు ను చెరిపేసి .సంచలనం నమోదు చేసింది.13.94 సెకన్ల టైమింగ్ తోజూనియర్ మహిళల 100మీ హార్డిల్స్ లోను తను పసిడి కైవసం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 100హార్డిల్స్ లో తెలుగమ్మాయి జాతీయ రికార్డు
ఎవరు: యరాజి జ్యోతి
ఎక్కడ: మంగలూర్
ఎప్పుడు: జనవరి 06
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఎస్.టి .యు రాష్ట్ర అద్యక్షుడిగా సుదీర్ భాబు :

రాష్ట్రోపాద్యాయ సంఘం (ఎస్టియు) రాష్ట్ర అద్యక్షుడిగా సి.హెచ్ జోసెఫ్ సుదీర్ బాబు (గుంటూరు) ప్రదాన కార్యదర్శిగా మల్లు రఘునాథరెడ్డి (కడప) ,ఆర్థిక కార్యదర్శిగా పి. సుబ్బరాజు (తూర్పుగోదావరి),ఎస్ .శ్రీనివాస్ రావు (కృష్ణ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.16మంది చొప్పున ఉపాధ్యక్షుడు.కార్యదర్శులుగా ,8మందిని ఆర్థికంగా కమిటీ సబ్యులుగా ఎన్నుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎస్.టి .యు రాష్ట్ర అద్యక్షుడిగా సుదీర్ భాబు
ఎవరు: సుదీర్ భాబు
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: జనవరి 06
గుజరాత్ లోని రాజ్ కోటలో 111మంది శిశు మరణాలు :

గుజారత్ లోని రాజకోట్ లో జిల్లలో 2019 డిసెంబర్ నెలలో 111మంది మృత్యు వాత పడ్డారు. దీనితో పాటు అహ్మాదాబాద్ ప్రబుత్వ అసు పత్రిలో 88మంది శిశువులు మరణించారు.ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ జనవరి 05న వెల్లడించారు. ప్రజల్లో అవగాహన లేమి పౌష్టికార లోపం ,చలి తీవ్రత ఈ మరణాలకు కారణాలని ఆయన అన్నారు.రెండు ధశబ్డాలతో పోలిస్తే మరణాల సంఖ్య పెరిగిందన్నారు.రాజ్ కోట్లోని ప్రబుత్వ ఆస్పత్రి లో 2019,డిసెంబర్ 388 మంది శిశువులు చేరగాగా,వారిలో 111మంది మరణించారు.అహ్మదాబాద్లో ప్రబుత్వ ఆస్పత్రిలో 2019 డిసెంబర్ 415 మంది శిశువులు చేరగా ,వారిలో 88మంది మరణిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గుజరాత్ లోని రాజ్ కోటలో 111మంది శిశు మరణాలు
ఎవరు: గుజరాత్
ఎక్కడ: : గుజరాత్ లోని రాజ్ కోటలో
ఎప్పుడు:జనవరి 06
అంతర్జాతీయ క్రికెట్ కు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు :

అంతర్జాతీయ క్రికెట్ కు భారత ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు పలికాడు. క్రికెట్లో అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు జనవరి 04న ఇర్ఫాన్ ప్రకటించాడు. మేటి ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్న 35ఏల్ల పఠాన్ 2003లో ఆస్ట్రేలియాపై ఆడిలైట్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు.2012 లో తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్ 2019లో ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టి20 క్రికెట్లో టోర్నీలో జమ్మూకాశ్మీర్ తరపున చివరిసారిగా దేశవాళి మ్యాచ్ లో బరిలోకి దిగాడు.దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి 20 వరల్డ్ కప్ లో భారత్ విశ్వవిజేతగా అవతరించడంలో కీలక పాత్ర పోషించదువు. ప్రస్తుతం ఇర్ఫాన్ క్రికేట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అంతర్జాతీయ క్రికెట్ కు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు
ఎవరు: ఇర్ఫాన్ పఠాన్
ఎప్పుడు: జనవరి 05