Daily Current Affairs in Telugu 05 August-2022
శాఫ్ అండర్-20 పుట్బాల్ టైటిల్ ను గెలుచుకున్న భారత్ :

శాఫ్ అండర్-20 పుట్బాల్ టైటిల్ ను ఆతిథ్య దేశం అయిన భారత్ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 05న జరిగిన ఫైనల్లో అదనపు సమయంలో భారత్ 5-2 గోల్స్ బంగ్లాదేశ్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో సగం ఆట అయ్యేసరికి’ భారత్-బంగ్లా దేశాలు చెరో గోల్ తో సమంగా నిలిచాయి. నిర్ణీత సమయం పూర్తయ్యే సమయానికి రెండు జట్లు 2-2తో మళ్లీ సమమయ్యాయి. అయితే అదనపు సమయంలో గుర్ కీరత్ (94వ, 99వ) రెండు, హిమాంశు (92వ) ఒక గోల్ కొట్టి భారత్ను విజయపధంలో నడిపించారు. ఈ మ్యాచ్లో గుర్కరత్ ఒక్కడే నాలుగు గోల్స్ చేయడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి : శాఫ్ అండర్-20 పుట్బాల్ టైటిల్ ను గెలుచుకున్న భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : ఆగస్ట్ 05
పురుషుల హెవీ వెయిట్ విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకున్న పారా పవర్ లిఫ్టర్ సుధీర్ కుమార్ :

భారత పారా పవర్ లిఫ్టర్ సుధీర్ కుమార్ సత్తా చాటాడు. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో పురుషుల హెవీ వెయిట్ విభాగంలో స్వర్ణంతో మెరిశాడు. ఈ విభాగంలో తొలి ప్రయత్నంలో 208 ‘కేజీలు ఎత్తిన 27 ఏళ్ల సుధీర్ తర్వాత 212 కేజీలు లిప్ట్ చేశాడు. ఆపై 217 కేజీలు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. మొత్తం మీద 134.5 పాయింట్లతో క్రీడల రికార్డును సృష్టిస్తూ సుదీర్ పసిడి గెలుచుకున్నాడు. క్రిస్టియన్ (నైజీరియా, 133.6 పాయింట్లు) రజతం గెలవగా, మికీ యూల్ (స్కాట్లాండ్, 130.9 పాయింట్లు). కాంస్య పథకం ను సాధించాడు. టోక్యో పారాలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ లో రజత పథకం గెలిచిన భవీనా పటేల్ కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకం ఖాయం చేసుకుంది. సింగిల్స్ లో ఆమె ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ భవీనా 3-0తో బెయిలీ (ఇంగ్లాండ్) ను చిత్తు చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : పురుషుల హెవీ వెయిట్ విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకున్న పారా పవర్ లిఫ్టర్ సుధీర్ కుమార్
ఎవరు : సుధీర్ కుమార్
ఎక్కడ: బర్మింగ్ హం
ఎప్పుడు : ఆగస్ట్ 05
కామన్వెల్త్ క్రీడల్లో భారత రెజ్లర్ లు రజత పథకం గెలుచుకున్న బజరంగ్ పునియా :

కామన్వెల్త్ క్రీడల్లో భారత రెజ్లర్లు మరోసారి అదరగొట్టారు. ఆగస్ట్ 05న పురుషుల 65 కేజీల విభాగంలో బజ్ంగ్ పునియా 1-2తో లాచున్ మెర్ ఫిదా (కెనడా)ను చిత్తుచేసి టైటిల్ నిలబెట్టుకున్నాడు. అదును కోసం ఎదురు చూసిన బజ్ంగ్ ప్రత్యర్థి కాలును లక్ష్యంగా చేసుకుని తలపడ్డారు. కాలు ఎత్తి కిందపడేసి ప్రత్యర్ధి మీదకు చేరిన అతను 3-0తో ఆధిక్యం సాదించాడు. కానీ మధ్యలో ప్రత్యర్థికి రెండు పాయింట్లు కోల్పోయారు. తిరిగి బలంగా పుంజుకున్న అతను మరోసారి ప్రత్యర్థి కాలిని ఎత్తి కిందపడేసి 6-3తో తిరుగులేని ఆధిక్యం సాధించారు. రివర్ మరింత దూకుడు ప్రదర్శించి వరుసగా రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా అతనికిది మూడో పతక౦ 2011లో 61 కేజీల. విభాగంలో రజతం నెగ్గిన అతడు నాలుగేళ్ల క్రితం 65 కేజీల చాంపియన్ గా నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కామన్వెల్త్ క్రీడల్లో భారత రెజ్లర్ లు రజత పథకం గెలుచుకున్న బజరంగ్ పునియా
ఎవరు : బజరంగ్ పునియా
ఎప్పుడు : ఆగస్ట్ 05
కామన్ వెళ్త గేమ్స్ లో లాంగ్ జంప్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న శ్రీ శంకర్ :

ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో 7 , ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్స్ లో 6 , ఆసియా ఇండోర్ పోటీల్లో 4.,ఆసియా క్రీడల్లో 6 ఇవీ అతడి స్థానాలు. టోక్యో ఒలింపిక్స్ ఫైనల్ చేరడంలో విఫలం.. ఇదీ అంతర్జాతీయ స్థాయిలో శ్రీశంకర్ ప్రదర్శన. ఆత్మవిశ్వా సంతో పోటీలకు సిద్ధమవడం.. అంచనాలు! పెంచి బరిలో దిగడం.. చివరకు పతకానికి కొద్ది దూరంలో ఆగిపోవడం. ఇలా ప్రపంచ వేదికపై సుదీర్ఘంగా సాగిన తన పతక నిరీక్షణకు అతను తాజాగా ముగింపు పలికాడు. కామన్వెల్త్ క్రీడల పురుషుల లాంగ్ జంప్ క్రీడలో రజతం నెగ్గిన తొలి భారత అథ్లెట్ గా రికార్డు సృష్టించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కామన్ వెళ్త గేమ్స్ లో లాంగ్ జంప్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న శ్రీ శంకర్
ఎవరు : శ్రీ శంకర్
ఎప్పుడు :ఆగస్ట్ 05
జాబిల్లి కక్ష్యలోకి ఆర్బిటర్ ను పంపిన దక్షిణ కొరియా దేశం :

చందమామ దిశగా దేశాలు వరుసకడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో దక్షిణ కొరియా దేశం కూడా చేరింది. జాబిల్లి కక్ష్యలోకి ఒక ఆర్బిటర్ ను పంపింది. భవిష్యత్ లో చంద్రుడి ఉపరితలంపై ‘వ్యోమనౌకలను దించడానికి అనువైన ప్రదేశాలను ఇది గుర్తిస్తుంది. ‘ధనురి’ అనే ఈ ఆర్బిటర్ ను స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన రాకెట్ ద్వారా అమెరికా లోని కేప్ కెనవెరాల్ నుంచి ప్రయోగించారు. ఇది డిసెంబరులో జాబిల్లిని చేరుతుంది. 18 డాలర్లతో దక్షిణ కొరియా ఈ ప్రాజెక్టును చేపట్టింది. దనురి చంద్రుడి ఉపరితలం దిశగా నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరుతుంది. ఏడాది పాటు చందమామను శోధిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణ కొరియా ఈ ఏడాది జూన్ లో సొంత రాకెట్ భూ కక్ష్యలోకి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించగా ఇది గుర్తి౦చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రుడిని భారత్, అమెరికా, చైనాల వ్యోమనౌకలు శోధిస్తున్నాయి.కాగా త్వరలో రష్యా, జపాన్, ఆమె రికాలోని పలు ప్రైవేటు కంపెనీలు మరికొన్ని ఉపగ్రహాలను అక్కడికి పంపబోతున్నాయి.
- దక్షిణ కొరియా దేశ రాజధాని : సియోల్
- దక్షిణ కొరియా దేశ కరెన్సీ : సౌత్ కొరియన్ వాన్
- దక్షిణ కొరియా దేశ అద్యక్షుడు : యు సుక్ కియోల్
- దక్షిణ కొరియా దేశ ప్రధాని ; హాన్ డాక్
క్విక్ రివ్యు :
ఏమిటి : జాబిల్లి కక్ష్యలోకి ఆర్బిటర్ ను పంపిన దక్షిణ కొరియా దేశం
ఎవరు : దక్షిణ కొరియా దేశం
ఎక్కడ: దక్షిణ కొరియా దేశం
ఎప్పుడు :ఆగస్ట్ 05
జపాన్ విదేశాంగమంత్రి ప్రశంసా పురస్కారానికి ఎంపిక అయిన గవ్వ రేఖా రెడ్డి :

హైదరాబాద్కు చెందిన జపాన్ పూల అలంకరణ (ఒహరా ఇకె బానా) కళానిపుణురాలు గవ్వా రేఖారెడ్డి గారు జపాన్ దేశ విదేశాంగమంత్రి ప్రశంసాపురస్కారానికి ఎంపికయ్యారు. తమ ఎంపిక ద్వారా భారత్-జస్థాన్ మధ్య సాంస్కృతిక’ మార్పిడి, సుహృద్భావ, స్నేహ సంబంధాలకు దోహదపడినందుకు గాను ఆమె ఈ పురస్కానికి ఎంపిక చేసినట్లు చెన్నైలోని కాన్సులేట్ కార్యాలయం ఆగస్ట్ 05న వెల్లడించింది. త్వరలో చెన్నై లోని జపాన్ కాన్సులేట్ కార్యాలయంలో ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేస్తారు. జపాన్ ప్రభుత్వం తమ దేశానికి ఆనుబంధ కళలు,సేవలు అందించే వారిని గుర్తించి ప్రతియేటా ఈపురస్కారాలు అందిస్తుంది.
- జపాన్ దేశ రాజధాని : టోక్యో
- జపాన్ దేశ కరెన్సీ : జపనీస్ యెన్
- జపాన్ దేశ ప్రధాన మంత్రి : పుమియో కిశిడ
క్విక్ రివ్యు :
ఏమిటి : జపాన్ విదేశాంగమంత్రి ప్రశంసా పురస్కారానికి ఎంపిక అయిన గవ్వ రేఖా రెడ్డి
ఎవరు : గవ్వ రేఖా రెడ్డి
ఎప్పుడు :ఆగస్ట్ 05
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |