
Daily Current Affairs in Telugu 05-04-2021
వియత్నాం దేశ తదుపరి ప్రధానిగా ఫామ్ మిన్ చిన్హ ఎన్నిక :

వియత్నాం దేశ జాతీయ అసెంబ్లీ లో ఏప్రిల్ 05న జరిగిన అధికారిక కార్యక్రమం లో ఆగ్నేయాసియా ఆసియా దేశ తదుపరి ప్రధానిగా కెరీర్ సెక్యూరిటీ అధికారి ఫామ్ మిన్ చిన్హ యొక్క ఎన్నికను దృవీకరించబడింది.ఈ 62 ఏళ్ల చిన్హ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కాంగ్రెస్లో ఈ పదవికి అధికారిక కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించిన ఏకైక నామిని. ఏప్రిల్ 05న జరిగిన జాతీయ అసెంబ్లీలో ఓటులో ఆయన 96.25 % ఓట్లు సాధించారు.
క్విక్ రివ్యు :
ఏమిటీ: వియత్నాం దేశ తదుపరి ప్రధానిగా ఫామ్ మిన్ చిన్హ ఎన్నిక :
ఎవరు: ఫామ్ మిన్ చిన్హ
ఎక్కడ: వియత్నాం
ఎప్పుడు : ఏప్రిల్ 05
దేశంలోనే కోవిడ్ టీకా తీసుకున్న అత్యధిక వయసుకల వృద్ధురాలిగా తులసి రికార్డు:

దేశంలోనే కోవిడ్ టీకా తీసుకున్న అత్యధిక వయసుకల వృద్ధురాలిగా తులసి రికార్డు సృష్టించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 118ఏళ్ల వృద్ధురాలు టీకా తీసుకున్నది. సాగర్ కు చెందిన తులసి భాయ్ టీకా తీసుకున్న తర్వాత ఎటువంటి పిర్యాదు చేయలేదు అని ఆయా జిల్లా కలెక్టర్ దీపక్ సింగ్ తెలిపారు. ఏప్రిల్ 3 న తులసి భాయ్ తన తొలి దీసును టీకా తీసుకున్నది. దేశంలోనే టీకా తీసుకున్న అత్యధిక వయసుకల వృద్ధురాలిగా తులసి రికార్డ్ సృష్టించింది.
క్విక్ రివ్యు :
ఏమిటీ: దేశంలోనే కోవిడ్ టీకా తీసుకున్న అత్యధిక వయసుకల వృద్ధురాలిగా తులసి రికార్డు
ఎవరు: తులసి
ఎక్కడ: మధ్యప్రదేశ్
ఎప్పుడు : ఏప్రిల్ 05
చత్తీస్ గడ్ ఎంకౌంటర్ పై ఆపరేషన్ ప్రహర్ 3 ను చేపట్టిన కేంద్ర హోమ్ శాఖ :

కేంద్ర హోం. శాఖ మావోయిస్టుల పైన ఉక్కు పాదం మోపేందుకు సిద్ధం అయింది. చత్తీస్ గడ్ ఎం కౌంటర్ తో 24 మంది జవాన్ లు వీర మరణం పొందడాన్ని కేంద్ర హోమ్ శాఖ సీరియస్ గా తీసుకున్నది. మావోయిస్టు బెటాలియన్ కమాండర్ హిద్మా ఉన్నట్లు ఉప్పందించి భద్రత బలగాలను మావోయిస్టు లు దాడి చేసినందు వల్ల ఇపుడు భద్రత దళాలు అదే హిద్మా ను టార్గెట్ చేస్తూ ఓ కొత్త ఆపరేషన్ కు సన్నద్ధమయ్యాయి.హిద్మా తో పాటు మరో 8మందిని మావోయిస్టు కమాండర్ లను ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ ప్రహర్-3 చేపట్టాయి. చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ నేపథ్యం లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యున్నత సమావేశం నిర్వహించారు. దీనికి ఇంటలిజెన్స్ అధికారులు కేంద్ర హోం శాఖ కార్యదర్శి సి.ఆర్.పీ.ఎఫ్ ఉన్నత అధికారులు హాజరు అయ్యారు.ఈ సమావేశంలో అమిత్ షా నక్సలైట్ లకు వ్యతిరేకంగా ఆపరేషన్ ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు.
క్విక్ రివ్యు :
ఏమిటీ: చత్తీస్ గడ్ ఎంకౌంటర్ పై ఆపరేషన్ ప్రహర్ 3 ను చేపట్టిన కేంద్ర హోమ్ శాఖ
ఎవరు: కేంద్ర హోమ్ శాఖ
ఎక్కడ: చత్తీస్ గడ్
ఎప్పుడు : : ఏప్రిల్ 05
బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీ అదనపు డైరెక్టర్‌గా మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమాకం :

నాన్-ఎగ్జిక్యూటివ్ మరియు ఇండిపెండెంట్ డైరెక్టర్ విభాగంలో బ్రిటానియా ఇండస్ట్రీస్ బోర్డు కు మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను కంపెనీ అదనపు డైరెక్టర్‌గా నియమించింది. ఈయన పదవి ఐదేళ్ల కాలానికి మార్చి 31 నుంచి అమల్లోకి అదనపు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మార్చి 31, 2021 న జరిగిన వారి సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు, మార్చి 31 నుండి అమలులోకి వచ్చే నాన్-ఎగ్జిక్యూటివ్ మరియు ఇండిపెండెంట్ డైరెక్టర్ విభాగంలో కంపెనీ అదనపు డైరెక్టర్‌గా డాక్టర్ ఉర్జిత్ పటేల్‌ను నియమించడానికి ఆమోదం తెలిపింది. 2021 5 సంవత్సరాల కాలానికి, అంటే 2026 మార్చి 30 వరకు, సంస్థ యొక్క వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటీ: బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీ అదనపు డైరెక్టర్‌గా మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమాకం
ఎవరు: ఉర్జిత్ పటేల్
ఎప్పుడు : ఏప్రిల్ 05
ఐటీఎఫ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన నికీ పునాచా :

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో నికి కలియంధ పునాచా అనే ఆటగాడు (భారత్)విజేతగా నిలిచాడు. న్యూఢిల్లీలో ఏప్రిల్ 4న జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 25 ఏళ్ల నికీ పునాచా 6-3, 7-6 (7/5) తేడా తో నాలుగో సీడ్ ఒలీవర్ క్రాఫోర్డ్ (అమెరికా) ఆటగాడిపై విజయం సాధించాడు. నికి యొక్క కెరీర్లో ఇది రెండో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్. 2018లో తొలిసారి అతను ఇండోనేసియా ఫ్యూచర్స్-3 టోర్నీ టైటిల్ ను గెలుల్చుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటీ: ఐటీఎఫ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన నికీ పునాచా
ఎవరు: నికీ పునాచా
ఎప్పుడు : ఏప్రిల్ 05
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |