
Daily Current Affairs in Telugu 05-04-2020
హైదరాబాద్ ఐఐటీ లో జీవన్ లైట్ అనే నూతన వెంటి లెటర్ రూపకల్పన:

కరోన వైరస్ సోకిన వారికీ చికిత్స అందించేందుకు అవసరమైన మాస్క్ లు మరియు వెంటి లెటర్ లు తయారికి సంబంధించిన నమూనాల్ పై అనేక పరిశోదనలు జరుగుతున్నాయి.ఇటీవల తక్కువ ఖర్చుతో తయారయ్యే బ్యాగ్ వాల్వ్ మాస్క్ ను డిజైన్ చేసిన ఐఐటీ హైదరాబాద్ తాజాగా జీవన్ లైట్ అనే పేరుతో అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలెటర్ ను తయారు చేసింది. ఐఐటీ అనుబంధ సంస్థ అయిన సెంటర్ ఫర్ హెల్త్ కేర్ ఎంటర్ప్రేన్యుర్షిప్ (సి.ఎ.ఎఫ్.హెచ్.ఈ) కి చెందిన ఏరో బయోఎసియా ఇన్నోవేషన్ అనే స్టార్ట్అప్ కంపెని ఈ వెంటిలెటర్ ను రూపొంచింది. తక్కువ బడ్జెట్ తో తయారయ్యే ఈ ఎమర్జేన్సి వెంటిలెటర్ లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు ఏరో బయోసిస్తెలిపింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పనిచేసే ఈ వెంటిలెటర్ ను విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో కూడా ను బ్యాటరి సహాయంతో పనిచేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: హైదరాబాద్ ఐఐటీ లో జీవన్ లైట్ అనే నూతన వెంటి లెటర్ రూపకల్పన
ఎక్కడ: హైదరాబాద్
ఎవరు: హైదరాబాద్ ఐఐటీ
ఎప్పుడు :ఏప్రిల్ 05
వూహాన్ నగరం పేరుతో నూతన ఉపగ్రహం రూపకల్పన:

అంతరిక్ష రోదసి ఆదారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటి) ప్రాజెక్ట్ కోసం చైనా దేశం 2020 ఏప్రిల్ రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలో కి పంపనుంది.ఈ రెండు ఉపగ్రహాలలో ఒక ఉపగ్రహానికి వూహాన్ అని పేరు పెట్టినట్లు చైనా అధికార వార్త సంస్థ అయిన శిన్హువా ఏప్రిల్ 03 న తెలిపింది .క్వంగ్జౌ -1 ఏ అనే రాకెట్ ద్వారా ఈ రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టనున్నారు.జింగ్ యుం ఇంజనీర్ ప్రాజెక్టు లో భాగాముగా భూమికి కింద ఉన్న కక్ష్యలో ప్రవేశ పెట్టె మొత్తం 80 ఉపగ్రహాల్లో ఇవి మొదటివి సముద్రాలు మరియు అడవులు ఇంజనీరింగ్ యంత్రాల యొక్క కమ్యునికేషన్ ల కోసం ఈ ఉపగ్రహాలను తయారు చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వూహాన్ నగరం పేరుతో నూతన ఉపగ్రహం రూపకల్పన
ఎక్కడ: చైనా
ఎవరు: చైనా
ఎప్పుడు: ఏప్రిల్ 05
ఇక్రిసాట్ నూతన డైరెక్టర్ జనరల్ గా హ్యుగ్స్ నియామకం :

ప్రపంచ వ్యవసాయ పరిశోదనలో ఎన్నో ఘనతలను సాధించిన డాక్టర్ జక్విలన్ హుగ్స్ ఇక్రిసాట్ ఏప్రిల్ 04 న ఆమె బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఇక్రిసాట్ తన న్యూస్ లెటర్లో పేర్కొంది.ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ వరి పరిశోదన సంస్థలో ని పరిశోదన విభాగ డిప్యుటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇక్రిసాట్ నూతన డైరెక్టర్ జనరల్ గా హ్యుగ్స్ నియామకం
ఎవరు: డాక్టర్ జక్విలన్ హుగ్స్
ఎప్పుడు:ఏప్రిల్ 05
థాయ్ లాండ్ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య పై నిషేధం:

నిర్ణీత సంఖ్యలో కంటే ఎక్కువ సంఖలో వెయిట్ లిఫ్టర్లు డోపింగ్ టెస్టులో దొరికిపోవడంతో థాయ్ లాండ్ ,మలేసియా వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య లపై అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యుఎఫ్)నిషేధం విధించింది.దీంతో రెండు దేశాల లిఫ్టర్లు వచ్చే 2021 ఏడాది టోక్యో ఒలింపిక్స్ దూరం కానున్నారు. థాయ్ లాండ్ పై మూడేళ్ళ నిషేధం విధించడంతో పాటు 2 లక్షల డాలర్ల జరిమానా వేశామని మలేసియా పై ఏడాది కాలం నిషేధం విధించామని ఐడబ్ల్యుఎఫ్ తెలిపింది. ఏప్రిల్ 01న నిషేదానికి సంబంధించిన సమాచారం థాయ్ లాండ్ మరియు మలేసియా వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్యలకు ఇచ్చామని నిషేధం పై కోర్టుఆఫ్ అర్బిటేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సిఎఎస్) లో అప్పీల్ చేసుకునేందుకు 21 రోజుల పాటు గడువు ఉందని ఈ వెల్లడించింది .2018 ప్రపంచ చాంపియన్ షిప్ లో థాయ్ లాండ్ కు చెందిన తొమ్మిది మంది వెయిట్ లిఫ్టర్లు డోపింగ్ లో దొరికారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: థాయ్ లాండ్ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య పై నిషేధం
ఎక్కడ: థాయ్ లాండ్
ఎవరు: ఐడబ్ల్యుఎఫ్
ఎప్పుడు: ఏప్రిల్ 05
అండర్ -17 పుట్ బాల్ ప్రపంచ కప్ వాయిదా :

షెడ్యుల్ ప్రకారం భారత్ లో తొలిసారి అతిత్యమివ్వబోతున్న అండర్ -17 మహిళల ప్రపంచ కప్ నవంబర్ 2 నుంచి 21 వరకు జరగాల్సింది. కోల్కతా, గుహవటి,బువనేశ్వర్ ,అహ్మదాబాద్,నవీ ముంబాయి లో మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించారు .ఆతిథ్య భారత్ తో పాటు మొత్తం 16 జట్లు ఈ ప్రపంచ కప్ లో పాల్గొనాల్సింది. కానీ కోవిద్ -19 ప్రభావాన్ని అంచనా వేయడం కోసం ఫిఫా నియమించిన ఓ బృందం తాజాగా ప్రపంచ కప్ ను వాయిదా వేయాల్సిందే అని సూచించింది. ఫిఫా అండర్ -20 ,అండర్ -17 మహిళల ప్రపంచ కప్ లను వాయిధా తేదీలను త్వరలో ప్రకటిస్తాం అని ఫిఫా ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అండర్ -17 పుట్ బాల్ ప్రపంచ కప్ వాయిదా
ఎవరు:ఫిఫా
ఎప్పుడు: ఏప్రిల్ 05
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |