
Daily Current Affairs in Telugu 03&04 -04-2021
‘ఈ-గోల్కొండ’ వెబ్ పోర్టల్ ప్రారంభి౦ చిన తెలంగాణా ప్రభుత్వం :

తెలంగాణ రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్త కళాకృతులకు ప్రపంచస్థాయి లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు రూపొందించిన ‘ఈ-గోల్కొండ’ వెబ్ పోర్టల్ ఇటీవల ప్రారంబించారు. తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోర్టల్ను ఏప్రిల్ 1న ప్రగతిభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ-మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ- గోల్కొండ ద్వారా సంప్రదాయ హస్త కళా కృతులను కొనుగోలు చేసే వీలుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పోర్టల్ ద్వారా ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళా కృతులను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది.. ప్రపంచ దేశాలకు కూడా
క్విక్ రివ్యు :
ఏమిటీ: ‘ఈ-గోల్కొండ’ వెబ్ పోర్టల్ ప్రారంభి౦ చిన తెలంగాణా ప్రభుత్వం
ఎవరు: తెలంగణా ప్రభుత్వం
ఎక్కడ: తెలంగణా ప్రభుత్వం
ఎప్పుడు:ఏప్రిల్ 03
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) డైరెక్టర్ జనరల్ గా ముఖ్మీత్ ఎస్. భాటియా

ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) డైరెక్టర్ జనరల్ గా ముఖ్మీత్ ఎస్. భాటియా బాధ్యతలు స్వీకరించారు . ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కార్మికుల జనాభాకు సామాజిక ఆర్థిక రక్షణను అందించడానికి మరియు ఈ పథకం పరిధిలోకి వచ్చే తక్షణ ఆశ్రిత లేదా కుటుంబానికి అనుగుణంగా రూపొందించబడిన ఒక బహుమితీయ సామాజిక వ్యవస్థగా ఇది పని చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) డైరెక్టర్ జనరల్ గా ముఖ్మీత్ ఎస్. భాటియా
ఎవరు: ముఖ్మీత్ ఎస్. భాటియా
ఎప్పుడు: ఏప్రిల్ 03
పి.ఈ ఎస్ బి చైర్ పర్సన్ గా నియమితులయిన మల్లికా శ్రీనివాసన్ :

మల్లికా శ్రీనివాసన్మొదటి సారిగా ఒక ప్రైవేట్ సెక్టార్ స్పెషలిస్ట్‌ను పిఇఎస్‌బి చీఫ్‌గా నియమించనున్నారు మల్లికా శ్రీనివాసన్ 1వ ప్రైవేట్ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌ను పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలెక్షన్ బోర్డ్ (పిఇఎస్‌బి) చీఫ్‌గాభాద్యతలు నిర్వర్తించనున్నారు. 02 ఏప్రిల్ 2021,పిఇఎస్‌బి చైర్‌పర్సన్‌గా శ్రీనివాసన్‌ను మూడేళ్ల కాలానికి నియమించడానికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ (టాఫే) లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికా శ్రీనివాసన్‌ను పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పిఇఎస్‌బి)చైర్‌పర్సన్‌గా నియమించినట్లు సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సిపిఎస్ఇ)లో టాప్ మేనేజ్మెంట్ పోస్టుల నియామకానికి బాధ్యత వహించే ప్రైవేటు రంగ నిపుణుడిని పిఇఎస్బి అధిపతిగా నియమించడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు
క్విక్ రివ్యు :
ఏమిటీ: పి.ఈ ఎస్ బి చైర్ పర్సన్ గా నియమితులయిన మల్లికా శ్రీనివాసన్
ఎవరు: మల్లికా శ్రీనివాసన్
ఎప్పుడు: ఏప్రిల్ 04
అడ్వాన్స్డ్ చాప్ టెక్నాలజీ డెవలప్ చేసిన భారత రక్షణ పరిశోధన సంస్థ డీ.ఆర్.డీ.ఓ :

నౌకా దళ నౌకలను క్షిపణులను దాడులను నుంచి రక్షించేందుకు అవసరం అయిన అడ్వాంస్డ్ చాప్ టెక్నాలజీ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డెవలప్ చేసింది.డీ.ఆర్.డీ.ఓ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించింది.జోద్ పూర్ ఉన్న డిఫెన్స్ ల్యాబ్ లో వీటిని డెవలప్ చేశారు.మూడు రకాల చాప్ టెక్నాలజీ వేరియంట్లను రిలీజ్ చేశారు.షార్ట్ రెంజ్ చాప్ రాకెట్ (ఎస్.ఆర్.సి ఆర్) మీడియం రేంజ్ చాప్ రాకెట్ (ఎం.సి.ఆర్) లాంగ్ రేంజ్ చాప్ రాకెట్ ఎల్.ఆర్.సి.ఆర్ రకాల స్వదేశీ వేరియంట్లను తయారు చేసినట్లు డీ.ఆర్. డీ.వో చెప్పింది. నౌకా దళ అవసరాలను తగ్గినట్లుగా దీనిని తయారు చేశారు. ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంగా జోద్ పూర్ ల్యాబ్ అడ్వాన్స్ద్ చాప్ టెక్నాలజీ ఆయుధాలను విజయవంతంగా తయారు చేసినట్లు డీ.ఆర్.డీ.వో సంస్థ చెప్పింది.
క్విక్ రివ్యు :
ఏమిటీ: అడ్వాన్స్డ్ చాప్ టెక్నాలజీ డెవలప్ చేసిన భారత రక్షణ పరిశోధన సంస్థ డీ.ఆర్.డీ.ఓ
ఎవరు: డీ.ఆర్.డీ.ఓ
ఎప్పుడు: ఏప్రిల్ 04
అటల్ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ గా చింతన్ వైష్ణవ్ నియామకం:

సామాజిక సాంకేతిక నిపుణుడు చింతన్ వైష్ణవ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏ.ఐ.ఎం మిషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈయన ఈ నెలాఖరుకు మిషన్ డైరెక్టర్ గా భాద్యతలు స్వీకకరిస్తున్నట్లు నీతి ఆయోగ్ ఏప్రిల్ 4న ఒక ప్రకటనలో తెలిపింది. చింతన వైష్ణవ్ రామనాథన్ గారి స్థానంలో ఏ.ఐ.ఎం రెండవ మిషన్ డైరెక్టర్ గా భాధ్యతలు చేపట్టనున్నారు. వృత్తిపరంగా ఇంజనీర్ అయిన చింతన్ వైష్ణవ్ పరిశోధకుడిగా ఎం.ఐ.టీ అధ్యాపకుడిగా కూడా సేవలు అందించారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏ.ఐ.ఎంకింద దేశ వ్యాప్తంగా 650 జిల్లాల్లోని పాఠశాలలోని 7259 టింకరింగ్ ల్యాబులను నెలకొల్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటీ: అటల్ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ గా చింతన్ వైష్ణవ్ నియామకం
ఎవరు: చింతన్ వైష్ణవ్
ఎప్పుడు : ఏప్రిల్ 04
భారత దేశపు మొదటి పర్యావరణ మంత్రి అయిన దిగ్విజయ్ సింగ్ కన్నుమూత :

భారత దేశపు యొక్క మొదటి పర్యావరణ శాఖా మంత్రి మరియు రాచరిక రాష్ట్రం ఐన వాంకనెర్ యొక్క రాజకుటుంభం పితృ స్వామి దిగ్విజయ్ సింగ్ ఝలా స్వల్ప అనారోగ్యంతో మరణించారు. 1962 లో తొలిసారి గా ఇండిపెండెంట్ గా మళ్ళీ 1967 లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా వాంకనెర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. తరువాత కాంగ్రెస్ లో చేరారు.మరియు 1979 లో సురేంద్ర నగర్ నుంచి మళ్ళీ 1984 లో పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. అప్పటి ప్రధాన మంత్రి అయిన ఇందిరా గాంధీ గారి మంత్రి వర్గం లో మొదటి పర్యావరణ మంత్రిగా పని చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటీ: భారత దేశపు మొదటి పర్యావరణ మంత్రి అయిన దిగ్విజయ్ సింగ్ కన్నుమూత
ఎవరు: దిగ్విజయ్ సింగ్
ఎప్పుడు: ఏప్రిల్ 03
ప్రముఖ నటి పద్మ శ్రీ అవార్డు గ్రహీత శశికళ కన్నుమూత :

ప్రముఖ నటి శశి కళ ఏప్రిల్ 04 న నాడు తుది శ్వాస విడిచారు. ఆమె 88 సంవత్సరాలు వయస్సు మరియు ముంబై లో ని కొలబలో వృద్దాప్య సంబంధిత వ్యాధులతో మరణించింది. శశి కళ వందకు పైగా బాలీవుడ్ చిత్రాల్లో ఆమె పని చేశారు. భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి గాను శశి కళ కు 2007 ప్రతిష్టాత్మక పద్మ శ్రీ అవార్డు కూడా లభించింది. 2009 లో ఆమె జీవిత సాఫల్య పురస్కారం ను గెలుచుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటీ: ప్రముఖ నటి , పద్మ శ్రీ అవార్డు గ్రహీత శశికళ కన్నుమూత
ఎవరు: శశికళ
ఎప్పుడు: ఏప్రిల్ 03
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |