
Daily Current Affairs in Telugu 03 June-2022
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ లో రజత పతకం గెలుచుకున్న అంజుం మౌద్గిల్ :

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ లో అంజుం మౌద్గిల్ మెరిసింది. అజర్ బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల వ్యక్తిగత 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్స్ ఆమె రజతం సొంతం చేసుకుంది. మే 03న స్వర్ణ పతక పోరులో అంజుం 12-16తో రికీ మెంగ్ ఇబ్న్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. క్వాలిఫయింగ్ స్టేజ్-1లో 587 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి స్టేజ్-2 కు అర్హత సాధించిన అంజుం స్టేజ్ -2లో 106, 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. తుది సమరంలోనూ గట్టి గానే పోరాడినా ఆమెకు రజతమే దక్కింది. పురుషుల టీమ్ త్రిపొజిషన్స్ స్వప్నిల్, దీపక్ కుమార్, గోలీ గుర్జార్ తో కూడిన భారత జట్టు రజతం సాధించింది. పసిడి పోరులో భారత్ 7 17 యేషియా చేతిలో ఓడింది. మహిళల త్రిపోజిషన్స్ అంజుం- ఆయుషిలతో కూడిన ‘భారత జట్టు ఫైనల్ చేరడంలో విఫలమైంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ లో 1316 పాయింట్లతో రెండో రౌండ్ చేరిన భారత్. ఆ తర్వాత ముందంజ వేయలేకపోయింది. ఈ టోర్నీలో ఇప్పటి దాకా ఒక స్వర్గం, మూడు రజతాలతో భారత్ మూడో స్థానంలో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ లో రజత పతకం గెలుచుకున్న అంజుంమౌద్గిల్
ఎవరు : బంజుల మౌద్గిల్
ఎప్పడు : మే 03
శ్రీలంక క్రికెట్ జట్టు బౌలింగ్ వ్యూహ కోచ్ గా లసిత్ మలింగ నియామకం :

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కు దిగ్గజ పేసర్ లసిత్ మలింగ శ్రీలంక బౌలింగ్ వ్యూహ కోచ్ గా నియమితుడయ్యాడు. టీ20 క్రికెట్ లో అసాధారణ బౌలర్ గా పేరు తెచ్చుకున్న మలింగ ఈ ఫిబ్రవరిలో కంగారూలైన ఆస్ట్రేలియా దేశ గడ్డపై శ్రీలంక పర్యటించిన సమయంలోనూ ఈ పాత్రను పోషించాడు. “ఆస్ట్రేలియాతో సిరీస్ లో లంక బౌలర్లకు మైదానంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై మలింగ ఆవగాహన కల్పిస్తాడు.కాగా మలింగ అపార అనుభవం, డెత్ బౌలింగ్ లో అతడి నైపుణ్యం కచ్చితంగా లంక బౌలర్లకు మేలు చేస్తుందని నమ్ముతున్నాం” అని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఆస్ట్రేలియాతో లంక మూడు టీ20లు, అయిదు వన్డేల లో తలపడనుంది.
- శ్రీ లంక దేశ రాజధాని :కోలోంబో
- శ్రీ లంక దేశ కరెన్సీ :శ్రీలంకన్ రూపీ
- శ్రీ లంక దేశ అద్యక్షుడు : గోటబాయ రాజపక్స
- శ్రీలంక దేశ ప్రధాని : రాణిల్ విక్రమ సింఘే
శ్రీ లంక దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ :
క్విక్ రివ్యు :
ఏమిటి: శ్రీలంక క్రికెట్ జట్టు బౌలింగ్ వ్యూహ కోచ్ గా లసిత్ మలింగ నియామకం
ఎవరు : లసిత్ మలింగ
ఎక్కడ : శ్రీలంక
ఎప్పుడు మే 03
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన ఎండి ,సియివో గా ఎ మణిమేఖలై నియామకం :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) కొత్త ఎండీ, సీఈఓగా ఎ మణిమేఖలై మే 03 న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆమెకు బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అను భవం ఉంది. 1988లో విజయా బ్యాంకులో ఆఫీస ర్ గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అక్కడ వివిధ విభాగాల్లో పనిచేశారు. తదుపరి కెనరా బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ప్లానింగ్, క్రెడిట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఎస్ఎల్బీసీ తదితర విభాగాల్లో బాధ్యతలను నిర్వహించారు. తాజాగా యూబీఐ ఎండీ, సీఈఓగా నియమితులయ్యారు. బెంగుళూరు యూనివర్సిటీ నుంచి ఎంబీఏ(మార్కెటింగ్) పట్టా పుచ్చుకున్న ఆమె తదుపరి నార్సి మోంజీ ఇనిస్టిట్యూట్ లవ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో డిప్లొమో చేశారు.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన :1919 నవంబర్ 11
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం : ముంబాయ్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సియివో : మణిమేఖలై
క్విక్ రివ్యు :
ఏమిటి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన ఎండి ,సియివో గా ఎ మణిమేఖలై నియామకం
ఎవరు : ఎ మణిమేఖలై
ఎక్కడ : మే 03
ఇ-స్టాంపింగ్ సౌకర్యాన్ని ప్రారంబించిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం :

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇ-స్టాంపింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది, భౌతిక స్టాంప్ పేపర్లను రద్దు చేసింది. ఏదైనా విలువ కలిగిన స్టాంప్ పేపరు నుఇప్పుడు ఇ స్టాంప్ ద్వారా పొందవచ్చు, అంటే ఏదైనా స్టాంప్ విక్రేత నుండి లేదా రాష్ట్ర ప్రభుత్వంచే అధికారం పొందిన బ్యాంకుల నుండి కంప్యూటరైజ్డ్ ప్రింట్ అవుట్ ద్వారా పొందవచ్చు ఈ సదుపాయాన్ని ప్రారంభించిన తర్వాత పంజాబ్ రెవెన్యూ మంత్రి బ్రమ్ శంకర్ జింపా మాట్లాడుతూ, ఇంతకుముందు ఇ-స్టాంపింగ్ సౌకర్యం రూ.20,000 కంటే ఎక్కువ విలువకు మాత్రమే వర్తి౦చేదని గుర్తు చేసారు.
- పంజాబ్ రాష్ట్ర రాజధాని :చండీఘర్
- పంజాబ్ రాష్ట్ర సిఎం : భగవత్ మాన్
- పంజాబ్ రాష్ట్ర గవర్నర్ : బన్వారిలాల్ పురోహిత్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇ-స్టాంపింగ్ సౌకర్యాన్ని ప్రారంబించిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు : పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : మే 03
అంతర్జాతీయ స్ప్రింట్, రిలే కప్ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణ పథకం గెలుచుకున్న జ్యోతికశ్రీ :

అంతర్జాతీయ స్ప్రింట్, రిలే కప్ అథ్లెటిక్స్ పోటీల్లో తెలుగు అమ్మాయి దండి జ్యోతికశ్రీ మెరిసింది. ఇటీవల టర్కీలో జరుగుతున్న ఈ టోర్నీలో జ్యోతికశ్రీ స్వర్ణ పతకంతో సత్తాచాటింది. మహిళల 100 మీటర్ల పరుగును జ్యోతికశ్రీ 53, 17 సెకన్లల్లో ముగించి అగ్రస్థానం సాధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ స్ప్రింట్, రిలే కప్ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణ పథకం గెలుచుకున్న జ్యోతికశ్రీ
ఎవరు : జ్యోతికశ్రీ
ఎక్కడ : మే 03
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |