
Daily Current Affairs in Telugu 03-04-2020
కోవిడ్ -19 కట్టడికి ఐక్యరాజ్యసమితి తొలిసారి తీర్మానం:

కోవిడ్ -19 వైరస్ పై పోరులో సభ్య దేశాలకు సహకారం అందించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది . ఈ మేరకు కోవిడ్- 19 వ్యాధి పై పోరాటానికి ప్రపంచ దేశాల సంఘీభావం అన్న పేరుతో రూపొందించిన తీర్మానాన్ని ఐరాస సర్వ ప్రతినిధి సభ లో ఏప్రిల్ 3న ఆమోదించింది . తీవ్రంగా ప్రాణనష్టం, ఆర్ధిక నష్టం కలిగిస్తున్న కోవిడ్ -19 పై యూఎస్ తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. మహమ్మారి పై పోరులో ఆయా దేశాలకు శాస్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అంతర్జాతీయ సహకారాన్ని ఐరాస అందించనుంది. ఈ తీర్మానం పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇంకా చర్చించాల్సి ఉంది .
క్విక్ రివ్యు :
ఏమిటి : కోవిడ్ -19 కట్టడికి ఐక్యరాజ్యసమితి తొలిసారి తీర్మానం:
ఎవరు : ఐక్యరాజ్యసమితి
ఎప్పుడు : ఏప్రిల్ 03
ప్రపంచానికి 4.1 ట్రీలియన్ డాలర్ల నష్టం : ఏడిబీ:

కోవిడ్ – 19 మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రీలియన్) దాకా నష్టపోవచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడిబీ) పేర్కొంది . గ్లోబల్ జిడిపి లో ఇది 2.3 – 4.8 శాతానికి సమానంగా ఉంటుందని వివరించింది .ఈ మేరకు ఏప్రిల్ 3న ఏషియన్ డెవలప్మెంట్ అవుట్ లుక్ (ఏడివో) నివేదికను విడుదల చేసింది. వర్తమాన ఆసియా దేశాలు కరోనా వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది .
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచానికి 4.1 ట్రీలియన్ డాలర్ల నష్టం : ఏడిబీ
ఎవరు : ఏడిబీ
ఎప్పుడు : ఏప్రిల్ 03
కోవిడ్ – 19 ను ట్రాక్ చేయడానికి GOI ప్రారంబించిన “ ఆరోగ్యా సేతు యాప్ :

“ ఆరోగ్య సేతు “ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక కోవిడ్ -19 ట్రాకింగ్ అనువర్తనం .ఈ యాప్ ద్వారా మన సమీపం లో ఉన్న కరోనా వైరస్ బాధితులను గుర్తించ దానికి అలెర్ట్ ఇస్తుంది దీనిని 11 భాషలలో రూపొందించారు.“ఆరోగ్య సేతు“ అను యాప్ ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారం తో ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ యొక్క జాతీయ ఇ – గవర్నేస్స్ విభాగం అభివృద్ధి చేసింది .
క్విక్ రివ్యు :
ఏమిటి : కోవిడ్ – 19 ను ట్రాక్ చేయడానికి GOI ప్రారంబించిన “ ఆరోగ్యా సేతు యాప్
ఎవరు :భారత ప్రబుత్వం
ఎప్పుడు : ఏప్రిల్ 03
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
DRDO అభివృద్ధి చేసిన బయో సూట్ “ పర్సనల్ ప్రోటేక్తివ్ ఎక్విప్మెంట్ :

డిపెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చే “పర్సనల్ ప్రోటేక్తివ్ఎక్విప్మెంట్“అనే బయో సూట్ ను అభివృద్ధి చేయబడింది .కోవిడ్ –19 ను ఎదుర్కోవడంలో నిమగ్నమైన వైద్య ,పారామెడికల్ మరియు ఇతర సిబ్బందిని ఘోరమైన వైరస్ నుండి సురక్షితం గా ఉంచడానికి DRDO చే బయోసూట్ రూపొందించబడింది. DRDO కూడా పెద్ద సంఖ్యలో బయో సూట్ల ఉత్పత్తి నిర్ధారించడానికి ప్రయత్నిస్తోంది .
క్విక్ రివ్యు :
ఏమిటి : DRDO అభివృద్ధి చేసిన బయో సూట్ “ పర్సనల్ ప్రోటేక్తివ్ ఎక్విప్మెంట్
ఎవరు : DRDO సంస్థ
ఎప్పుడు : ఏప్రిల్ 03
కరోనాతో గ్రామీ అవార్డు గ్రహీత ఆడమ్ ప్లేసింగర్ కన్నుమూత:

ప్రముఖ పాటల రచయిత ,గాయకుడు , గ్రామీ అవార్డు గ్రహీత ఆడమ్ ప్లేసింగర్(52)కరోనా వైరస్ సోకి ఏప్రిల్ 1న కన్నుమూశారు .అమెరికాలోని న్యూయార్క్ సిటి లో 1961, అక్టోబర్ 31 న జన్నించిన .ఆడమ్ 1995 లో “ఫౌంటేన్స్ ఆఫ్ వేన్” అనే రాక్ బ్యాండ్ ను స్థాపించారు .హాంక్స్ చిత్రం ‘ దట్ ధింగ్ యు డు ‘ చిత్రానికి పాటల రచయిత గా పనిచేశారు .ఈ చిత్రం ఆస్కార్ , గోల్డెన్ గ్లోబ్ అవార్డు కు ఎంపికైంది. ఆడమ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు తో పాటు అన్ని ప్రధాన అవార్డు ను సొంతం చేసుకున్నారు. 2009 లో ‘ ఎ కొల్బర్ట్ క్రిస్మస్ ‘కి ఆడమ్ గ్రామీ అవార్డు దక్కించుకున్నారు .
క్విక్ రివ్యు :
ఏమిటి : కరోనాతో గ్రామీ అవార్డు గ్రహీత ఆడమ్ ప్లేసింగర్ మృతి
ఎవరు : ఆడమ్ ప్లేసింగర్
ఎప్పుడు : ఏప్రిల్ 03
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |