
Daily Current Affairs in Telugu 30&31 July -2022
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021ని విడుదల చేసిన నీతి అయోగ్ :

నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్దేరి, సీఈఓ పరమేశ్వరన్, సభ్యుడు వీకే సారస్వత్ 2022, జులై 21న ఢిల్లీలోని నీతి అయోగ్ ప్రధాన కార్యాలయంలో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021ని విడుదల చేశారు. 17 పెద్ద రాష్ట్రాలు, 10 ఈశాన్య హిమాలయ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల పనితీరును వేర్వేరుగా మదింపు చేసి నివేదికను రూపొందించారు ర్యాంకుల కోసం తీసుకున్న కొలమానాలను ఎనేబులర్ విభాగంలో గ్రూప్ గా విభజించారు. వాటిలో ఎనేబుల్స్ విభాగంలో తెలంగాణ 4, ఏపీ 8వ స్థానం సాధించాయి. పెర్ఫార్మర్స్ విభాగంలో తెలంగాణ తొలి స్థానం పొందగా, ఏపీకి 14వ స్థానం దక్కింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో కర్ణాటక ‘వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది. క్రితం సారి నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి రెండో స్థానానికి చేరింది. ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 7 నుంచి 9వ ర్యాంకుకి పడిపోయింది. ఈశాన్య హిమాలయ రాష్ట్రాల విభాగంలో, మణిపూర్, ఉత్తరాఖండ్ల లు వరుసగా తొలిరెండు స్థానాల్లో నిలిచాయి. కేంద్రపాలిత *ప్రాంతాల విభాగంలో చండీగఢ్, ఢిల్లీలు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
- నీతి అయోగ్ స్థాపన : 2015 జనవరి 01
- నీతి అయోగ్ ప్రధాన కార్యాలయం : న్యు డిల్లి
- నీతి అయోగ్ సియివో : పరమేశ్వరన్ అయ్యర్
- నీతి అయోగ్ చైర్మన్ :నరేంద్ర మోడి
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021ని విడుదల చేసిన నీతి అయోగ్
ఎవరు : నీతి అయోగ్
ఎప్పుడు : జులై 30
కామన్ వెల్త్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పసిడి పథకం దక్కించుకున్న జెరెమీ లాల్రినుంగా :

కామన్ వెల్త్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ లో భారత జోరు కొనసాగుతోంది. తాజాగా 19 ఏళ్ల కుర్రాడు జెరెమీ లాల్రినుంగా దేశానికి రెండో పసిడి అందించగా. బింద్యారాణి రజతం సొంతం చేసుకుంది. జులై 31న పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ పూర్తి ఆధిపత్యం చలాయించి ఛాంపియన్ గా నిలిచాడు. మొత్తం 300 కేజీల బరువెత్తి సరికొత్త కామన్వెల్త్ క్రీడల రికార్డునూ సృష్టించాడు. స్నాచ్ లో 140 కేజీలెత్తి యా విభాగంలోనూ కామన్వెల్త్ రికార్డు నెలకొల్చిన అతను. క్లీన్ అండ్ జర్క్ లో ఉత్తమంగా 160 కేజీల ప్రదర్శన చేశాడు. పతక అంచనాలతో బరిలో దిగిన ఈ ఐజ్వాల్ కుర్రాడు స్కాచ్లో తొలి ప్రయత్నంలోనే 136 కేజీలెత్తి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. రెండో ప్రయత్నంలో విజయవంతంగా 140 కేజీ ఎత్తాడు. మూడో ప్రయ త్నంలో (143 కేజీలు) విఫలమైనా అప్పటికే అతను తన సమీప ప్రత్యర్ది కంటే 10 కిలోల ఆధిక్యంలో నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కామన్ వెల్త్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పసిడి పథకం దక్కించుకున్న జెరెమీ లాల్రినుంగా
ఎవరు : జెరెమీ లాల్రినుంగా
ఎక్కడ : బర్మింగ్ హం
ఎప్పుడు : జులై 30
కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ భారత్ ఖాతాలో స్వర్ణ పథకం గెలుచుకున్న అచింత షూలి :

కామన్వెల్త్ క్రీడల వెయిట్ భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషులు 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్ లిఫ్టర్ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పథకాన్ని సొంతం చేసుకున్నాడు. స్నాచ్ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు చేసిన అచింత శూలి ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 110 కేజీలు మూడో ప్రయత్నంలో 113 ఎత్తి గేమ్స్ రికార్డును సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జెర్క్లోనూ తొలి ప్రయత్నంలో 168 ‘కేజీలు’ తేలిగ్గా ఎత్తిన అచింత రెండో చిప్లలో 170 కేజీలు ఎత్తడంలో విఫలనుయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో, 170 కేజీలు రఫ్ చేసి మొత్తం మీద 313 రేజీలతో (క్రీడల రికార్డు) తో పసిడి సొంతం చేసుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ భారత్ ఖాతాలో స్వర్ణ పథకం గెలుచుకున్న అచింత షూలి
ఎవరు : అచింత షూలి
ఎప్పుడు : జులై 31
హంగేరి గ్రాండ్ ఫ్రీ టోర్నీ లో విజేతగా నిలిచిన రెడ్ బుల్ జట్టు డ్రైవర్ వెర్స్ స్టాపెన్ :

ఏడాది ఫార్ములావన్ సీజన్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్ బుల్ జట్టు డ్రైవర్: మాక్స్ వెర్పెన్ ఎనిమిదో విజయం నమోదు చేశాడు. బుడాపెస్ట్ లో జులై 31న జరిగిన హంగేరి గ్రాండ్ లో వెర్స్ స్టాపెన్ విజేతగా నిలిచాడు. 70 ల్యాప్ ల రేసును వెర్స్ స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 39 నిమిషాల 35,912 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో ‘పోల్ పొజిషన్లో రేసును ఆరంభించిన ( జార్జి రసెల్ మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : హంగేరి గ్రాండ్ ఫ్రీ టోర్నీ లో విజేతగా నిలిచిన రెడ్ బుల్ జట్టు డ్రైవర్ వెర్స్ స్టాపెన్
ఎవరు : రెడ్ బుల్ జట్టు డ్రైవర్ వెర్స్ స్టాపెన్
ఎప్పుడు : జులై 31
రోబో టీచర్ ను ప్రవేశపెట్టిన ఇండస్ ఇంటర్ నేషనల్ స్కూల్ :

స్కూల్ లో రోబో టీచర్ ను ప్రవేశపెట్టామని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈగల్ రోబోల గురించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఉన్న మూడు విద్యా కేంద్రాల్లోనూ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రోబోలను రంగంలోకి దింపింది. ఐదు నుంచి 11వ క్లాసులకు ఈ రోబోలు పాఠాలు కూడా చెబుతాయి. 30కు పైగా భాషల్లో పాఠాలు చెప్పగలవు ఈ రోబోలు. అంతేకాదు విద్యార్థులకు వచ్చే డౌట్స్ ని కూడా చక్కగా క్లియర్ చేయగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్ టాప్ ల నుంచి యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : రోబో టీచర్ ను ప్రవేశపెట్టిన ఇండస్ ఇంటర్ నేషనల్ స్కూల్
ఎవరు : ఇండస్ ఇంటర్ నేషనల్ స్కూల్
ఎప్పుడు : జులై 30
వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో రజత పథకం గెలుచుకున్న డాక్టర్ కాశ్మీర్ సింగ్ :

71 ఏళ్ల రిటైర్డ్ మాజీ ఇండియన్ పోలిస్ సర్విస్ అధికారి డాక్టర్ కాశ్మీర్ సింగ్ గోల్ఫ్ లో రజత పతకాన్ని గెలుచుకోవడం ద్వారా ప్రస్తుతం కొనసాగుతున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ (డబ్ల్యుపిఎఫ్) లో భారతదేశానికి కీర్తిని అందించారు. ఈ గేమ్ లో యాక్టివ్ మరియు రిటైర్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ మరియు ఫైర్ సర్వీస్ సిబ్బందికి అందుబాటులో ఉంటాయి. 10,000 మంది పాల్గొనేవారితో, ఇది వేసవి ఒలింపిక్స్ తర్వాత నిర్వహించిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పోటీ. గతంలో, ASI పర్వేష్ తోమర్ నెదర్లాండ్ లోని రోటర్మ్ జరిగిన అవడల్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో బంగారు మరియు కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు..
క్విక్ రివ్యు :
ఏమిటి : వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో రజత పథకం గెలుచుకున్న డాక్టర్ కాశ్మీర్ సింగ్
ఎవరు : డాక్టర్ కాశ్మీర్ సింగ్
ఎప్పుడు : జులై 30
100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడి :

రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ‘ఉజ్వల భారత్ – ఉజ్వల భవిష్యత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగం సులను ఉద్దేశించి ఆయన వర్చువల్ వేదికగా ప్రసంగించారు.
- రామగుండం ఎన్టీపీసీ జలాశయం గల రాష్ట్రము : తెలంగాణా
- తెలంగాణా రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం : కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి : 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడి
ఎవరు : ప్రధాని నరేంద్ర మోడి
ఎక్కడ : తెలంగాణా
ఎప్పుడు : జులై 31
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు‘ ఫిడెల్ వలైజ్ రామోస్ కన్నుమూత :

ఫిలిప్పీన్స్ దేశ మాజీ అధ్యక్షుడు’ ఫిడెల్ వలైజ్ రామోస్ (94) జులై 31న కన్నుమూశారు. సైన్యంలో సేవలందించిన ఆయన తొలత కొరియా ‘యుద్ధంలో వియత్నాం యుద్ధంలో పాల్గొన్నారు. 1986లో ఫిలిప్పీన్స్ నియంత పాలనను అంతం చేసే ప్రజాస్వామ్మ అనుకూల ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 19192-98 మధ్య ఫిలిప్పీన్స్ అధ్యక్షునిగా వ్యవహరించి, అనేక సంస్కరణలు తీసుకువచ్చారు..
- ఫైలిఫ్ఫిన్స్ దేశ రాజధాని : మనీల
- ఫైలిఫ్ఫిన్స్ దేశ కరెన్సీ : ఫిలిప్పిన్ పేసో
- ఫైలిఫ్ఫిన్స్ దేశ అద్యక్షుడు ; బోంగ్ బోంగ్ మార్కస్
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు’ ఫిడెల్ వలైజ్ రామోస్ కన్నుమూత
ఎవరు : ఫిడెల్ వలైజ్ రామోస్
ఎక్కడ : : ఫిలిప్పీన్స్ దేశం
ఎప్పుడు : జులై 30
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |