Daily Current Affairs in Telugu 30 November – 2022
2023 జి -20 ఆర్ధిక మంత్రలు సమావేశానికి ఆతిద్యం ఇవ్వనున్న బెంగళూర్ నగరం :

ఫిబ్రవరి 2023 జి-20 ఆర్ధిక మంత్రలు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ల సమావేశాన్ని బెంగళూర్ నగరం నిర్వహించినట్లు భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సితారామన్ గారు ప్రకటించారు. బెంగళూర్ లో జరిగిన వనానం స్టార్టప్ ఇంక్లుజివీటి సమ్మిట్ లో ఆమె ప్రకటన చేసారు.సందర్శించే అంతర్జాతీయ అతిథుల వారి ప్రొఫైల్ ను ప్రదర్శించడానికి ఈ ఈవెంట్ ను ఉపయోగించుకోవాలని ఆమె స్టార్టప్ లను ప్రోత్సహించింది. 2023 జి-20 సంబంధిత సమావేశాలను నిర్వహించేందుకు భారతదేశంలో ని వివిధ నగరాలను ఎంపిక చేయబడ్డాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2023 జి -20 ఆర్ధిక మంత్రలు సమావేశానికి ఆతిద్యం ఇవ్వనున్న బెంగళూర్ నగరం
ఎవరు : బెంగళూర్ నగరం
ఎక్కడ: కర్ణాటక
ఎప్పుడు : నవంబర్ 30
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలి మహిళా రిఫరీగారికార్డ్ సృష్టించిన స్టీఫాని ప్రాపార్ట్ :

ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలి మహిళా రిఫరీగా స్టీఫాని ప్రాపార్ట్ (ఫ్రాన్స్) రికార్డు సృష్టించబోతోంది. నవంబర్ 30 లో జర్మనీ-కోస్టారికా మ్యాచ్ కు ఆమె రిఫరీగా బాధ్యతలు నిర్వచనుంది. గతంలో 2019 మహిళల ప్రపంచకప్ ఫైనల్, ఈసారి పురుషుల ప్రపంచకప్ క్వాలిఫయింగ్మ్యాచ్ లో , చాంపియన్స్ లీగ్, 2022 ఫ్రెంచ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఈ 38 ఏళ్ల ప్రాపార్ట్ రిఫరీగా బాధ్యతలు చేపట్టింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలి మహిళా రిఫరీగారికార్డ్ సృష్టించిన స్టీఫాని ప్రాపార్ట్
ఎవరు : స్టీఫాని ప్రాపార్ట్
ఎప్పుడు : నవంబర్ 30
ఎల్ఈడీ బల్బుల కాంతి నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు దోహదపడే నూతన పరికరాన్ని ఆవిష్కరించిన ఐఐటి మండి శాస్త్రవేత్తలు :

ఇళ్లలో సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బుల కాంత్ నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు దోహదపడే సరికొత్త పరికరాన్ని ఐఐటీ-మండీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు ప్రస్తుతం బ్యాటరీల ఆధారంగానే పనిచేస్తున్నాయి. జీవితకాలం ముగిసిన బ్యాటరీ లతో పర్యావరణానికి హాని కలుగుతుండ ఐఐటీ పరిశోధకులు దృష్టి సారించారు. బల్బులు వంటి కృత్రిమ వనరుల నుంచి కాంతిని గ్రహించి, విద్యుత్ ను ఉత్పత్తి చేసేలా ‘దిన్-ఫిల్మ్ ఎపీషియంట్ ఫొటోవోల్టాయిక్ సెల్స్’ను రూపొందించారు. వీటితో సెన్సర్లు, వైఫై రూటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్లు వంటి ఐవోటీ పరికరాలు సమర్ధంగా పనిచేస్తా.యని పరిశోధకులు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, యూనివ ర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయం నిపుణులు కూడా ఈ పరి శోధనలో పాలుపంచుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎల్ఈడీ బల్బుల కాంతి నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు దోహదపడే నూతన పరికరాన్ని ఆవిష్కరించిన ఐఐటి మండి శాస్త్రవేత్తలు
ఎవరు : ఐఐటి మండి శాస్త్రవేత్తలు
ఎప్పుడు : నవంబర్ 30
సూపర్ స్టార్స్ ఆఫ్ ‘స్టెమ్’ అవార్డ్ కు ఎంపికైన భారత సంతతి శాస్త్రవేత్తలు :

ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక సూపర్ స్టార్స్ ఆఫ్ ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమేటిక్స్) అవార్డుకు ఈ ఏడాది ఎంపికైన 60 మంది శాస్త్రవేత్తల్లో భార తీయ మూలాలున్న నీలిమా కడియాల, డాక్టర్ అనా బాబూరమణి, డాక్టర్ ఇంద్రాణి ముఖర్జీ చోటు సాధించారు. శాస్త్రవేత్తల గురించి సమా జంలో ఉన్న లింగ ఆధారిత అంచనాలను తుడిచిపెట్టడమే కాకుండా మహిళలు, హిజ్రాలకు మరింత అభివృద్ధి అవకాశాలను కల్పించడమే ఈ అవార్డుల లక్ష్యమని నవంబర్ 30న మీడియాకు విడు అనా బాబూరము లక్షకు, పైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ప్రతినిదు లుగా ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్ట్రేలియా (ఎన్డీఏ) ఏటా ఇలా 60 మంది ప్రతిభావంతు లను గుర్తించి ప్రోత్సహిస్తోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : సూపర్ స్టార్స్ ఆఫ్ ‘స్టెమ్’ అవార్డ్ కు ఎంపికైన భారత సంతతి శాస్త్రవేత్తలు
ఎవరు : నీలిమా కడియాల, డాక్టర్ అనా బాబూరమణి, డాక్టర్ ఇంద్రాణి ముఖర్జీ
ఎప్పుడు : నవంబర్ 30
స్వలింగ సంపర్కుల వివాహాలకు ఆమోద౦ తెలిపిన అమెరికా సెనేట్ :

అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలను రక్షించేందుకు ద్వైపాక్షిక చట్టానికి నవంబర్ 30న సెనెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఇలాంటి వివాహాలకు 2015లో చట్టబద్ధత కల్పించాక ఒక్కటైన వేల మందికి సెనెట్ నిర్ణయంతో ఊరట లభించింది. స్వలింగ, విజాతీయుల మధ్య పెళ్లిళ్లను ఫెడరల్ చట్టంలో పొందుపరిచేందుకు సంబంధించిన ఈ బిల్లుకు సెనెట్ 61 ఓట్లతో మద్దతు లభించింది. 12 మంది రిపబ్లికన్లు కూడా సమర్ధించారు. బిల్లుపై సెనెట్ మెజారిటీ నాయకుడు చక్షూమర్ మాట్లాడుతూ చాలాకాలంగా చర్చల్లో ఉన్న బిల్లును ఆమోదించడం కొంత కష్టమైనా అమెరికాకు సంబంధించిన సమానత్వపు కవాతులో గొప్ప ముందడుగని అన్నారు. బిల్లు తుది ఆమోదానికి హౌస్ కు వెళ్లనుంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ ‘బిల్లును హౌస్ ఆమోదిస్తే నేను తప్పకుండా, సగౌరవంగా సంతకం చేస్తా. తాము కూడా సంతోషకరమైన సంపూర్ణ జీవితాలను కొనసాగించవచ్చని, కుటుంబాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఎల్వీబీటీక్యూ యువతకు ఈ బిల్లు దైర్యాన్ని కల్పిస్తుంది’ అని ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : స్వలింగ సంపర్కుల వివాహాలకు ఆమోద౦ తెలిపిన అమెరికా సెనేట్
ఎవరు : అమెరికా సెనేట్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు : నవంబర్ 30
చైనా దేశ మాజీ అద్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత :

కమ్యూనిస్టు చైనాను ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిపధంలో పరుగులు పెట్టించిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (96) కన్నుమూశారు. లుకేమియా, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షాంఘైలో బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అధికార వార్తా సంస్థ జినువా వెల్లడిస్తూ కమ్యూనిస్టు పార్టీ, పార్లమెంటు, మంత్రివర్గం, సైన్యం జారీ చేసిన లేఖను కూడా ప్రచురించింది. “పార్టీకి, సైన్యానికి, చైనా, జాతికి జెమిన్ మరణం తీరని లోటు. ఆయన మృతి మాకు తీవ్ర వేదన మిగిల్చింది. జెమిన్ మంచి వ్యూహకర్త, గొప్ప దౌత్యవేత్త. పార్టీ అత్యున్నత నాయకుడ’ని పేర్కొంది
క్విక్ రివ్యు :
ఏమిటి : చైనా దేశ మాజీ అద్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత
ఎవరు : జియాంగ్ జెమిన్
ఎక్కడ:చైనా
ఎప్పుడు : నవంబర్ 30
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |