
Daily Current Affairs in Telugu 30-09-2020
కువైట్ దేశ కొత్త పాలకుడిగా షేక్ నవాఫ్ ప్రమాణస్వీకారం :

కువైట్ దేశ కొత్త పాలకుడిగా షేక్ నవఫ్ అల్ అహ్మద్ సబహ్ (83) సెప్టెంబర్ 30 న ప్రమాణ స్వీకారం చేసారు.ఇప్పటి నుంచి కువైట్ పాలకుడిగా ఉన్న షేక్ సబహ్ అనారోగ్యం కారణంగా మృతి చెందడం తో అయన మారు సోదరుడైన షేక్ నవాఫ్ పరిపాలన బాద్యతలు చేపట్టారు.షేక్ సబహ్ మృతికి నివాళిగా దేశంలో నలబై రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు
క్విక్ రివ్యు :
ఏమిటి: కువైట్ దేశ కొత్త పాలకుడిగా షేక్ నవాఫ్ ప్రమాణస్వీకారం
ఎవరు: షేక్ నవాఫ్
ఎక్కడ: కువైట్
ఎప్పుడు: సెప్టెంబర్ 30
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాన్ని వియవంత౦గా పూర్తి చేసిన భారత్ :

దేశీయంగా నవీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారత్ విజయవంతగా పరీక్షించింది. ఓడిషలో ని చాందిపూర్ లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటిఆర్) 3 నుంచి సెప్టెంబర్ 30 దీన్ని ప్రయోగించారు.దేశీయంగా తయారైన బూస్టర్ ఎయిర్ ఫ్రేం విభాగం ఉప వ్యవస్థలు వ నటి అనేక కొత్త ఫీచర్లను ఇందులో చేర్చారు.ఉపరితలం నుంచి ఉపరితలం దూసుకెళ్ళే బ్రహ్మోస్ క్షిపణి (ఎల్ఎసిఎం) 400 కిలో మీటర్ల దూరంలో ని లక్ష్యాన్ని విజయవంతగా చేధించింది.శబ్దం కంటే మూడు రేల్టు ఎక్కువగా గంటకు 3,457 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.అత్మనిర్బార్ భారత్ సాకారం లో ఇది కీలక ఘట్ట౦.అని రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ (డిఆర్డివో)ఒక ప్రకటనలో తెలిపింది.తొలి బ్రహ్మోస్ క్షిపణి 290కిమీ దూరంలో లక్ష్యాన్ని చేదించ గా తాజా క్షిపణి 400 కిమీ దూరం ప్రయాణించడం విశేషం.ప్రపంచంలో నే అత్యంత వేగంగా దూసుకెళ్ళే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రమ్హోస్ కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాన్ని వియవంత౦గా పూర్తి చేసిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ:ఓడిషలో ని చాందిపూర్ లో ఉ
ఎప్పుడు: సెప్టెంబర్ 30
ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టనున్న శుక్రయాన్ -1ప్రాజెక్టు లో భాగం కానున్న ఫ్రాన్స్ :

భారత అంతరిక్ష పరోశోదన సంస్థ (ఇస్రో) ప్రతిస్తాత్మక౦గా తలపెత్తనున్న శుక్రయన్ -1 ప్రాజెక్టులో తాము పాలు పంచుకోనున్నట్లు ఫ్రాన్స్ దేశం ప్రకటించింది.2025 లో ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తుందని కూడా తెలిపింది.రష్యా ఫెడరల్ అంతరిక్ష సంస్థతో కలిసి తాము అబివృద్ది చేసిన వీనస్ ఇన్ఫ్రారేడ్ అత్మాస్పియర్ గ్యానేస్ లింకర్ (విరాల్)పరికరం శుక్రయన్ -1 ప్రాజెక్టు కు ఎంపిక అయిందని ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోదన సంస్థ (సిఎన్ ఈఎస్) సెప్టెంబర్ 30 న వెల్లడించింది.ఖగోళ అన్వేషణ కోసం భారత్ చేపట్టే ప్రాజెక్టులో ఫ్రెంచ్ పేలోడ్ ను పంపించడం ఇదే తొలి సారి అవుతుందని పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టనున్న శుక్రయాన్ -1ప్రాజెక్టు లో భాగం కానున్న ఫ్రాన్స్
ఎవరు: ఫ్రాన్స్
ఎప్పుడు: సెప్టెంబర్ 30
వరుసగా తోమ్మిదోసారి భారత్ లో అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా నిలిచిన ముకేష్ అంబానీ :

అత్యంత సంపంన్ భారతీయుల లో అపర కుబెరుదిగా ముకేష్ అంబానీ వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.ఏడాది వ్యవధిలో అయన సంపాదన ఏకంగా 73శాతం పెరిగి రూ 6.58 లక్షల కోట్లు చేరుకుంది. రెండో స్థానంలో ఉన్న హిందుజా సంపద రూ.1.43 లక్షల కోట్లు ఉందని టెలికాం రిటైల్ విభాగాలలో వాటాలు విక్రయించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పెరిగిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో సైతం బారీ లాభాలు పొందిన తొలి అయిదు షేర్లలో నిలిచిందని ఐఐఎఫ్ఎల్ వెల్త్ తో కలిసి హారూన్ రూపొందించిన నివేదిక స్పష్టం చేసింది. ఆర్ధిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాల మద్య విడుదలైన ఈ జాబితా ఆగస్ట్ 31నాటికీ రూ 1000 కోట్ల కంటే ఎక్కువ నికర సంపద గల 828 మంది భారతీయులను గుర్తించింది. తెలుగు రాష్ట్రాలలో అగ్రస్తానం లో రూ 49.200 కోట్ల నికర సంపదతో మురళి దీవి కుటుంబం అగ్ర స్థానం లోనిలిచింది.వీరి సంపద 89 శాతం పెరగడం గమనార్హం .ఎపి తెలంగాణా జాబితాలో అందరి సంపద గతేడాది పోలిస్తే 34శాతం పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో నుంచి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా పారిశ్రామిక వేత్త మహిమ దాట్ల (రూ.4700 కోట్లు ) కావడం గమనార్హం .
క్విక్ రివ్యు :
ఏమిటి: వరుసగా తోమ్మిదోసారి భారత్ లో అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా అంబానీ
ఎవరు: అంబానీ
ఎప్పుడు: సెప్టెంబర్ 30
అంతర్జాతీయ అనువాద దినోత్సవం గా సెప్టెంబర్ 30:

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవంగా జరుపుకుంటారు.సంబాషణ మరియు వారి మద్య అవగాహనా మ ను సహకారన్ని సులబాతరం చేయడంలో చేసే భాషా అనువాద నిపుణుల యొక్క పనిని గుర్హ్టించే లక్షంతో దీనిని జరుపుకోవడం జరుగుతుంది.ఈ విధంగా అబివృద్ది కి తోడ్పడటం మరియు ప్రపంచ శాంతి కి మరియు వారి రక్షణ ను బలోపేతం చేయడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ అనువాద దినోత్సవం గా సెప్టెంబర్ 30
ఎక్కడ: సెప్టెంబర్ 30
ఎప్పుడు: సెప్టెంబర్ 30
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |