Daily Current Affairs in Telugu 29 July -2022
కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న ఇంగ్లాండ్ దేశం :

కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణ పతకాన్ని అతిథ్య ఇంగ్లాండ్ దేశం కైవసం చేసుకుంది. ‘జులై 29న పురుషుల ట్రయథ్లాన్ లో ఆ దేశ అథ్లెట్ అలెక్స్ విజేతగా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ లో రజతం గెలిచిన అతడు. ఈ రేసులో ఒక దశలో 16 సెకన్లు వెనకబడ్డాడు హేడెన్ విల్ (న్యూజిలాండ్) అధిక్యంలోకి వెళ్లాడు కానీ విల్ కు పెనాల్టీ పడడంతో దూసుకొచ్చిన ఆలెక్స్ అందరి కంటే ముందు ఫినిషింగ్ లైను దాటాడు. హేడెన్ విల్ రజతంతో సరిపెట్టుకోగా న్యూజిలాండ్ చెందిన మాథ్యూ హసర్ కాంస్యం దక్కించుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న ఇంగ్లాండ్ దేశం
ఎవరు : ఇంగ్లాండ్ దేశం
ఎప్పుడు : జులై 29
ఇంగ్లిష్ ఛానెల్ ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్ గా నిలిచిన ఎం తులసి :

‘ఇంగ్లిష్ ఛానెల్ ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్గా విజయవాడకు చెందిన 34 ఏళ్ల పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఎం. తులసీ చైతన్య రికార్డు నెలకొల్పారు. ఇంగ్లండ్ లోని డోవెర్ నుంచి ప్రాన్స్ లో ని కర్రీస్ వరకు గల 21 మైళ్ల ఇంగ్లీష్ చానెల్ ను ఈ నెల 28న 15 గంటల 18 నిమిషాల వ్యవధిలో ఈదారు. వాతావరణ మార్పులతో పాటు జెల్లీ చేపలు, పార్క్ ల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని తులసీ చైతన్య తెలిపారు. ఈ ఛానెల్ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్ గా నిలవడం ఆనందంగా ఉందన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘ఇంగ్లిష్ ఛానెల్ ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్ గా నిలిచిన ఎం తులసి
ఎవరు : ఎం తులసి
ఎప్పుడు : జులై 29
లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2022 ను గెలుచుకున్న డి.ఆర్.డి వో ప్రముఖ శాస్త్రవేత టేస్సి థామస్ :

డీఆర్ డీఓ ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్ కు లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు (2022)ను అందజే యనున్నారు. జులై 29న పుణెలో జరిగే కార్యక్రమంలో దీనిని ప్రదానం చేస్తారు. లోకమాన్య ‘తిలక్ స్మారక ట్రస్టు ఏటా ఈ అవార్డును ఇస్తోంది. స్వదేశీ సిద్ధాంతాన్ని వ్యాప్తిచేయడంలో కృషిచేసినందుకుగాను టెస్సీ థామస్ ను ఈ పురస్కారానికి ఎంపికచేసినట్లు ట్రస్టు అధ్యక్ష, ఉపాధ్యక్షులు దీపక్ తిలక్, రోహిత్ తిలక్ జులై 29న ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2022 ను గెలుచుకున్న డి.ఆర్.డి వో ప్రముఖ శాస్త్రవేత టేస్సి థామస్
ఎవరు : టేస్సి థామస్
ఎప్పుడు : జులై 29
సర్ విన్ స్టన్ చర్చిల్ లీడర్ షిప్ అవార్డును గెలుచుకున్న బోరిస్ జాన్సన్, వోలోడిమిర్ జేలెన్ స్కి :

బ్రిటన్ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి గ ఉన్న బోరిస్ జాన్సన్ కు, మరియు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జేలెన్ స్కి కి సర్ విన్ స్టన్ చర్చిల్ లీడర్ షిప్ అవార్డును అందించారు. చర్చిల్ లీడర్షిప్ అవార్డును మొదటిసారిగా 2006లో అందించారు. గతంలో ఈ అవార్డు అందుకున్న వారిలో ప్రిన్స్ చార్లెస్, బ్రిటీష్ మాజీ ప్రధానులు మార్గరెట్ థాచర్ మరియు జాన్ మేజర్ మరియు మాజీ IIS సెక్రటరీ ఆఫ్ స్టేట్ మడేలీస్ ఆలైట్ ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సర్ విన్ స్టన్ చర్చిల్ లీడర్ షిప్ అవార్డును గెలుచుకున్న బోరిస్ జాన్సన్, వోలోడిమిర్ జేలెన్ స్కి
ఎవరు : బోరిస్ జాన్సన్, వోలోడిమిర్ జేలెన్ స్కి
ఎప్పుడు : జులై 29
బంగ్లాదేశ్ దేశంలో తదుపరి భారత హైకమిషనర్ గా ప్రణయ్ కుమార్ నియమాకం :

ప్రస్తుతం సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంలో భారత రాయబారిగా ఉన్న ప్రణయ్ కుమార్ వర్మ గారు బంగ్లాదేశ్ దేశంలో తదుపరి భారత హైకమిషనర్గా నియమితులయ్యారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనవిడుదల చేసింది.ప్రణయ్ వర్మ 1994లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో చేరారు మరియు హాంకాంగ్, శాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్, ఖాట్మండు మరియు వాషింగ్టన్ DCలలో దౌత్యపరమైన విధులు నిర్వహించారు.
- బంగ్లాదేశ్ రాజధాని : డాకా
- బంగ్లా దేశ కరెన్సీ :టకా
- బంగ్లా దేశ్ అద్యక్షుడు : మహమ్మద్ అబ్దుల్ వాహిద్
- బంగ్లాదేశ్ ప్రధాని : షేక్ హసీన
క్విక్ రివ్యు :
ఏమిటి : బంగ్లాదేశ్ దేశంలో తదుపరి భారత హైకమిషనర్ గా ప్రణయ్ కుమార్ నియమాకం
ఎవరు : ప్రణయ్ కుమార్
ఎక్కడ: బంగ్లాదేశ్ దేశంలో
ఎప్పుడు : జులై 29
ఆంధ్రప్రదేశ్ లో ని కొవ్వాడ వద్ద అణువిద్యుత్ కేంద్రం ఆమోదం తెలిపిన కేంద్రం :

ఆంధ్రప్రదేశ్లోని కొవ్వాడ వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సహాయమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.కొవ్వాడలో 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను జైత్పూర్, గుజరాత్లోని ఛాయ, మిథి విరి, పశ్చిమ బెంగాల్ లోని హరిపూర్, మధ్య ప్రదేశ్లోని భీమ్గ్పూర్ లో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వివరించారు. కొవ్వారలో 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశంలో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పాదన కోసం కర్ణాటక, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 10 అణు రియాక్టర్లులను నెలకొల్పేందుకు ప్రభు పాలనాపరమైన ఆమోదం తెలిపారు.
- : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం : వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వా భూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ లో ని కొవ్వాడ వద్ద అణువిద్యుత్ కేంద్రం ఆమోదం తెలిపిన కేంద్రం
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్ లో
ఎప్పుడు : జులై 29
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |