Daily Current Affairs in Telugu 28&29 August-2022
ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టెక్నాలజీ హబ్ లో రెండో స్థాన౦నిలిచిన బెంగళూర్ :

ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టెక్నాలజీ హబ్ లో బెంగళూరు రెండో స్థానాన్ని సాధించింది. ప్రపంచంలో బీజింగ్ తర్వాత మన దేశంలోని, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, దిల్లీ ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. స్థిరాస్తి సేవల సంస్థ కుష్మన్ అండ్ వేర్ షీల్డ్ విడుదల చేసిన ‘టెక్ సిటీస్ గ్లోబల్ ఇంటర్సెక్షన్ ‘లవ్ టాలెంట్ అండ్ రియల్ ఎస్టేట్ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. దాదాపు 11 అంశా లను పరిగణనలోకి తీసుకుని, ఈ జాబితాను రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ఎనిమిది నైపుణ్యాలు, స్థిరాస్తి, వ్యాపార నిర్వహణ పరిస్థితుల వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బెంగళూరులో 2,110813 కొత్త చిరు ఉద్యోగాలు చెన్నైలో 112,781, హైదరాబాద్ లో 1,00,6312 డిల్లీలో 89,997 ఉద్యోగాలు వచ్చినట్లు వెల్లడించింది. భారత వృద్ధిలో ఐటీ, టెక్నాలజీ ఆధారిత రంగాలు కీలకంగా మారాయని ఇండియా, ఆగ్నేయాసియా మేనేజింగ్ డైరెక్టర్ అనూల్ వైన్ తెలిపారు. 2017-21 మధ్య దేశంలోని మొత్తం కార్యాలయ స్థలం ఆన్లైలో బెంగళూరు నాటా 5-10 శాతం వరకు ఉందన్నారు. నగరంలో ఏట్రా అద్దెకు తీసువనే కార్యాలయాల్లో సగటు వాటా 38-10 ఉంటోందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టెక్నాలజీ హబ్ లో రెండో స్థాన౦నిలిచిన బెంగళూర్
ఎవరు : బెంగళూర్
ఎప్పుడు : ఆగస్ట్ 28
యూజీసీ వైస్ చైర్మన్ గా దీపక్ కుమార్ శ్రీవాస్తవ నియామకం :

యూజీసీ వైస్ చైర్మన్ గా దీపక్ కుమార్ శ్రీవాస్తవను నియమిస్తూ ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఉత్త ర్వులు జారీచేసింది. ఈయన ప్రస్తుతం ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ స్టడీస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.తాజగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : యూజీసీ వైస్ చైర్మన్ గా దీపక్ కుమార్ శ్రీవాస్తవ నియామకం
ఎవరు : దీపక్ కుమార్ శ్రీవాస్తవ
ఎప్పుడు : ఆగస్ట్ 28
కెనడాలోని అంటారియా ప్రాంతం మార్కమ్ నగరంలో వీధికి ఎ.ఆర్. రెహమాన్ నామకరణం :

కెనడాలోని అంటారియా ప్రాంతం మార్కమ్ నగరంలో ఓ వీధికి తన పేరును పెట్టడ డంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్. రెహమాన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు లభించిన అరు దైన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన ట్వీటర్లో స్పందించారు. ఎన్నడూ ఊహించలేదు. మార్కమ్ మేయరు, ఆ నగర కౌన్సిలర్లకు, భారత కాన్సులేట్ జనరలకు, కెనడా ప్రజలకు కృతజ్ఞతాభినందనాలు’ అని రెహమాన్ ట్వీట్లో పేర్కొన్నారు. తన సంగీత స్వరాలను ఆదరించి ప్రోత్సహిస్తున్న భారతీయ సోదర, సోదరీమణులకూ కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఏ.ఆర్. రెహమాన్ ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్నారు
- కెనడా దేశ రాజధాని : ఒట్టావా
- కెనడా దేశ కరెన్సీ : కెనడియన్ డాలర్
- కెనడా దేశ అద్యక్షుడు :జస్టిస్ ట్రూడో
క్విక్ రివ్యు :
ఏమిటి : కెనడాలోని అంటారియా ప్రాంతం మార్కమ్ నగరంలో వీధికి ఎ.ఆర్. రెహమాన్ నామకరణం
ఎవరు : ఎ.ఆర్. రెహమాన్
ఎక్కడ: కెనడా
ఎప్పుడు : ఆగస్ట్ 28
దేశవ్యాప్తంగా బలవన్మరణాల సంఖ్యపరంగా మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర :

బలవన్మరణాల సంఖ్యపరంగా దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా నివేదికలో పలు విషయాలను ప్రస్తావించింది. 2021 ఏడాదిలో దేశవ్యాప్తంగాసు 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వృత్తి సమస్యలు, ఒంటరితనం, హింస, కుటుంది. మానసిక సమస్యలు, మద్యానికి బానిస కావడం. కుంగుబాటు, అనారోగ్యం ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని నేర గణాంకాల బ్యూరో తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22. 207 మంది. కర్ణాటకలో 13,056 మంది సూసైడ్ చేసుకున్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో సగానికిపైగా సూసైడ్ ను మహారాష్ట్ర తమిళనాడు. మధ్యప్రదేశ్ పశ్చిమబెంగాల్, కర్ణాటకలోనే జరిగాయి. 53 నగరాల్లో మొత్తంగా 25 వేలకు పైగా సూసైడ్ చేసుకున్నారు.
- మహారాష్ట్ర రాజధాని : ముంబాయ్
- మహారాష్ట్ర సిఎం : ఎక్ నాద్ షిండే
- మహారాష్ట్ర గవర్నర్ : భగత్ సింగ్ కోష్యరి
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశవ్యాప్తంగా బలవన్మరణాల సంఖ్యపరంగా మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర
ఎవరు : మహారాష్ట్ర
ఎక్కడ: దేశంలోనే
ఎప్పుడు : ఆగస్ట్ 28
భారతదేశంలో మరో అధునాతన ఆలయం నిర్మించనున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రము :

ఆధ్యాత్మికానికి పేరుగాంచిన భారతదేశంలో మరో అధునా తన ఆలయం అందుబాటులోకి రానున్నది. పశ్చిమబెంగాల్లోని మాయాపూర్లో నిర్మి స్తున్న ‘వేదిక్ ప్లానిటోరియం’ ఆలయాన్ని వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయం అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోనే మతపరమైన అతి పెద్ద ఆలయంగా చరిత్రలో నిలిపోనున్నది. ఇప్పటి వరకు ఈ రికార్డు కాంబోడియాలోని అంగ్ కోర్ వాట్ ఆలయం పేరిట ఉన్నది. ఇస్కాన్ ప్రధాన కార్యాలయం కూడా వేదిక్ ప్లానిటోరియంలోనే ఉండనున్నది. వాస్తవానికి ఈ అలయాన్ని 2022లోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు.
- పశ్చిం బెంగాల్ రాష్ట్ర రాజధాని : కోల్ కతా
- పశ్చిం బెంగాల్ రాష్ట్ర సిఎం : మమతా బెనర్జీ
- పశ్చిం బెంగాల్ రాష్ట్ర గవర్నర్ :
క్విక్ రివ్యు :
ఏమిటి : భారతదేశంలో మరో అధునాతన ఆలయం నిర్మించనున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రము
ఎవరు : పశ్చిమ బెంగాల్ రాష్ట్రము
ఎక్కడ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రములో
ఎప్పుడు : ఆగస్ట్ 28
అత్యాధునిక బాక్సింగ్ విశ్లేషణ సాఫ్ట్ వెర్ ను ప్రారంబించిన మద్రాస్ ఐఐటి పరిశోధకులు :

దేశంలో ప్రతిభావంతులైన బాక్సర్లే ఉన్న ఇప్పటివరకు ఒలింపిక్స్ లో భారత్ తక్కువ బాక్సింగ్ -పతకాలే గెలిచింది. ఈ నేపథ్యంలో 2024 ఒలింపిక్స్ బాక్సింగ్ లో భారత్ పతకాలు పెంచేందుకు మద్రాస్ ఐఐటీ పరిశోధకులు. బళ్లారిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఐఐఎస్)తో కలిసి అత్యాధునిక బాక్సింగ్ విశ్లేషణ సాఫ్ట్ వెర్ ను రూపొందిస్తున్నారు. కాగా దీని పేరు స్కార్బాక్సర్, బాక్సర్ల ప్రదర్శనపై విశ్లేషణ అందించేంచుకు సెన్సర్లు, వీడియో కెమెరాలను ఉపయోగించుకుంటుంది. బాక్సింగ్ రింగ్ లో వీడియో కెమెరాలను అమరుస్తారు. బాక్సర్ల కదలికలను రికార్డు చేసి విశ్లేషిస్తారు. బాక్సర్ల పంచ్ ల సంఖ్యను, నాణ్యతను, పోటీలో ఎంత ఆధిపత్యాన్ని ప్రదరిస్తున్నారు అన్న దాన్ని అంచనా వేస్తారు. బాక్సర్లు తమ ఆటను మెరుగుపర్చుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అత్యాధునిక బాక్సింగ్ విశ్లేషణ సాఫ్ట్ వెర్ ను ప్రారంబించిన మద్రాస్ ఐఐటి పరిశోధకులు
ఎవరు : మద్రాస్ ఐఐటి పరిశోధకులు
ఎప్పుడు : ఆగస్ట్ 28
గుజరాత్ లో స్మృతి వాన్ మెమోరియల్ ను ప్రారంబించిన ప్రధాని నరేంద్ర మోడి :

గుజరాత్ లో స్మృతి వన్ మెమోరియల్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇది భారతదేశపు మొదటి భూకంప స్మారక చిహ్నం. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో . 2001లో భుజ్ లో సంభవించిన భూకంపం కారణంగా 13,000 మంది మరణించిన తర్వాత, స్మృతి వాన్ మెమోరియల్ దాదాపు 470 ఎకరాల్లో నిర్మించబడింది. జిల్లాలోని 948 గ్రామాలు మరియు 10 పట్టణాలకు సాగునీరు మరియు తాగునీరు అందించడానికి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ యొక్క కచ్ బ్రాంచ్ కెనాల్ ను కూడా ప్రధాని నాడీ ప్రాంభించారు.
- గుజరాత్ రాష్ట్ర రాజధాని : గాంధీనగర్
- గుజరాత్ రాష్ట్ర సిఎం : భూపేంద్ర భాయ్ పటేల్
- గుజరాత్ రాష్ట్ర గవర్నర్ : ఆచార్య దేవ్ వ్రథ్
క్విక్ రివ్యు :
ఏమిటి : గుజరాత్ లో స్మృతి వాన్ మెమోరియల్ ను ప్రారంబించిన ప్రధాని నరేంద్ర మోడి
ఎవరు : ప్రధాని నరేంద్ర మోడి
ఎక్కడ: గుజరాత్
ఎప్పుడు : ఆగస్ట్ 28
జాతీయ క్రీడా దినోత్సవం గా ఆగస్ట్ 29 :

హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్ట9న జరిగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా సంఘాలు ఘనంగా జరుపుకున్నాయి. ఆసియా కప్ లో టీమిండియా పాక్ ను మట్టికరింపించిన మరుసటి రోజే జాతీయ క్రీడా దినోత్సవం ఉండటంతో వేడుకలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ధ్యానంద్ 117వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాకీ పితామహుడికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. వివిధ క్రీడాంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల వివిధ క్రీడాంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల రోజువారీ జీవితంలో ఆటలను భాగం చేయాలనే ఉద్దేశంతో 2012లో హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్ కేంద్ర ప్రభుత్వం చంద్ పుట్టిన రోజును నాటి జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. నాటి నుంచి ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ క్రీడా సంఘాలు స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ క్రీడా దినోత్సవం గా ఆగస్ట్ 29
ఎప్పుడు : ఆగస్ట్ 28
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టిన అడిల్లే సుమరివాలా :

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా అడిల్లే సుమరివాలా గారు బాధ్యతలు స్వీకరించారు. తాజా ఎన్నికలు జరిగే వరకు భారత ఒలింపిక్ సంఘం అడిల్లే సుమరివాలాను అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. భారత ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు. డా. నరీందర్ ధ్రువ్ బాత్రా గారు, జూలై 2022లో ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. ఆ తర్వాత 16 మంది కార్యనిర్వాహక సభ్యులు అనుగుణంగా IOA రాజ్యాంగంలోని క్లాజ్ 1115 ప్రకారం ఈ ఖాలిని పూరించడానికి సహకరించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టిన అడిల్లే సుమరివాలా
ఎవరు : అడిల్లే సుమరివాలా
ఎప్పుడు : ఆగస్ట్ 28
పండ్లు, కూరగాయలను తాజాగా ఉంచడానికి నూతన కోటింగ్ అబివృద్ది చేసిన ఐఐటీ గువాహటి పరిశోధకులు :

పండ్లు, కూరగాయలను రెండు నెలల పాటు జాగా ఉంచే సరికొత్త పూతను గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది తినదగిన పదార్ధమేనని వారు తెలిపారు, బంగాళాదుంప, టమోటా, పచ్చిమిర్చి. పైనాపిల్, కివి, స్ట్రాబెర్రీ, భాస్ మాండరిన్ రకం ఆరంజ్, ఆఫిల్స్ దీని సత్తా రుజువైంది. కాగా రైతులకు ఇది ప్రయోజనం కలిగిస్తుంది. ఆహార ఉత్పత్తి, సరపరాలో వృధాను తగ్గించాలన్న ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ పరిశోధన తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. “భారత వ్యవసాయ పరిశోధన మండలి గణాంకాల ప్రకారం పండ్లు, కూరగాయల్లో 4.6 నుంచి 15.9 శాతం వృధా ఉంటోంది. సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడమే అందుకు కారణం” అని పరిశోధనలో పాలు పంచుకున్న విమల కటియార్ పేర్కొన్నారు. సముద్రంలో లభించే దునాలియెల్లా టెరియోటెకా అనే మైక్రో ఆల్గేతో ఈ పూతను తయారు చేశారు. ఈ “ఆల్గేలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఆల్గాల్ ఆయిలూ ఇది ఒక వనరు. ఈ నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఈ మైక్రో ఆల్గే నుంచి ఆయిల్ ను సేకరించాక మిగిలిపోయే పదార్ధాన్ని పడేస్తారు. ఈ వ్యర్థ పదార్థానికి చిటొసన్ అనే కార్బోహైడ్రేట్ తో కలిపి తాజా పూతను పరిశోధకులు రూపొందించారు. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతవరకు ఇది స్థిరంగా ఉంటుంది. దీనివల్ల పచ్చ కూరగాయల రంగు, రూపం, రుచి, పోషక విలువలు కొన్ని వారాల పాటు యదాత దంగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : పండ్లు, కూరగాయలను తాజాగా ఉంచడానికి నూతన కోటింగ్ అబివృద్ది చేసిన ఐఐటీ గువాహటి పరిశోధకులు
ఎవరు : ఐఐటీ గువాహటి పరిశోధకులు
ఎక్కడ: అస్సాం
ఎప్పుడు : ఆగస్ట్ 28
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |