Daily Current Affairs in Telugu -28-09-2019

current affairs in telugu

Daily Current Affairs in Telugu -28-09-2019:

rrb ntpc online exams in telugu

Daily Current Affairs -27th September 2019

క్షయ భారత్ 2019  :

2018 గణాంకాల ప్రకారం దేశం మొత్తంమ్మిద అత్యధిక క్షయ కేసులు నమోదు అయిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (20శాతం ) కాగా, రెండో స్థానంలో తెలంగాణ (10 శాతం) ఉంది. తెలంగాణ రాష్టంలో జిల్లాల్లో హైదరాబాదు జిల్లలో అధికంగా  10849 కేసులు నమోదు అయ్యాయి.     కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ 27-09-2019 న విడుదల చేసిన ‘క్షయ భారత్ 2019’ నివేదికలో పలు అంశాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 21.5 లక్షల కేసులు నమోదు అయ్యాయి. కాగా 2025కు క్షయ నిర్మూలనే లక్ష్యంగా కార్యచరణ అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : క్షయ భారత్ 2019 నివేదిక

ఎప్పుడు : 27-09-2019

ఎవరు : అత్యధిక క్షయ కేసులు నమోదు అయిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (20శాతం ) కాగా, రెండో స్థానంలో తెలంగాణ

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 కేంద్ర అవార్డులు :

దిన్ దయాల్ ఉపాద్యాయ్ పంచాయతి సశక్తికరణ్ పురస్కార్ -2019 లో భాగంగా కేంద్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి 11 అవార్డులు ప్రకటించింది. జిల్లా స్థాయిలో చిత్తూరు, మండల స్థాయిలో గుమ్మ గట్ట( అనంతపురం), సుబ్భావరం(విశాఖ), వెదురు కుప్పం( చిత్తూరు), కర్నూలు, గ్రామ స్థాయిలో పొగిరి (శ్రీకాకులం), బుట్టాయ గూడెం(పశ్చిమ గోదావరి), కూచివారి పల్లి(కడప), అచ్చం పేట (తూర్పు గోదావరి), తలవాయి పాడు(నెల్లూరు), కోనంకి (ప్రకాశం) ఎంపికయ్యాయి. ఈ మేరకు పంచాయతిరాజ్ మంత్రిత్వ శాఖ అవార్డుల జాబితాను ప్రకటించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 కేంద్ర అవార్డులు

ఎప్పుడు : 27-09-2019

అక్టోబర్ 4 న వై.ఎస్.ఆర్ వాహనమిత్ర  పథకం ప్రారంభం :

ఆంధ్రప్రదేశ్ లోని ఆటో, ట్యాక్సీ, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్ లకు ఏడాది కి 10 వేల రూపాయల చొప్పున సాయమందించే వై.ఎస్.ఆర్ వాహనమిత్ర  పథకాన్ని అక్టోబర్ 4న సిఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంభంచింది సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వికరించగా 1.75 లక్షల మంది ఆర్జీలు అందజేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : అక్టోబర్ 4 న వై.ఎస్.ఆర్ వాహనమిత్ర  పథకం ప్రారంభం

 ఎప్పుడు : 04-10-2019

ఎవరు : వైఎస్ జగన్ అటో, ట్యాక్సీ డ్రైవర్ లకు 10వేలు సహాయం అందిచే పథకం

Manavidya Youtube Channel

 

ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగాధిపతిగా సునీల్ కుమార్ :

ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగాధిపతిగా అదనపు డిజి పి.వి సునీల్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం సిఐడి విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అమిత్ గార్గ్ పొలిసు నియామక మండలి చైర్మన్ గా బదిలీ అయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి :ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగాధిపతిగా సునీల్ కుమార్

ఎప్పుడు : 27-09-2019

హెచ్.సి.ఎ అధ్యక్షుడిగా అజహర్ :

టిమ్ ఇండియా మాజీ కెప్టన్ మహమ్మద్ అజహరుద్దిన్ క్రికెట్ లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాలతో 2000 లో అర్ధంతరంగా కేరిర్ ముగిసిన తర్వాత 19 ఏళ్లకు అతను తిరిగివస్తున్నాడు. హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్.సిఎ) నూతన అధ్యక్షుడిగా అజహర్ ఎన్నికయ్యాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఎన్నికల్లో అజహర్ ఘనవిజయం సాధించాడు. 147 ఓట్లు సాధించిన అజహర్ 74 ఓట్ల ఆధిక్యంతో ప్రకాష్ చాంద్ జైన్ పై గెలిచాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : హెచ్.సి.ఎ అధ్యక్షుడిగా టిమ్ ఇండియా మాజీ కెప్టన్ మహమ్మద్ అజహరుద్దిన్

ఎప్పుడు : 27-09-2019

దీపక్ నెంబర్ వన్ :

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో రజతంతో సత్తా చాటిన దీపక్ పునియా ర్యాంకుల్లో నంబర్ వన్ అయ్యాడు. తాజాగా ప్రకటించిన జాభితాలో 86 కేజీల విభాగంలో దీపక్ 83 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో దీపక్ పునియా ర్యాంకుల్లో నంబర్ వన్ అయ్యాడు

ఎప్పుడు : 27-09-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *