
Daily Current Affairs in Telugu 28-06-2021
అణ్వస్త్ర సామర్థ్యమున్న కొత్తతరం క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ ప్రయోగించిన భారత్ :

అణ్వస్త్ర సామర్థ్యమున్న కొత్త తరం క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ (అగ్ని-పి)ను భారత్ జూన్ 28 న విజయవంతంగా పరీక్షించింది. వెయ్యి నుంచి 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ ఆస్త్రం దాదాపు టన్ను పేలోడ్ ను మోసుకెళ్లగలదు. ఒడిశా. తీరానికి చేరువలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 10.55 గంటల కు క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ పేర్కొంది. సంచార లాంచర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ అస్రాన్ని తూర్పు తీరం వెంబడి మోహరించిన ఆధునాతన ట్రాకింగ్ , టెలిమెట్రీ సాధనాలు నిశితంగా గమనిం చాయని తెలిపింది. అగ్ని-పిలో అధునాతన పరిజ్ఞా నాలను ఉపయోగించారు. చోదక, దిక్సూచి, నియంత్రణ వ్యవస్థల్లో ఆధునికతను రంగరిం చారు. మిశ్రమ లోహాలను వాడటం వల్ల.. అగ్ని 1తో పోలిస్తే ఈ అస్త్రం బరువు బాగా తగ్గింది. ఈ శ్రేణి క్షిపణులను ప్రత్యేక రైలుపైనే తరలించాల్సి వచ్చేది. దానికి భిన్నంగా రోడ్డు మార్గం లోనూ అగ్ని-పిని చేరవేయవచ్చు. ఫలితంగా సరిహద్దుల ‘వరకూ ఈ అస్త్రాన్ని తరలించి, శత్రు భూభాగంలోని గరిష్ఠ దూరంలో ఉన్న లక్ష్యాలనూకూడా ఛేదించొచ్చు. క్షిపణి వెడల్పు బాగా తగ్గడం వల్ల దాన్ని ప్రత్యేక గొట్టం (క్యానిస్టర్)లో భద్రపరచడా నికి వీలు కలిగింది. ఫలితంగా ఈ క్షిపణి రవాణా, ప్రయోగం చాలా తేలికవుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అణ్వస్త్ర సామర్థ్యమున్న కొత్త తరం క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: ఓడిశా లో
ఎప్పుడు: జూన్ 28
జపాన్ దేశ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం కు ఎంపికైన పాలగుమ్మి సాయి నాథ్ :

ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ కు జపాన్ దేశానికి చెందిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం ‘ఫుకుఒకా గ్రాండ్ ప్రైజ్-2021’ వరించింది. భారతదేశ వ్యవసాయం, గ్రామీణుల సమస్యలు, స్థితిగతు లను వెలుగులోకి తెచ్చినందుకు దీనిని బహూకరిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. తన వార్తా కథనాల ద్వారా నూతన విజ్ఞానాన్ని ప్రోది చేస్తూ, పౌర సహకారాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. 40 ఏళ్లుగా గ్రామీణ భారతాన్ని చిన్న కోణాల్లో ఆవిష్క రించారని తెలిపారు. సెప్టెంబరు 29న ఆన్లైన్లో పురస్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఈ పురస్కారంకింద రూ.30 లక్షలు బహూకరించనున్నారు. దీన్నంతా సేవా కార్యక్రమాలకే వినియోగిస్తానని సాయినాధ్ ప్రకటించారు. రూ.10 లక్షలను కరోనాతో చనిపోయిన గ్రామీణ పాత్రికేయులు కుటుంబాలకు విరాళంగా ఇస్తానని తెలిపారు. మొత్తం 20 కుటుంబాలకు ఈ విధంగా సాయం అందించనున్నారు. మిగిలిన రూ.20 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లోని దళిత, ఆదివాసీ పాత్రికేయులకు ఉపకారవేతనంగా ఇవ్వనున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: జపాన్ దేశ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం కు ఎంపికైన పాలగుమ్మి సాయి నాథ్
ఎవరు: పాలగుమ్మి సాయి నాథ్
ఎప్పుడు: : జూన్ 28
భారత అటార్నీ జనరల్ (ఏజీఐ) కె.కె.వేణుగోపాల్ పదవీకాలం పొడగింపు :

భారత అటార్నీ జనరల్ (ఏజీఐ) కె.కె.వేణుగోపాల్ (89) పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. తొలుత 2017, జులై 1న ఆయన అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు. ఈ మూడేళ్ల పదవీ కాలం గతేడాది జూన్ 30వ తేదీతో ముగియగా మరో ఏడాది పాటు పొడిగించింది. తాజాగా ఇంకో ఏడాది పాటు ఆయననే కొనసాగించాలని నిర్ణయించింది. వేణుగోపాల్ 2022, జూన్ 30 వరకు ఏజీఐగా ఉంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత అటార్నీ జనరల్ (ఏజీఐ) కె.కె.వేణుగోపాల్ పదవీకాలం పొడగింపు
ఎవరు: కె.కె.వేణుగోపాల్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: : జూన్ 28
200 మీటర్ల పరుగు రేసులో రికార్డు బద్దలు కొట్టిన ఏరియన్ నైటన్ :

జమైకా స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ పేరిట ఉన్న పదిహేడేళ్ల రికార్డు బద్దలైంది. అమెరికా ఒలింపిక్ ట్రయల్స్ ఎరియన్ నైటన్’ 200 మీటర్ల పరుగును 19.84 సెకన్లలో ముగించి బోల్ట్ పేరిట ఉన్న అండర్-20 రికార్డును తిరగరాశాడు. 2004లో ఉసేన్ బోల్ట్ 19.93 సెకన్లలో రేసు ముగించి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఈ మధ్యనే బోల్ట్ పేరిట ఉన్న అండర్-18 రికార్డునూ నైటన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాశాడు. 17 ఏళ్ల నైట్ అమెరికా ట్రయల్స్ లో మూడో స్థానంలో నిలిచి ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. నోవా లైల్స్ (19.74 సెకన్లు) అగ్రస్థా నంలో రేసు ముగించగా.. కెన్ని బెడ్నా రెక్ (19.78 సెకన్లు) రెండో స్థానంలో వచ్చాడు. బోల్ట్ 21 ఏళ్లు వచ్చే వరకు 19.84 సెకన్లకు చేరుకో లేదు. అతడి కంటే మూడేళ్లు ముందుగానే ఆ మార్క్ అందుకున్న నైటన్ టోక్యోలో ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి
క్విక్ రివ్యు :
ఏమిటి: 200 మీటర్ల పరుగు రేసులో రికార్డు బద్దలు కొట్టిన ఏరియన్ నైటన్
ఎవరు: ఏరియన్ నైటన్
ఎప్పుడు: : జూన్ 28
మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన మెక్ లాలిన్ :

ఒలింపిక్స్ ముందు రికార్డుల వేడి మొదలైంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో ప్రపంచ రికార్డు బద్దలైంది. స్టార్ అథ్లెట్ దాలియా మహమ్మద్ ను ఓడిస్తూ ఆమె పేరిట ఉన్న రికార్డును తిరగరాస్తూ మెక్ లాలిన్ కొత్త రికార్డును సృష్టించింది. జూన్ 27న రాత్రి ఆమెరికా ఒలింపిక్ ట్రయల్స్ లో మెక్లాలిన్ 51. 90 సెకన్లలో రేసును ముగించింది. దాంతో. దాలియా పేరిట ఉన్న రికార్డును 0.26 సెకన్లతో మెరుగుపరిచింది. 52.42 సెకన్లలో రేసు ముగించిన దాలియా రెండో స్థానానికి పరిమితమైంది. వీరిద్దరు పోటీపడిన గత రెండు రేసుల్లో దాలియా విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన మెక్ లాలిన్
ఎవరు: మెక్ లిన్
ఎప్పుడు: : జూన్ 28
ఆర్చరీ ప్రపంచ కప్లో స్వర్ణ పథకం గెలుచుకున్న అభిషేక్ వర్మ :

పారిస్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్లో పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ చారిత్రాత్మక స్వర్ణం సాధించాడు పురుషుల వ్యక్తిగత సమ్మేళనం ఈవెంట్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ బంగారు పతకంను సాధించాడు, అమెరికన్ హెవీవెయిట్ క్రిస్ షాఫ్ నుండి ఓటమి ని తప్పించుకున్నాడు. పారిస్లో జరిగిన ప్రపంచ కప్ స్టేజ్ 3 లో బంగారు పతకాన్ని సొంతం చేసుకోవడానికి వర్మ షూట్-ఆఫ్ గెలుచుకున్నాడు అభిషేక్ వర్మ జూన్ 26 న తన 2వ ప్రపంచ కప్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో రెండు ప్రపంచ కప్ స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయ వ్యక్తి గా ఇతను బంగారు పతక మ్యాచ్లో అమెరికన్ హెవీవెయిట్ క్రిస్ షాఫ్పై వర్మ షూట్-ఆఫ్ ను గెలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్చరీ ప్రపంచ కప్లో స్వర్ణ పథకం గెలుచుకున్న అభిషేక్ వర్మ :
ఎవరు: అభిషేక్ వర్మ
ఎప్పుడు : జూన్ 28
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |