Daily Current Affairs in Telugu 27&28 October – 2022
విశాఖలో నిర్వహించిన ఇండో –సింగపూర్ నౌకా విన్యాసాలు :

విశాఖలో ‘ఇండో- సింగపూర్’ నౌకా విన్యాసాలు విశాఖపట్నం లోని విశాఖ తీరం బంగాళాఖాతంలో భారత్- సింగపూర్ ద్వైపాక్షిక ‘మారిటైం సింబెక్స్- 2022′ విన్యాసాలు ఈనెల 26, 27వ తేదీల్లో నిర్వహించినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు తెలిపాయి. 28 నుంచి నిర్వహిస్తున్న సీఫేజ్ విన్యాసాలు 30 వరకు కొనసాగుతాయని పేర్కొన్నాయి. విన్యాసాల్లో రిపబ్లిక్ సింగపూర్ నేవీ నుంచి ఫార్మడిబుల్ శ్రేణికి చెందిన ఆర్ఎస్ ఎస్ స్టల్వార్ట్,’ విక్టరీ శ్రేణికి చెందిన ఆర్ఎస్ఎస్ విజిలెన్స్ నౌకలు పాల్గొన్నాయి. సింగపూర్ నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ సీన్వాట్ జైన్వెన్ బృందానికి తూర్పు నౌకాదళం ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా. కమాండ్ రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా స్వాగతం పలికి, వివి అంశాలపై చర్చించినట్లు వివరించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : విశాఖలో నిర్వహించిన ఇండో –సింగపూర్ నౌకా విన్యాసాలు
ఎక్కడ : విశాఖలో
ఎప్పుడు : అక్టోబర్ 27
మాల్టాలో భారత హైకమిషనర్ గా గ్లోరియా గాంగే నియామకం :

మాల్టాలో భారత హైకమిషనర్ గా గ్లోరియా నియమించబడింది కాగ గ్లోరియా హైదరాబాద్ లోనే డిగ్రీ చదివి ఐఎఫ్ఎస్ కు ఎంపిక అయింది. హైదరాబాద్ లో డిగ్రీ పూర్తిచేసిన గ్లోరియా గాంగే. మాల్టా దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు. మణి పుర్ రాష్ట్రం మురచందూర్ జిల్లాలో 1976లో జన్మించిన గోరియా బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీఏ చదివారు., హైదరాబాద్ లోనే సివిల్స్ శిక్షణ తీసుకొని తొలి ప్రయత్నంలోనే 2000లో ఐఎఫ్ ఎస్ అధికారిగా ఎంపికయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : మాల్టాలో భారత హైకమిషనర్ గా గ్లోరియా గాంగే నియామకం
ఎవరు : గ్లోరియా గాంగే
ఎక్కడ : మాల్టాలో
ఎప్పుడు : అక్టోబర్ 27
కాప్- 27 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశాలు నిర్వహించిన ఈజిప్ట్ :

వాతావరణం పైన నిర్వహించే 27 వ వార్షిక యు.ఎన్ సమావేశం ఐన కాప్- 27 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్ లో నవంబర్ 06 నుంచి 18 వరకు జరుగుతుంది .ఆఫ్రికా లో వాతావరణ సదస్సు నిర్వహించడం ఇది ఐదో సారి. కాప్ 27 మూడు ప్రధాన రంగాలపైన దృషి పెడుతుంది.ఉద్గారాలను తగ్గించడం వాతావరణ మార్పులను సిద్దం చేయడనికి మరియు వాటిని ఎదుర్కోవడానికి దేశాలకు సహాయం చేయడం మరియు వాతావరణ కార్యక్రమాల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక మద్దతు మరియు నిధులను పొందటం.
క్విక్ రివ్యు :
ఏమిటి : కాప్- 27 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశాలు నిర్వహించిన ఈజిప్ట్
ఎక్కడ : ఈజిప్ట్ లో
ఎప్పుడు : అక్టోబర్ 27
వన్ టైమ్ ఆస్తి పన్ను మాఫీ పథకాన్ని ప్రకటించిన డిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ :

డిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ ఐన వినయ్ కుమార్ సక్సేన గారు ఇటీవల వన్ టైమ్ వన్ ప్రాపర్టి పన్ను మాఫీ సమృద్ది 2022-23 అనే పథకాన్ని ప్రకటించారు. డిల్లి లో మౌలిక సదుపాయాల అబివృద్ది కోసం మున్సిపల్ యొక్క ఆదాయాన్ని బలోపేతం చేయడం పెంచడం 2022 -23 పథకం కింద NCR ప్రజలు నివాస ప్రాపర్టీ లకు గత ఐదేళ్ళలో ప్రస్తుత మరియు ఉన్న పన్ను యొక్క ప్రదాన మొత్తాన్ని చెల్లించగలరు.
క్విక్ రివ్యు :
ఏమిటి : వన్ టైమ్ ఆస్తి పన్ను మాఫీ పథకాన్ని ప్రకటించిన డిల్లి లెఫ్టినెంట్ గవర్నర్
ఎవరు : డిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేన
ఎప్పుడు : అక్టోబర్ 27
‘బ్లూ ఫ్లాగ్ బీచ్‌ల’ జాబితాలో చేర్చబడిన లక్ష్వ్ ద్వీప్ లోని మినీకాయ్ తుండి బీచ్ మరియు కద్మత్ బీచ్ :

లక్ష్వ ద్వీప్ మినికాయ్ తుండి బీచ్ మరియు కద్మత్ బీచ్ ల నుంచి రెండు బీచ్ లు బ్లూ బీచ్ ల జాబితాలో చేర్చబడ్డాయి.ఇది ఫౌండేషన్ ఫర్ ఎన్వి రాన్ మెంట్ ఎడ్యుకేషన్ FEE ద్వారా ప్రపంచంలో అత్యంత పరిశుబ్రమైన బీచ్ లకు ఇచ్చిన పర్యావరణ లేబుల్. దీనితో అత్యంత పరిశుబ్రమైన బీచ్ లు గా భారతదేశంలో ఇపుడు 12 బీచ్ లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కింద ద్రువీకరించాబడ్డాయి.729 సైట్ లతో స్పెయిన్ బ్లూ ఫ్లాగ్ అవార్డు పొందిన సైట్ లతో ఉన్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘బ్లూ ఫ్లాగ్ బీచ్‌ల’ జాబితాలో చేర్చబడిన లక్ష్వ్ ద్వీప్ లోని మినీకాయ్ తుండి బీచ్ మరియు కద్మత్ బీచ్
ఎవరు : మినీకాయ్ తుండి బీచ్ మరియు కద్మత్ బీచ్
ఎప్పుడు : అక్టోబర్ 28
ఆల్ టైం బెస్ట్ ఇండియన్ ఫిలిం ఇంటర్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ ఉత్తమ చిత్రంగా పథేర్ పంచాలి చిత్రం :

సత్యజిత్ రే యొక్క పథేర్ పంచాలి అనే చిత్రం ఉత్తమ భారతీయ చిత్రంగా ఫిఫిస్క్రి చే ఎంపిక చేయబడింది.ముంబై లో అక్టోబర్ 21 పిటిఐ లేజండరి ఫిలిం మేకర్ అయిన సత్యజిత్ రే గారి యొక్క ఫీచర్ ఫిలిం “పథేర్ పాంచాలి “ అనే చిత్రాన్ని ఆల్ టైం బెస్ట్ ఇండియన్ ఫిలిం ఇంటర్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆల్ టైం బెస్ట్ ఇండియన్ ఫిలిం ఇంటర్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ ఉత్తమ చిత్రంగా పథేర్ పంచాలి చిత్రం
ఎవరు : పథేర్ పంచాలి చిత్రం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఇంటర్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేసన్ కి భారత ప్రతినిథి గా షేఫాలి జునేజా ఎన్నిక :

ఇంటర్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేసన్ ICAO కి భారత ప్రతినిథి గా షేఫాలి జునేజా గారు ఐక్య రాజ్య సమితి ప్రత్యెక విమాన యాన సంస్థ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ కమిటి ATC చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.జునేజా ఇండియన్ రెవెన్యు సర్వీస్ ఇన్కం ట్యాక్స్ కేడర్ కి చెందిన 1992 బ్యాచ్ అధికారి ICAO లో చేరడానికి ముందు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో జాయింట్ సెక్రటరి గా కూడా పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇంటర్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేసన్ కి భారత ప్రతినిథి గా షేఫాలి జునేజా ఎన్నిక
ఎవరు : షేఫాలి జునేజా
ఎప్పుడు : అక్టోబర్ 28
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీత వర్మ నియామకం :

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీత వర్మను ప్రభుత్వం నియమించింది. అక్టోబర్ 2022లో పూర్తికాల చైర్‌పర్సన్ గా ఉన్న అశోక్ కుమార్ గుప్తా గారు పదవిని విరమించుకున్న తర్వాత ఈ నియామకం జరిగింది. వర్మ ప్రస్తుతం రెగ్యులేటర్‌లో సభ్యుడు. గుప్తా నవంబర్ 2018లో CCI చైర్‌పర్సన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీత వర్మ నియామకం
ఎవరు : సంగీత వర్మ
ఎప్పుడు : అక్టోబర్ 28
మెయిన్ బీ సుభాష్ ప్రచారాన్ని ప్రారంబించిన లడక్ ఎంపి అయిన జమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్ :

లడక్ ఎంపి అయిన జమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్ గారు లేహ్ నుంచి “మెయిన్ బీ సుభాష్ “ప్రచారాన్ని ప్రారంబించారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి పేరు మీద నిర్వహిస్తున్న INA ట్రస్ట్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క సహకారం తో 23 జనవరి 2023 నేతాజీ 125వ జయంతి సందర్బంగా వరుస కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : మెయిన్ బీ సుభాష్ ప్రచారాన్ని ప్రారంబించిన లడక్ ఎంపి అయిన జమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్
ఎవరు : జమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్
ఎప్పుడు : అక్టోబర్ 28
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |