Daily Current Affairs in Telugu 27-05-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 27-05-2020

rrb ntpc online exams in telugu

భారత వైమానిక దళం ప్రవేశపెట్టిన  తొలి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఎం కే -1:

భారత వైమానిక దళం (ఐఎంఎఫ్) తన తొలి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్సిఎ) అయిన తేజస్ ఎం కే-1 ను మే27 న స్క్వాడ్రన్ నం 18ఫ్లయింగ్ బులెట్స్ లోకి ప్రవేశపెట్టింది.తమిళనాడు లోని కోయంబత్తూర్ శివారులో నూలూర్  లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదికగా నిలిచింది.ఏఎ ఎయిర్ క్రాఫ్ట్  ను బెంగళూర్ ఓ హిందుస్తాన్ ఎరోనాటికల్స్  లిమిటెడ్ (హెచ్ ఏఎల్) రోపొంధించింది. ఈ తేజస్  ఎంఎ-1 నాలుగో తరం సూపర్ సోనిక్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లలో అతి తేలికైన చిన్నదైన యుద్ద విమానం .

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత వైమానిక దళం ప్రవేశపెట్టిన  తొలి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఎం కే -1:

ఎవరు: భారత వైమానిక దళం

ఎక్కడ: తమిళనాడు

ఎప్పుడు: మే 27

ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కు ఎంపికైన భారత ఆర్మీ అదికారి సుమన్ గవాని :

ఐక్య రాజ్య సమితి  మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2019)కు ఐక్య రాజ్య సమితి చీఫ్ అంటోనియో కలిసి యుఎన్ మిషన్ ఇన్ దక్షిణ సూడాన్ (UNMISS)తో పని చేసిన భారత ఆర్మీ అధికారి మరియు మహిళా శాంతి పరిరక్షకుడు మరియు బ్రెజిల్ మహిళా కమాండర్ ఎంపికయ్యారు.గుటేరాస్ వారిని శక్తి వంతమైన రోల్ మోడల్స్ గా అబివర్నించారు. ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ గుటేరాస్ అధ్యక్షత వహించిన ఆన్ లైన్ వేడుకలో మే29 అంతర్జాతీయ శాంతి భద్రతల దినోత్సవం సందర్బంగా మేజర్ సుమన్ గవాని ,బ్రెజిల్ నావికాదళం అధికారి కమాండర్ కార్లా మంటేరో డి కాస్ట్రో అరౌజో ఈ అవార్డును అందుకుంటారు.మిలిటరి అబ్సర్వర్ ఎంఎస్ గవాని ఇటివలే దక్షిణ సుడాన్ లో UNMISS తో తన ఒప్పందాన్ని పూర్తి చేసింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కు ఎంపికైన భారత ఆర్మీ అదికారి సుమన్ గవాని

ఎవరు: భారత ఆర్మీ అదికారి సుమన్ గవాని

ఎప్పుడు: మే 27

ఎన్ఎఫ్డిబి  చీఫ్ ఎగ్సిక్యుటివ్ గా నియమితులయిన పి.సువర్ణ :

జాతీయ మత్స్య అబివృద్ది మండలి (నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డ్ ) చీఫ్ ఎగ్సిక్యుటివ్ గా తెలంగాణా కేడర్ కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి గా పి.సువర్ణ గారు నియమితులయ్యారు.ఇందుకు కేంద్ర నియమాకాల కేబినేట్ కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ మే27 న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈమె డిప్యుటేషన్  మీద మూడేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఎన్ఎఫ్డిబి  చీఫ్ ఎగ్సిక్యుటివ్ గా నియమితులయిన పి.సువర్ణ

ఎవరు: పి.సువర్ణ

ఎక్కడ: న్యు డిల్లి

ఎప్పుడు: మే 27

ఔషద అనుమతుల ,నియంత్రణ పర్యవేక్షణ అధికారిగా నవీన్ కుమార్ నియామకం :

రాష్ట్రంలో ఔషద ఉత్పత్తి సంస్థలకు అనుమతులు నియంత్రణ పర్యవేక్షణ అధికారిగా వై.నవీన్ కుమార్ నియమితులయ్యారు.ప్రస్తుతం ఈయన తెలంగాణా ఔషద నియంత్రణ సంస్థ ప్రయోగ శాలలో సీనియర్ సైంటిఫిక్  అధికారిగా బాద్యతలు స్వీకరిస్తున్నారు.తెలంగాణా ఫార్మసి కౌన్సిల్  రిజిస్త్రార్ గాకూడా నవీన్ కుమార్ కు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ఔషద నియంత్రన సంస్థ సంచాలకులు ప్రీతీ మీనా ఉత్తర్వులు జరీ చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఔషద అనుమతుల ,నియంత్రణ పర్యవేక్షణ అధికారిగా నవీన్ కుమార్ నియామకం

ఎవరు: నవీన్ కుమార్

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు: మే 27

నాబార్డు చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన చింతల  గోవింద రాజులు :

జాతియ వ్యవసాయ ,గ్రామీణ అబివృద్ధి బ్యాంకు (నాబార్డు) నూతన చైర్మన్ గా చింతల గోవింద రాజులు మే27న బెంగళూర్ లో పదవి బాద్యతలు చేపట్టారు.ఈ పదవిలో ఉన్న హెచ్.కే భన్వాలా పదవి కాలం పూర్తి కావడం తో ఆ స్థానం లో  తెలుగు వాడైన గోవింద రాజులు  నియమితులయ్యారు.నాబార్డు లో  సుదీర్గ సేవలందించిన అనుభవం గోవింద రాజులు కు సొంతం .బెంగళూర్ కేంద్రంగా ఉన్న నాబార్డు సబ్సిడరీ సంస్థ నాబార్డు ఫైనాన్సియల్ సర్వీసెస్ కు మేనేజింగ్ డైరెక్టర్ ఎండిగా కూడా అయన వ్యవహరించారు.గుంటూరు లో బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఎజి బిఎస్సి పట్టా తీసుకున్న గోవింద రాజులు దిల్లిలోని భారతీయ వ్యవసాయ పరిశోదన సంస్థ (ICAR)లో స్నాతకోత్తర విద్య పూర్తి చేశారు. ఆ తరువాత ముంబై,,హైదరబాద్ ,చండీగడ్ ,లఖ్నావు ,బెంగళూర్,ప్రాంతీయ నాబార్డు కార్యాలయాల్లో ఈయన సేవలందించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: నాబార్డు చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన చింతల  గోవింద రాజులు

ఎవరు: చింతల  గోవింద రాజులు

ఎప్పుడు: మే 27

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *