
Daily Current Affairs in Telugu 27-04-2020
ఐవోసీ చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య నియామకం :

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) సంస్థ చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య గారు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ సంస్థ డైరెక్టర్ గా సేవలందిస్తున్న ఆయనను చైర్మన్ గా నియమిస్తున్నట్లు ఏప్రిల్ 27న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ గా పదవి విరమణ చేసిన తర్వాత ఈ బాద్యతలు చేపడతారు. 2023 ఆగస్టు 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు .
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐవోసీ చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య నియామకం
ఎవరు: శ్రీకాంత్ మాధవ్ వైద్య
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పడు : ఏప్రిల్ 27
ఇంటింటికి ఔషద పంపిణి కోసం ధన్వంతరి అనే పథకం ప్రవేశపెట్టిన అస్సాం :

అస్సాం ప్రభుత్వం నూతనంగా ఇంటింటికి ఔషదాలను పంపిణి చేయడం కోసం “ధన్వంతరి” అనే కొత్త పథకాన్ని ప్రారంబించింది. రోగులు తమ ప్రిస్కిప్షన్లను టెలిఫోన్ ల ద్వారా పంపవచ్చు లేదా ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయవచ్చు. అందుబాటులో ఉన్న ఉచిత ఔషదాల జాబితాలో ఇది లేనప్పటికీ అది వారికి అందేలా ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ సమయం లో ఏ రాష్ట్ర ప్రబుత్వం తీసుకొని చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం గా నిలవనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇంటింటికి ఔషద పంపిణి కోసం ధన్వంతరి అనే పథకం ప్రవేశపెట్టిన అస్సాం
ఎవరు: అస్సాం ప్రబుత్వం
ఎక్కడ: అస్సాం
ఎప్పడు : ఏప్రిల్ 27
ప్రపంచంలోనే సైనిక వ్యయం లో భారత్ ది మూడో స్థానం:

ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది సైనిక వ్యయం 3.6 శాతం పెరిగింది అని మేధో మదన సంస్థ స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యుట్ (సిప్రి) పేర్కొంది. 2019 లో సైనిక దళాలపై వివిధ దేశాలు చేసిన ఖర్చు వివరాలను ఈ సంస్థ తన తాజా నివేదికలో బయట పెట్టింది. ఈ జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో ,చైనా ద్వితీయ ,భారత్ ది మూడో స్థానం లో నిలిచాయి. రెండు ఆసియా దిగ్గజాలు తర్వాతి స్థానాల్లో నిలవడం ఇదే మొదటి సారి. 2019 కి పపంచ వ్యాప్తంగా సైనిక వ్యయం 1,917 బిలియన్లు డాలర్లకు చేరిందని సిప్రి తెలిపింది. 2018 తో పోలిస్త్తే ఇది 3.6 శాతం అధికమని పేర్కొంది. భారత సైనిక పద్దు 6.8 శాతం పెరిగి 71.1. బిలియన్ల డాలర్ల ను తాకింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలో సైనిక వ్యయం లో భారత్ ది మూడో స్థానం
ఎవరు: భారత్
ఎప్పడు : ఏప్రిల్ 27
పాకిస్తాన్ ఆటగాడు ఉమర్ అక్మల్ పై మూడేళ్ళ నిషేధం:

పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్ పై పిసిబి మూడేళ్ళ నిషేధం విధించింది. ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ కు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం కొందరు తనను సంప్రదించిన విషయాన్ని తెలుపనందుకు అక్మల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిసిబి తెలిపింది.అక్మల్ మూడేళ్ళ పాటు ఏ ఫార్మాట్లోను ఆడకుండా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మిరాన్ చౌహాన్ నిషేదం విధించినట్లు పేర్కొంది. ఉమర్ అక్మల్ ఇప్పటి వరకు 16 టెస్టులు ,121వన్డేలు ,84 టి20లు ఆడాడు .
క్విక్ రివ్యు :
ఏమిటి : పాకిస్తాన్ ఆటగాడు ఉమర్ అక్మల్ పై మూడేళ్ళ నిషేధం
ఎవరు: ఉమర్ అక్మల్
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పడు : ఏప్రిల్ 27
ఆస్ట్రియా గ్రాండ్ ఫ్రీ తో ఫార్ములా వన్ సీజన్ ప్రారంభం

కరోనా మహమ్మారి తో వాయిదా పడిన 2020 ఫార్ములా వన్ (ఎఫ్ 1) సీజన్ 2020 జులై నెలలో ప్రారంభం కానుంది. జులై 5 న ఆస్ట్రియ గ్రాండ్ ఫ్రీ తో తాజా సీజన్ ను ఆరంబించాలని ఉద్దేశం తో ఉన్నట్లు ఎఫ్1 చీఫ్ చేజ్ క్యారీ ఏప్రిల్ 27 ప్రకటించారు. జులై –ఆగస్టు నెలలో యూరప్ రేసులను నిర్వహించి అనంతరం ఆసియా ,ఉత్తర ,దక్షిణ అమెరికాలలో పూర్తి చేసి డిసెంబర్ లో మద్య ఆసియాలో సీజన్ ను ముగించే యోచనలో ఉన్నట్లు అయన తెలిపారు. 2020 ఏడాది లో కనీసం 15 రేసులను నిర్వహించెందకు ప్రణాళికా సిద్దం చేస్తున్నట్లు తెలిపారు .
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆస్ట్రియా గ్రాండ్ ఫ్రీ తో ఫార్ములా వన్ సీజన్ ప్రారంభం:
ఎప్పడు : ఏప్రిల్ 27
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |