
Daily Current Affairs in Telugu 27-01-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
సీడబ్ల్యూసీ ఛైర్మన్ గా నియమితులైన ఆర్కేగుప్తా :

కేంద్ర జలసంఘం చైర్మన్ గా డాక్టర్ ఆర్కే గుప్తా గారు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ జనవరి 27న ఉత్త ర్వులు జారీ చేసింది. సెంట్రల్ వాటర్ ఇంజినీ రంగ్ గ్రూప్-ఏ సర్వీసెస్ కు చెందిన ఈయన ను పదోన్నతి పై సీడబ్ల్యూసీ చైర్మన్ గా నియమిస్తు న్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి. లేదా ఆర్కే గుప్తా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ. నియామకం అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సీడబ్ల్యూసీ ఛైర్మన్ గా నియమితులైన ఆర్కేగుప్తా
ఎవరు: ఆర్.కే గుప్తా
ఎప్పుడు: జనవరి 27
భారత్ లో 25 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ లను అందించిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ :

భారతదేశంలో 25 కోట్ల కంటే ఎక్కువ మోతాదులో కోవిడ్ వ్యాక్సిన్లను అందించిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. దేశంలోని మొత్తం 162.7 కోట్ల డోసుల్లో దాదాపు 25, 05 కోట్లు రాష్ట్రానికి చెందినవే. అంటే మహమ్మారిని తగ్గించడానికి దేశంలో ఉపయోగించే వ్యాక్సిన్లలో 15.3 శాతం ఉత్తరప్రదేశ్ లో వినియోగించబడ్డాయి.ఉత్తరప్రదేశ్ కు పోటీదారుగా ఉన్న మహారాష్ట్రలో 14. 64 కోట్ల డోస్ లు ఇచ్చారు. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (11.87 కోట్లు), బీహార్ (11.01 కోట్లు), మధ్యప్రదేశ్ (10.87 కోట్లు) ఉన్నాయి.
- ఉత్తరప్రదేశ రాష్ట్ర రాజధాని :లక్నో
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిఎం: యోగి ఆదిత్యానాద్
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : ఆనంది బెన్ పటేల్
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లో 25 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ లను అందించిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్
ఎవరు: ఉత్తరప్రదేశ్
ఎప్పుడు: జనవరి 27
ఇంటర్నేషనల్ జింక్ అసోసియేషన్ చైర్మన్ గా అరుణ్ మిశ్రా ఎన్నిక :

హిందుస్థాన్ జింక్ సీఈవో ఐన అరుణ్ మిశ్రా ఇంటర్నేషనల్ జింక్ అసోసియేషన్ (IZA) యాక్టింగ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అరుణ్ మిశ్రా ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడు గా మరియు ఆసియా వ్యక్తి అని ఇంటర్నేషనల్ జింక్ అసోసియేషన్ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ జింక్ అసోసియేషన్ అనేది గ్లోబల్ జింక్ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే ఒక లాభాపేక్షలేని సంస్థ. దీని లక్ష్యం పరిశోధన, అభివృద్ధి, సాంకేతికత బదిలీ మరియు జింక్ ను జీవితంలో స్థిరమైన మరియు ముఖ్యమైన అంశంగా మార్చే ప్రత్యేక లక్షణాల కమ్యూనికేషన్ ద్వారా జింక్ ఉత్పత్తులు మరియు మార్కెట్లను అభివృద్ధి చేయడం దీని యొక్క లక్ష్యం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నేషనల్ జింక్ అసోసియేషన్ చైర్మన్ గా అరుణ్ మిశ్రా ఎన్నిక
ఎవరు: అరుణ్ మిశ్రా
ఎయిర్ ఇండియా సంస్థను టాటా గ్రూప్ నకు అందించిన ప్రభుత్వం :

విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం జనవరి 27న టాటా గ్రూప్ నకు అధికారికంగా అప్పగించింది. దిల్లీలో దీనికి సంబంధించిన ఈ కార్యక్రమం జరిగింది. ఎయిరిండియా మళ్లీ టాటా గ్రూప్ ఆధీనంలోకి రావడం ఎంతో సంతోషం కలిగిస్తోందని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. ‘ఎయిరిండియాను టాటా సన్స్ అనుబంధ కంపెనీ అయిన టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించాం. ఇక నుంచి ఆ సంస్థే యజమాని’ అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ సందర్భంగా తెలిపారు. 1932లో టాటా గ్రూప్ ఎయిరిండియాను స్థాపించగా స్వాతంత్య్రం వచ్చాక 1953లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ సంస్థను జాతీయీకరించారు. సుమారు 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా సొంతగూటికి చేరినట్లయ్యింది.
- 1932 టాటా ఎయిర్ సర్వీసెస్ పేరుతో జేఆర్ టాటా, విమానయాన సంస్థను ప్రారంభించారు. తొలి ఏడాదిలో 10.7 టన్నుల మెయిల్స్, 155 మంది పాసింజర్లను తరలించింది.
- 1938 టాటా ఎయిర్ సర్వీసెస్ పేరు టాటా ఎయిర్లైన్స్ మార్పు. ఇదే ఏడాదిలో తొలి విదేశీ విమానం కొలంబో ప్రయాణం జరిగింది.
- 1946 ప్రపంచ యుద్ధం తర్వాత టాటా ఎయిర్లైన్స్ పబ్లిక్ కంపెనీగా అవతరణ ఎయిరిండియాగా పేరు మార్పు.
- 1953 లో ఎయిరఇండియా జాతియికరణ జరిగింది .కాగా 2022 లో తిరిగి మల్లి టాటా సంస్థకు అప్పగించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎయిర్ ఇండియా సంస్థను టాటా గ్రూప్ నకు అందించిన ప్రభుత్వం
ఎవరు: టాటా గ్రూప్
ఎప్పుడు: జనవరి 27
భారత జట్టు మాజీ కెప్టెన్ హాకి దిగ్గజం చరణ్ జీత్ సింగ్ కన్నుమూత :

భారత జట్టు మాజీ కెప్టెన్, హాకీ దిగ్గజం చరణ్జిత్ సింగ్ కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారథ్యం వహించిన చరణ్ జిత్ హిమాచల్ ప్రదేశ్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మం చెందారు. 90 ఏళ్ల చరణ్ జీత్ కు ఇద్దరు కుమారులు, ఒక ర్తె ఉన్నారు. ఆయన భార్య 12 ఏళ్ల క్రితమే కన్నుమూశారు.. 1964 ఒలింపిక్ ఛాంపియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన మిడ్ ఫీల్డర్ చరజిజిత్ 1960 విశ్వ క్రీడల్లో రజతం గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నారు. 1962 ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన భారత జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత జట్టు మాజీ కెప్టెన్ హాకి దిగ్గజం చరణ్ జీత్ సింగ్ కన్నుమూత
ఎవరు: చరణ్ జీత్ సింగ్
ఎప్పుడు: జనవరి 27
ప్రముఖ మరాఠీ రచయిత సామజిక కార్యకర్త డాక్టర్ అనిల్ అవచత్ కన్నుమూత :

ప్రముఖ మరాఠీ రచయిత, సామాజిక కార్యకర్త డాక్టర్ అనిల్ అవచత్ (78) సుదీర్ఘ అస్వస్థతతో పునె లోని తన నివాసంలో మరణించారు.పుణే జిల్లాలోని ఒటూర్ లో జన్మించిన అవచత్ బీజే మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ చదివారు, అవచత్ మానన, స్వతహషయి, గర్ కార్యరత్, కార్యమగ్న వంటి పలు పుస్తకాలు రచించారు. పట్టు మురారీ మేగజైన్లు, ఇతర ప్రచురణలకు ఆయన తరచూ వ్యాసాలు రాస్తుండేవాడు. జర్నలిజంలోనూ ప్రవేశమున్న డాక్టర్ అచవత్ రిపోర్టింగ్ శైలిలో అందించే రచనలు. పాఠకులను ఆకట్టుకునేవి. పలు సామాజిక అంశాలపైనా ఆయన పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ మరాఠీ రచయిత సామజిక కార్యకర్త డాక్టర్ అనిల్ అవచత్ కన్నుమూత
ఎవరు: అనిల్ అవచత్
ఎప్పుడు: జనవరి 27
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |