
Daily Current Affairs in Telugu 26&27 November – 2022
అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన విషయంలో ప్రపంచ రికార్డు నమోదు చేసి గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కిన బిసిసిఐ :

బీసీసీఐ మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. ఒక టీ20 మ్యాచ్ కు అత్యధిక సంఖ్యలో ప్రేక్ష కులు హాజరైన విషయంలో ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది మే 29న ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ 1,01,566 మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సంఖ్య- ఇప్పుడు గిన్నిస్ పుస్తకాల్లోకి ఎక్కింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ, గిన్నిస్ ప్రపంచ రికార్డును బిసిసిఐ కార్యదర్శి జై షా స్వీకరిస్తున్న ఫొటోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఆ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్, టైటాన్స్ గెలిచిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి : అత్యధిక సంఖ్యలో ప్రేక్ష కులు హాజరైన విషయంలో ప్రపంచ రికార్డు నమోదు చేసి గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కిన బిసిసిఐ :
ఎవరు : బిసిసిఐ
ఎప్పుడు : నవంబర్ 27
గాంధీ మండేలా పురస్కారం 2022 -23 అందుకున్న ఆధ్యాత్మిక గురువు దలైలామా :

గాంధీ మండేలా పురస్కారం 20223 టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా అందుకున్నారు. 2022, నవంబరు 19న హిమాచల్ ప్రదేశ్ లోని మెక్లాయిడ్ గంజ్ లో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరేకర్ ఈ పురస్కా రాన్ని దలైలామాకు ప్రదానం చేశారు. గాంధీ, నెల్సన్ మండేలా ఆశయ సాధనకు పోరాడే ఆసియా, ఆఫ్రికా దేశాల నేతలకు గాంధీ -మండేలా ఫౌండేషన్ వారు 2019 నుంచి ఈ పురస్కారాన్ని అందిస్తోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : గాంధీ మండేలా పురస్కారం 2022 -23 అందుకున్న ఆధ్యాత్మిక గురువు దలైలామా
ఎవరు : ఆధ్యాత్మిక గురువు దలైలామా
ఎప్పుడు : నవంబర్ 27
మహిళల సింగి ల్స్ లో కాంస్య పతకం గెలుచుకున్న భారత క్రీడాకారిణి మనికా బాత్రా :

ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారిణి మనికా బాత్రా మహిళల సింగిల్స్ లో కాంస్య పతకం నెగ్గింది. ఈ టోర్నీ చరిత్రలో పతకం సాధించిన తొలి భారతీయ ప్లేయర్ గా ఈమె ఘనత సాధించింది. బ్యాంకాక్ లో జరిగిన మహిళల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్ లో మనికా జపాన్ క్రీడాకారిణి హేనా హయాటాపై విజయం సాదించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : మహిళల సింగి ల్స్ లో కాంస్య పతకం గెలుచుకున్న భారత క్రీడాకారిణి మనికా బాత్రా
ఎవరు : భారత క్రీడాకారిణి మనికా బాత్రా
ఎప్పుడు : నవంబర్ 26
మిసెస్ ఆసియా యూఎస్ఏ 2023 విజేతగా నిలిచిన సరోజా అల్లూరి :

సరోజా అల్లూరి మిసెస్ ఆసియా యూఎస్ఏ 2023 విజేతగా నిలిచింది. ఈ టైటిల్ గెలుచుకున్న తొలి దక్షిణ భాతర తెలుగు మహిళ గ ఆమె నిలిచింది. ప్రధాన టైటిల్ తో పాటు ఆమెకు ‘మిసెస్ పాపులారిటీ’ ‘పీపుల్స్ చాయిస్’ అవార్డులు కూడా వరించాయి. మిస్ అండ్ మిసెస్ ఏషియా యూఎస్ఏ అంతర్జాతీయ పోటీ గ్రాండ్ ఫినాలే నవంబర్ 19న జరిగింది. అది కూడా కాలిఫోర్నియాలో విడ్జిలియా ప్రొడక్షన్స్ ఇంక్ సంస్థ వారి 34వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : మిసెస్ ఆసియా యూఎస్ఏ 2023 విజేతగా నిలిచిన సరోజా అల్లూరి
ఎవరు : సరోజా అల్లూరి
ఎప్పుడు : నవంబర్ 27
ఐదు వరల్డ్ కప్ టోర్నీ లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డ్ సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో :

పోర్చు గల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఐదు వరల్డ్ కప్ ట్ ర్నీల్లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ -2022 మెగా ఈవెంట్ లో ఈ ఫీట్ సాధించాడు. క్రిస్టియానో రొనాల్డో 2006 ఫిఫా వరల్డ్ కప్ నుంచి వరుసగా, 2010, 2014, 2018, 2022లో గోల్ సాధించాడు. కాగా ప్రపంచకప్ టోర్నీల్లో ఇది అతడికి ఎనిమిదో గోల్ కావడం గమనార్హం.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐదు వరల్డ్ కప్ టోర్నీ లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డ్ సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
ఎవరు : క్రిస్టియానో రొనాల్డో
ఎప్పుడు : నవంబర్ 26
జాతీయ పాల దినోత్సవ౦ గా నవంబర్ 26 :

పాల ప్రాముఖ్యత మరియు వాని ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారు.కాగా ఈ జాతీయ పాల దినోత్సవాన్నిఈ రోజు శ్వేత విప్లవ పితామహుడిగా పిలువబడే డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి.2022 మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా” డాక్టర్ వర్గీస్ కురియన్ 101వ భారతదేశం పాల ఉత్పత్తిలో అతిపెద్దది. పాలను మనుషులే కాదు జంతువులు కూడా ఆహారంగా తీసుకుంటాయి.ప్రపంచ పాల ఉత్పత్తిలో 23 శాతం భారతే. భారతదేశంలో పాల ఉత్పత్తి 1950-51లో 17 MT నుండి 2020-21 నాటికి 209, 96 MTకి పెరిగింది. ప్రపంచ పాల దినోత్సవం కూడా ప్రతి సంవత్సరం జూన్ 1న జరుపుకుంటారు. దీనిని ఆహార మరియు వ్యవసాయ సంస్థ స్థాపించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ పాల దినోత్సవ౦ గా నవంబర్ 26
ఎప్పుడు : నవంబర్ 26
2023 లో జరగనున్న భారత గణతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరవనున్న ఈజిప్ట్ అద్యక్షుడు అబ్దేల్ ఫతా ఎల్ సిసి :

జనవరి లో జరగనున్న భారత గణతంత్ర్య వేడుకలకు ఈజిప్ట్ అద్యక్షుడు అబ్దేల్ ఫతా ఎల్ సిసి ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉంది విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ గారు గత నెలలో కైరో పర్యటించిన సందర్బంగా అబ్దేల్ ఫతా ను భారత్ రావాలసి౦దిగా ఆహ్వానించినట్లు సమాచారం. గణతంత్ర్య వేడుకలకు ఈజిప్ట్ అద్యక్షుడు ముఖ్య అతిధిగా వస్తే ఇదే తొలి సారి అవుతుంది. కాగా 2021 ,2022 సంవత్సరాలకు గాను ముఖ్య అతిధిగా భారత్ ఎవరిని ఆహ్వానించలేదు
క్విక్ రివ్యు :
ఏమిటి : 2023 లో జరగనున్న భారత గణతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరవనున్న ఈజిప్ట్ అద్యక్షుడు అబ్దేల్ ఫతా ఎల్ సిసి
ఎవరు : ఈజిప్ట్ అద్యక్షుడు అబ్దేల్ ఫతా ఎల్ సిసి
ఎప్పుడు : నవంబర్ 26
ప్రముఖ సీనియర్ హింది నటుడు విక్రం గోఖలే కన్నుమూత :

సీనియర్ హింది నటుడు విక్రం గోఖలే గారు కన్నుమూసారు. గత కొని నెలలుగా ముంబాయ్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నవంబర్ 27న తుది శ్వాస విడిచారు.థియేటర్ నటుడిగా ఆయన కెరీర్ మొదలుపెట్టి బుల్లి తెరపైన వెండి తెరపైన పలు పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన హింది తో పాటు మరాటి చిత్రాలలో అయన నటించారు. అగ్ని పాత్ భూల్ భులాయ నట సామ్రాట్ ,మిషన్ మంగళ్ ,వంటి తదుపరి చిత్రాలలో నటించారు.2013 లో వచ్చిన మరాటి చిత్రం అనుమతి లో నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ సీనియర్ హింది నటుడు విక్రం గోఖలే కన్నుమూత
ఎవరు : విక్రం గోఖలే
ఎప్పుడు : నవంబర్ 27
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |