
Daily Current Affairs in Telugu 26&27-02-2022
భారతీయ రైల్వే మొదటి సోలార్ ప్లాంట్ ను ప్రారమిబించానున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం :

భారతీయ రైల్వే మొదటి సోలార్ ప్లాంట్ మధ్యప్రదేశ్ లో ప్రారంభించబడింది. 1.7 మెగావాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్ ను మధ్యప్రదేశ్ లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ప్రారంభించింది. ఇది భారతీయ రైల్వేలు తమ విద్యుత్ అవసరాల కోసం స్వయం ప్రతిపత్తిని పొందేలా చేస్తుంది. ఇది భారతీయ రైల్వేలు తమ విద్యుత్ అవసరాల కోసం స్వయం ప్రతిపత్తిని పొందేలా చేస్తుంది. ట్రాక్షన్ పవర్ ను నేరుగా అందించడానికి భారతీయ రైల్వే నెట్ వర్క్స్ లో ఇది మొదటి సోలార్ పవర్ ప్లాంట్.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతీయ రైల్వే మొదటి సోలార్ ప్లాంట్ ను ప్రారమిబించానున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు: మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: మధ్యప్రదేశ్ రాష్ట్ర౦
ఎప్పుడు: ఫిబ్రవరి 27
యు.ఎన్ సెక్రటరి కౌన్సిల్లో ఓటింగ్ దూరంగా ఉన్న భారత్ చైనా దేశాలు :

ఉక్రెయిన్ పైన జరుపుతున్న రష్యా సైనిక చర్యను ఖండిస్తూ ఐరాస భద్రతా మండలిలో ఫిబ్రవరి 27న ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా దేశం వీటో ద్వారా అడ్డుకొంది. ఓటింగు భారత్ తో పాటు. చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లు కూడా దూరంగానే ఉండిపోయాయి. కాగా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలుండగా, తీర్మానానికి అనుకూలంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, మెక్సికో తదితర 11 దేశాలు ఓటు వేశాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: యు.ఎన్ సెక్రటరి కౌన్సిల్లో ఓటింగ్ దూరంగా ఉన్న భారత్ చైనా దేశాలు
ఎవరు: భారత్ చైనా దేశాలు
ఎప్పుడు: ఫిబ్రవరి 27
‘దేశంలో మొట్టమొదటి’ ఎలక్ట్రానిక్ వ్యర్థాల పర్యావరణనుకూల పార్క్ ప్రారంబించనున్న డిల్లి :

రాష్ట్రము లో పెరుగుతున్న ఈ వ్యర్థాలను నిర్వహించడానికి దేశ రాజధానిలో ‘దేశంలో మొట్టమొదటి’ ఎలక్ట్రానిక్ వ్యర్థాల పర్యావరణ అనుకూల పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 20 ఎకరాల స్థలంలో పార్కును నిర్మించనున్నట్లు సిసోడియా తెలియజేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏటా 2 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి (ఈ వేస్ట్ ఎకో-పార్క్ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ రీసైక్లింగ్ మరియు రీ-మాన్యుఫ్యాక్చరింగ్ పనులు సురక్షితంగా మరియు శాస్త్రీయ పద్ధతిలో జరుగుతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘దేశంలో మొట్టమొదటి’ ఎలక్ట్రానిక్ వ్యర్థాల పర్యావరణనుకూల పార్క్ ప్రారంబించనున్న డిల్లి
ఎవరు: డిల్లి
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: ఫిబ్రవరి 27
పారా ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ లో రజతం గెలుచుకున్న భారత ఆర్చర్ పూజ :

పారా ప్రపంచ ఆర్చరీ భారత ఆర్చర్ పూజ రజతం గెలుచు కుంది. ఫైనల్లో ఆమె 3-7తో ఇటలీకి పెట్రిలి విన్సెంజా (ఇటలీ) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీస్ లో 6-2తో హేజెల్ చైస్టీ (ఇంగ్లాండ్)పై గెలిచిన పూజ. పారా ప్రపంచ ఆర్చరీ వ్యక్తిగత ఈవెంట్లో ఫైనల్ చేరిన భారత తొలి ఆర్చర్ గా ఘనత సాధించింది. టీమ్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగే పోరులో మంగోలియా జోడీతో పూజ పూజ ఖన్నా జంట పోటీపడనుంది. మరోవైపు కాంపౌండ్ మిక్సిడ్ జోడీ శ్యాంసుందర్ స్వామి జ్యోతి బలియాన్ జంట రజత పతకం గెలుచుకున్నది. కాగా ఇది భారత్ కు తొలి పతకం. 2017 బీజింగ్, 2019 డెన్ బాష్ (నెదర్లాండ్స్) ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ బరిలో దిగింది. 2019లో రాకేశ్ కాంస్యానికి దగ్గరగా వచ్చిన పతకం సాధించలేకపోయాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పారా ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్లో రజతం గెలుచుకున్న భారత ఆర్చర్ పూజ
ఎవరు: భారత ఆర్చర్ పూజ
ఎప్పుడు: ఫిబ్రవరి 27
మెక్సికన్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ :

టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ మెక్సికన్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల జరిగిన సింగిల్స్ ఫైనల్లో నాదల్ 6-4, 6–4తో కామెరూన్ -నాదల్ నోరి (బ్రిటన్)ని ఓడించాడు. తొలి సెట్లో అయిదో గేమ్ లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన నాదల్ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత 5 నిమిషాల్లో తొలి సెట్ దక్కించుకున్నాడు. రెండో సెట్ లోనూ రఫెల్ నాదల్ దే జోరు సాగింది తొలి గేమ్ లోనే అతడు బ్రేక్ సాధించాడు. అయితే ఆ తర్వాత నోరి పుంజుకున్నా అయిదో గేమ్ మరోసారి ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన నాదల్ సెట్ తో పాటు మ్యాచ్ ను గెలుచుకున్నాడు. 35 ఏక నాదలక్కు కెరీర్ లో ఇది 91వ ఏటిపి టైటిల్.
క్విక్ రివ్యు :
ఏమిటి: మెక్సికన్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్
ఎవరు: రాఫెల్ నాదల్
ఎప్పుడు: ఫిబ్రవరి 27
స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో పసిడి పథకం గెలుచుకున్న నిఖత్ జరీన్ :

తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పంచ్. పసిడి పతకంను ముద్దాడింది. స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆమె మరోసారి స్వర్ణాన్ని అందుకుంది. 2019లో ఈ టోర్నీలో ఛాంపియన్ గా నిలిచిన ఈ 25 ఏళ్ల అమ్మాయి.మరోసారి ఆ ప్రదర్శన పునరావృతం చేసింది. ఫిబ్రవరి 27న మహిళల 52 కేజీల విభాగంలో ఫైనల్లో నిఖత్ 4-1 తేడాతో బెటియానా (ఉక్రెయిన్)ను ఓడించింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించిన నిఖత్ ముష్టిఘాతాలతో విరుచుకుపడింది. మరో భారత బాక్సర్ నీతూ కూడా బంగారు పతకాన్ని గెలుచుకుంది. 48 కేజీల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. హరియా చెందిన 21 ఏళ్ల నీతూ తుదిపోరులో 5-0తో ఎరిక (ఇటలీ)ని చిత్తు చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో పసిడి పథకం గెలుచుకున్న నిఖత్ జరీన్
ఎవరు: నిఖత్ జరీన్
ఎప్పుడు: ఫిబ్రవరి 26
అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు నిషేదానికి గురైన రష్యా దేశం :

ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యాకు క్రీడల పరంగా దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు ఆ దేశంలో నిర్వహించాల్సిన టోర్నీలను, మ్యాచ్ లను వేరే దేశాలకు తరలించడమో లేదా రద్దు చేయడమో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎస్) షాకిచ్చింది. ఉక్రెయినపై యుద్ధం ప్రకటించడాన్ని నిరసిస్తూ తమ సమాఖ్య గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఉన్న పుతిన్ ను సస్పెండ్ చేసినట్లు ఐజేఎఫ్ ఫిబ్రవరి 27న ప్రకటించింది. దీంతో క్రీడల్లో తన అత్యంత సీనియర్ హోదాను తాత్కాలికంగా పుతిన్ కోల్పోయారు. జూడో అభిమాని అయిన పుతిన్ 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా స్టేడియానికి వెళ్లి మరీ అథ్లెట్ల పోరాటాలను వీక్షించారు. మరో వైప పుతిన్ స్నేహితుడు అర్కాడీ రోజెన్ బర్గ్ మాత్రం ఐజేఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో అభివృద్ధి మేనేజర్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే రష్యా, బెలారస్ నిర్వహించాల్సిన టోర్నీలను అక్కడి నుంచి తరలించాలని లేదా రద్దు చేసుకోవాలని క్రీడా సమాఖ్య లను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కోరిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు నిషేదానికి గురైన రష్యా దేశం
ఎవరు: రష్యా దేశం
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: ఫిబ్రవరి 26
ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వా కన్నుమూత :

ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ (82) కన్నుమూసారు. రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా పేరొందిన హేమానంద రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తొలుత 1989 డిసెంబర్ 7వ తేదీ నుంచి 1990 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండోసారి 1999 డిసెంబర్ 6వ తేదీ నుంచి 2000 మార్చి 5వ తేదీ వరకువరకు ముఖ్యమంత్రిగా ఈయన బాధ్యతలు చేపట్టారు. 1974లో ఝార్పుగుడ జిల్లా, లయికెరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో సుందర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వా కన్నుమూత
ఎవరు: హేమానంద బిశ్వా
ఎక్కడ:ఓడిశా
ఎప్పుడు: ఫిబ్రవరి 26
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |